Telugu Indian Idol 2 : 'ఇండియన్ ఐడల్ 2' షురూ - తమన్ వచ్చాడు, నిత్యా మీనన్ ఎక్కడ?
'అన్‌స్టాపబుల్ 2'ను సక్సెస్‌ఫుల్‌గా ముగించిన 'ఆహా' ఓటీటీ టీమ్... 'ఇండియన్ ఐడల్ 2' షూటింగ్ స్టార్ట్ చేసింది. అయితే, షూటింగులో తమన్ ఒక్కడే కనిపించడం అనుమానాలు మొదలయ్యాయి.
'అన్‌స్టాపబుల్' రెండో సీజన్ విజయవంతంగా ముగిసింది. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణతో జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సందడి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆ షో కంప్లీట్ కావడంతో ఇప్పుడు కొత్త షో మీద ఆహా టీమ్ కాన్సంట్రేట్ చేసింది. 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' చిత్రీకరణ మొదలు పెట్టింది.
తమన్ వచ్చాడు...
నిత్యా మీనన్ ఎక్కడ?
'ఆహా'లో స్ట్రీమింగ్ కానున్న రియాలిటీ షోలలో సింగింగ్ షో 'తెలుగు ఇండియన్ ఐడల్' ఒకటి. ఫస్ట్ సీజన్ వీక్షకులను ఎంటర్టైన్ చేసింది. దాంతో రెండో సీజన్ స్టార్ట్ చేశారు.
Thaman spotted on the sets of Aha Telugu Indian Idol 2 : 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' షూటింగ్ స్పాట్‌లో సంగీత దర్శకుడు తమన్ కనిపించారు. ఈ మధ్య తమన్ స్టైలిష్ డ్రస్సింగ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడీ షూటింగుకు కూడా ఆయన సూపర్ స్టైలిష్‌గా వచ్చారు.
తమన్ 'ఇండియన్ ఐడల్ 2' ఫస్ట్ సీజన్ కూడా చేశారు. షోలో న్యాయ నిర్ణేతగా కనిపించారు. అందువల్ల, ఆయన షూటింగ్ చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే... ఇప్పుడు ఆయనతో పాటు 'తెలుగు ఇండియన్ ఐడల్ 1'లో న్యాయ నిర్ణేతగా చేసిన నిత్యా మీనన్ షూటింగ్ స్పాట్‌లో ఎక్కడా కనిపించలేదు. దాంతో కొత్త అనుమానాలు మొదలు అయ్యాయి.
నిత్యాను తీసేశారా?
షో ఫార్మాట్ మార్చారా?
'తెలుగు ఇండియన్ ఐడల్'కు తమన్, నిత్యా మీనన్, సింగర్ కార్తీక్ న్యాయ నిర్ణేతలుగా చేశారు. ఇప్పుడు రెండో సీజన్ షూటింగ్ హైదరాబాదులోని ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. అక్కడ తమన్ మినహా మిగతా ఇద్దరూ కనిపించలేదు. సింగింగ్ షో ఫార్మటును 'ఆహా' టీమ్ ఈసారి చేంజ్ చేసిందా? లేదంటే నిత్యాను తప్పించి మరొకరును తీసుకు వస్తారా? ఒకవేళ నిత్యాను తప్పిస్తే... ఆమె స్థానంలో ఎవరు వస్తారు? వెయిట్ అండ్ సి. ఆహా వర్గాలు ఇంకా అధికారికంగా ఏ వివరాలూ వెల్లడించలేదు.
Also Read : నారా, నందమూరి కుటుంబాలకు ఎన్టీఆర్ దూరమా? చెక్ పెట్టిన బ్రాహ్మణి, ప్రణతి
'తెలుగు ఇండియన్ ఐడల్' ఫస్ట్ సీజన్ గత ఏడాది జూన్ నెలలో ముగిసింది. అది సుమారు 15 వారాల పాటు సాగింది. అందులో పాల్గొనాలని ఎంతో మంది యువతీ యువకులు ప్రయత్నించారు. చివరకు 12 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఆ ఫస్ట్ సీజన్ విషయానికి వస్తే... పోటీలోని 12 మందిలో చివరకు ఐదుగురు తుది మజిలీకి చేరుకున్నారు. జయంత్ (రామగుండం), వాగ్దేవి (నెల్లూరు), శ్రీనివాస్ (కడప), వైష్ణవి (చెన్నై), ప్రణతీ (హైదరాబాద్) ఆ ఐదుగురు కాగా ... వారిలో వాగ్దేవి విజేతగా నిలిచింది. ఆ ఫైనల్ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. వాగ్దేవి పాడిన 'ఆట కావాలా... పాట కావాలా'కు ఆయన మెస్మరైజ్ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలో ఓ పాట పాడే అవకాశం వాగ్దేవికి ఇస్తానని చెప్పారు. ''త్వరలోనే నువ్వు పాడే పాట నేను హీరోయిన్‌తో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం వస్తుంది'' అని మెగాస్టార్ వెల్లడించారు. అప్పట్లో 'తెలుగు ఇండియన్ ఐడల్' షోలో బాలకృష్ణతో పాటు మరికొంత మంది స్టార్లు సందడి చేశారు. ఈ సీజన్ కు కూడా స్టార్స్ రానున్నారు.
Also Read : 'బింబిసార' కంటే ఎక్కువా, తక్కువా? కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్