News
News
X

Chiranjeevi Bhola Shankar Shoot : భోళా శంకరుడితో దర్శకేంద్రుడు - చిరు సెట్స్‌లో స్పెషల్ మూమెంట్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'భోళా శంకర్'. ఈ రోజు షూటింగులో ఓ స్పెషల్ మూమెంట్ చోటు చేసుకుంది. అది ఏమిటంటే?

FOLLOW US: 
Share:

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు (K Raghavendra Rao)లది సూపర్ హిట్ కాంబినేషన్. 'జగదేకవీరుడు అతిలోక సుందరి', 'రౌడీ అల్లుడు', 'ఘరానా మొగుడు' వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు ఎన్నో వాళ్ళ కలయికలో వచ్చాయి. వాళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత సినిమా షూటింగులో కలుసుకున్నారు. 

'భోళా శంకర్' సాంగ్ షూటింగుకు...
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). ప్రస్తుతం హైదరాబాదులో చిత్రీకరణ జరుగుతోంది. ఆ సెట్స్ కు రాఘవేంద్ర రావు వెళ్ళారు. కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న పాటను చూసిన దర్శకేంద్రుడు... ''నేను చిరంజీవి 'చూడాలని వుంది' సెట్స్ కు కూడా వెళ్ళాను. అప్పుడు 'రామ్మా చిలకమ్మా' సాంగ్ తీస్తున్నారు. అది కూడా కోల్‌కతా నేపథ్యంలో ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ షూటింగ్ చూస్తుంటే... ఆ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఆ పాటలా ఈ పాట కూడా చార్ట్ బస్టర్ అవుతుంది. ఆ సినిమా తరహాలో కోల్‌కతా నేపథ్యంలో రూపొందుతోన్న 'భోళా శంకర్' కూడా భారీ హిట్ సాధిస్తుంది'' అని చెప్పారు. సంక్రాంతికి విడుదలైన 'వాల్తేరు వీరయ్య' విజయం సాధించడంతో చిరంజీవిని రాఘవేంద్ర రావు అభినందించారు. 

కోల్‌కతా నేపథ్యంలో...
200 మంది డ్యాన్సర్లతో!
'భోళా శంకర్' కోసం ఇప్పుడు చిరంజీవి, సినిమాలో ఆయనకు సోదరిగా నటిస్తున్న కీర్తీ సురేష్, సురేఖా వాణి, రఘుబాబు, 'వెన్నెల' కిశోర్, 'గెటప్' శ్రీను తదితర తారాగణంపై పాటను తెరకెక్కిస్తున్నారు. కోల్‌కతా నేపథ్యంలో చిత్రీకరిస్తున్న ఈ పాటలో 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని చిత్ర బృందం తెలిపింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. 

Also Read నారా, నందమూరి కుటుంబాలకు ఎన్టీఆర్ దూరమా? చెక్ పెట్టిన బ్రాహ్మణి, ప్రణతి 

'భోళా శంకర్'లో చిరంజీవి చెల్లెలి పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత కీర్తీ సురేష్, చిరు సరసన కథానాయికగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత చిరు, తమన్నా నటిస్తున్న చిత్రమిది. ఆ సినిమాలో ఇద్దరి మధ్య ఓ మెలోడీ షూట్ చేసినప్పటికీ... విడుదల చేశారు. సినిమాలో ఆ పాటకు కత్తెర వేశారు. తర్వాత కూడా బయటకు రానివ్వడం లేదు. సో... 'భోళా శంకర్'లో ఇద్దరు జంటగా చేసే డ్యాన్స్ ప్రేక్షకులు చూడొచ్చు. త్వరలో తమన్నా షూటింగులో జాయిన్ కానున్నారు. 

Also Read 'ఇండియన్ ఐడల్ 2' షురూ - తమన్ వచ్చాడు, నిత్యా మీనన్ ఎక్కడ?

ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ  నిర్మిస్తున్న చిత్రమిది. మణిశర్మ కుమారుడు, యువ సంగీత సంచలనం మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, అర్జున్ దాస్, రష్మీ గౌతమ్, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రధాన తారాగణంపై కొన్ని సన్నివేశాలు కూడా తెరకెక్కించారు.  

తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం'కు రీమేక్ ఇది. ఈ సినిమాలో చిరు గుండుతో కనిపించవచ్చు. ఆ మధ్య సోషల్ మీడియాలో గుండు లుక్ పోస్ట్ చేసింది కూడా ఈ సినిమా టెస్టింగ్ లో భాగమే. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ పర్యవేక్షణ: సత్యానంద్, సంభాషణలు: తిరుపతి మామిడాల, కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్.

Published at : 11 Feb 2023 04:19 PM (IST) Tags: K Raghavendra Rao Tamannaah Keerthy Suresh Bhola Shankar Movie Chiranjeevi

సంబంధిత కథనాలు

Priyanka Nalkari Wedding: గుడిలో రహస్య వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి, వరుడు ఎవరో తెలుసా?

Priyanka Nalkari Wedding: గుడిలో రహస్య వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి, వరుడు ఎవరో తెలుసా?

ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట

ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట

అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన

అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన

Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్

Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్

Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు

Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు

టాప్ స్టోరీస్

TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

TSPSC Exams :  రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ