By: ABP Desam | Updated at : 23 Apr 2022 02:30 PM (IST)
మెగాస్టార్ కొత్త ప్రాజెక్ట్ - అది కూడా మల్టీస్టారరే!
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు చాలా సినిమాలు కమిట్ అయ్యారు చిరు. మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' సినిమాలో నటిస్తున్నారు. ఇది మలయాళ సినిమా 'లూసిఫర్'కి రీమేక్. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి ఆర్టిస్ట్ లు నటిస్తున్నారు.
అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్', బాబీ దర్శకత్వంలో 'వాల్తేర్ వీర్రాజు' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా నటించడానికి అంగీకరించారు మెగాస్టార్. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను లాక్ చేశారు. ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని సమాచారం. సమాజంలో ఓ ఇష్యూని చాలా కమర్షియల్ గా చూపించబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ బయటకొచ్చింది. అదేంటంటే.. ఇదొక మల్టీస్టారర్ సబ్జెక్ట్. ఇందులో చిరంజీవితో పాటు మరో స్టార్ హీరో కూడా ఉంటారట. ప్రస్తుతం కొందరు హీరోల పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరినీ ఫైనల్ చేయలేదు. ఇప్పటికే 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు చిరు. బాబీ డైరెక్ట్ చేయబోయే సినిమాలో రవితేజను కీలకపాత్ర కోసం తీసుకున్నారు. అలా చూసుకుంటే ఈ రెండు సినిమాలు మల్టీస్టారర్ అనే చెప్పాలి.
ఇప్పుడు వెంకీ కుడుములు సినిమా కోసం కూడా స్టార్ రేంజ్ ఉన్న హీరోను తీసుకురాబోతున్నారు. మరికొద్దిరోజుల్లోనే సెకండ్ హీరో ఎవరనే విషయంపై క్లారిటీ రానుంది. ఈ సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకుంటారని ప్రచారం జరిగింది కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. చిరుకి తగినట్లుగా ఓ సీనియర్ హీరోయిన్ ను రంగంలోకి దింపనున్నారు.
Also Read:సివిల్ కోర్టు జడ్జ్ మీద కేసుకు వర్మ రెడీ - ఆర్జీవీ వర్సెస్ నట్టి కుమార్ గొడవలో కొత్త ట్విస్ట్
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
Akhil Sardhak: ఆ విషయంలో ‘అఖిలే నెంబర్ వన్’, సీజన్-4 హిస్టరీ రిపీట్, కానీ..
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !
Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
Jammu Tunnel Collapse: సొరంగం కూలిన ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య, పూర్తయిన రెస్క్యూ ఆపరేషన్