By: ABP Desam | Updated at : 11 Feb 2023 01:02 PM (IST)
నందమూరి కళ్యాణ్ రామ్
కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసే టాలీవుడ్ కథానాయకులలో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఒకరు. ఆయనకు సరైన, సాలిడ్ సినిమా పడితే... బాక్సాఫీస్ బరిలో రిజల్ట్ ఎలా ఉంటుందో 'బింబిసార' చూపించింది. ఆ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'అమిగోస్'. దీనికి వసూళ్ళు ఎలా ఉన్నాయి? 'బింబిసార' కంటే ఎక్కువ వచ్చాయా? తక్కువ వచ్చాయా? అనేది చూస్తే...
'అమిగోస్ ' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
'అమిగోస్' సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 4.65 కోట్ల గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. నైజాంలో మొదటి రోజు 71 లక్షల రూపాయలు కలెక్ట్ చేసిందట. సీడెడ్ విషయానికి వస్తే రూ. 31 లక్షలు వచ్చాయట. ఏపీలో మిగతా ఏరియాలు కలిపితే మూడున్నర కోట్లు గ్రాస్ వచ్చిందట. షేర్ విషయానికి వస్తే రూ. 2.03 కోట్లు వచ్చాయని సమాచారం.
కళ్యాణ్ రామ్ లాస్ట్ ఓపెనింగ్స్ చూస్తే...
'బింబిసార' సినిమాతో కంపేర్ చేస్తే... 'అమిగోస్'కు తక్కువ వచ్చాయని చెప్పాలి. ఆ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఆరున్నర కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన 'ఇజం' సినిమాకు మూడు కోట్ల రూపాయల కంటే ఎక్కువ వచ్చింది. ఆఖరికి 'ఎమ్మెల్యే'కు రూ. 2.72 కోట్లు, 'ఎంత మంచివాడవురా'కు రూ. 2.20 కోట్లు వచ్చాయి. ఆ సినిమాలతో కంపేర్ చేసినా... 'అమిగోస్'కు ఫస్ట్ డే ఓపెనింగ్ తక్కువే.
ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన!?
'అమిగోస్'లో నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశారు. విడుదలకు ముందు సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ 'ధర్మ క్షేత్రం' సినిమాలో 'ఎన్నో రాత్రులు వస్తాయి...' సాంగ్ రీమిక్స్ చేయడం కూడా బజ్ పెంచింది. అయితే... బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ మాత్రం తక్కువ ఉన్నాయి. సినిమాలో రీమిక్స్ సాంగ్ బావుందని ఎక్కువ మంది చెబుతున్నారు.
Also Read : నారా, నందమూరి కుటుంబాలకు ఎన్టీఆర్ దూరమా? చెక్ పెట్టిన బ్రాహ్మణి, ప్రణతి
'అమిగోస్'కు అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. సూపర్ హిట్ టాక్ రాలేదు. మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ వేరియేషన్స్ చూపించినా... నటుడిగా ఆయన కష్టపడినప్పటికీ... దర్శకత్వ లోపం వల్ల కాన్సెప్ట్ సరిగా ఎగ్జిక్యూట్ కాలేదనే కామెంట్స్ వచ్చాయి.
మైత్రీలో హ్యాట్రిక్?
'అమిగోస్' వసూళ్ళు పక్కన పెడితే... చిత్ర నిర్మాతలు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి సంతోషం వ్యక్తం చేశారు. 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' తర్వాత తమ సంస్థకు మరో విజయం వచ్చిందని, తమకు ఇది హ్యాట్రిక్ అని చెబుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మౌత్ టాక్ బావుందని, ప్రతి షోకి కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పారు. ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. కన్నడ భామ ఆషికా రంగనాథ్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సినిమా బడ్జెట్ రికవరీ అయ్యిందని టాక్. ఆల్రెడీ నిర్మాతలు లాభాల్లో ఉన్నారట.
Also Read : హాట్‌స్టార్‌లో తమన్నా సిరీస్ - చిరు, రజనీ సినిమాలపై అప్డేట్స్!
Casting Couch: రాత్రికి కాఫీకి వెళ్దాం రమ్మంది, అనుమానం వచ్చి.. - క్యాస్టింగ్ కౌచ్‌పై ‘రేసు గుర్రం’ రవి కిషన్
Desamuduru Re-release: అదిరిపోనున్న ఐకాన్ స్టార్ బర్త్ డే, రీరిలీజ్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!
BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్ తర్వాత మూడో కెప్టెన్!