Megastar Chiranjeevi: సల్మాన్ తో చిరు స్టెప్పులు, మాములుగా ఉండదు మరి
'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ ఖాన్ తో కలిసి స్టెప్పులేయబోతున్నారు మెగాస్టార్.
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన 'గాడ్ ఫాదర్' అనే సినిమాలో నటిస్తోన్న. మలయాళ సినిమా 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్నటిస్తున్నారు . సల్మాన్ ఖాన్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను, ఫైట్ ను చిత్రీకరించారు. మలయాళంలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలో సల్మాన్ కనిపించనున్నారు.
నిజానికి పృథ్వీరాజ్ రోల్ చాలా చిన్నది. కానీ తెలుగులో సల్మాన్ ఖాన్ ఆ రోల్ పోషిస్తుండడంతో దాని పరిధిని పెంచారు. ఇందులో భాగంగా ఓ పాటను కూడా యాడ్ చేశారు. ఆ పాత్రలో చిరంజీవి, సల్మాన్ కలిసి స్టెప్పులు వేయబోతున్నారు. ఈ వారంలోనే ఈ పాటను ముంబైలో చిత్రీకరించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాట కోసం ఓ ట్యూన్ ను కూడా రెడీ చేశారు. జానీ మాస్టర్ నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరించనున్నారు.
తెరపై చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమాకి ఈ సాంగ్ హైలైట్ గా నిలవనుంది. ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. చిరంజీవి మీద అభిమానంతో సినిమా చేశారు సల్మాన్ ఖాన్. ఇక ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Also Read: నామినేషన్స్ హీట్ - అజయ్, అషులతో హమీద గొడవ
View this post on Instagram
View this post on Instagram