RIP Dilip Kumar : చిరు, ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్!
బాలీవుడ్ లెజండరీ యాక్టర్ దిలీప్ కుమార్(98) మరణ వార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది.
బాలీవుడ్ లెజండరీ యాక్టర్ దిలీప్ కుమార్(98) మరణ వార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పలువురు సినీ తారలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన దిలీప్ కుమార్ మరణం ఎంతో బాధిస్తుంది. ఆయనొక యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్, నేషనల్ ట్రెజర్. దశాబ్దాల పాటు ప్రేక్షకులను తన నటనతో మంత్రముగ్ధుల్ని చేసిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ పెట్టారు. అలానే దిలీప్ కుమార్ తన రేర్ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఆయన అందించిన సహకారానికి విలువ కట్టలేం. మిమ్మల్ని చాలా మిస్ అవుతాం.. రెస్ట్ ఇన్ పీస్ సర్ అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
దిలీప్ కుమార్ సర్ ఇప్పుడు మనతో లేరు.. ఆయన ఇప్పటికీ ఎప్పటికీ లెజెండే. ఆయన లెగసీ మన హృదయాల్లో ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటూ దిలీప్ కుమార్ కుటుంబానికి సంతాపం తెలిపారు వెంకటేష్.
ప్రపంచానికి తెలిసిన గొప్ప నటులలో ఒకరైన దిలీప్ కుమార్ మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఒక పెద్ద చెట్టు నేల రాలింది. నేటి తరం నటులు ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలంటూ హీరో సిద్ధార్థ్ ట్వీట్ పెట్టాడు.
మీ నటనతో ఎన్నో ఏళ్లపాటు మాకు వినోదాన్ని అందించినందుకు ధన్యవాదాలు. సినిమా వేదికగా మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారంటూ మెహ్రీన్ రాసుకొచ్చింది.
వెండితెర మీద హీరోలు ఎలా ఉండాలో చూపించిన మొదటి భారతీయ కథానాయకుడు. హీరోకి ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించిన మహానటుడు అంటూ ఆయనకు నివాళులు అర్పించారు సాయి మాధవ్ బుర్రా.
ఈ ప్రపంచానికి చాలా మంది హీరోలై ఉండొచ్చు కానీ మాకు (నటులు) మాత్రం ఆయనే హీరో. సినీ పరిశ్రమకు చెందిన ఓ శకం ఆయనతో ముగిసిపోయింది. ఆయన కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు అక్షయ్ కుమార్.
వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన జీవితంలో కూడా దిలీప్ సర్ తో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన అకాల మరణంకలచివేస్తోంది. సినీ రంగానికి ఆయనొక సంపద, టైమ్ లెస్ యాక్టర్. ఆయన మరణ వార్తతో హృదయం ముక్కలైంది అని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఎమోషనల్ అయ్యారు.