News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Racha Ravi: రచ్చ రవి బర్త్‌ డేలో మెరిసిన టాలీవుడ్ సెలబ్రిటీలు - వీడియో వైరల్!

ఇటీలవ కమెడియన్ రచ్చ రవి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

FOLLOW US: 
Share:

Racha Ravi: టాలీవుడ్ లో తన కామెడీ టైమింగ్ తో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రచ్చరవి. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించినా తర్వాత ‘జబర్దస్త్’ ప్రోగ్రాంతో రచ్చ రవి గా క్రేజ్ సంపాదించుకున్నాడు. రీసెంట్ గా రచ్చరవి పుట్టినరోజు వేడుకలతో పాటు ఆయన వంద సినిమాలు పూర్తి చేసిన సందర్భంగా తన తల్లిదండ్రులకు సన్మానం చేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఇండిస్ట్రీ నుంచి పలువురు సినీ, టీవీ ప్రముఖులు హాజరయ్యి రచ్చరవికు శుభాకాంక్షలు తెలియజేశారు. రచ్చ రవి పుట్టినరోజు నాడు అంటే జులై 27 న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఘనంగా రచ్చ రవి పుట్టిన రోజు వేడుక, వీడియో వైరల్..

అటు సినిమా ఇటు టీవీ ఇండస్ట్రీలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రచ్చరవి. ఇటీవల ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీ నుంచి పలువరు సెలబ్రెటీలు హాజరయ్యారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు బోయపాటి శ్రీను, కమెడియన్ రఘుబాబు అలాగే పలువురు సినీ సెలబ్రెటీలు హాజరయ్యారు. రచ్చరవికు బొకే అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జబర్దస్త్ షో నుంచి పలువురు సీనియర్ కమెడియన్స్ కూడా హాజరయ్యారు. వారితో పాటు ఇండస్ట్రీనుంచి పలువురు సినీ జర్నలిస్ట్ లు కూడా హాజరై రచ్చ రవికు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సినీ ప్రముఖుల రాకతో పుట్టినరోజు వేడుక సందడిగా సాగింది. వాస్తవానికి ఈ రచ్చ రవి పుట్టినరోజు జరిగి దాదాపు వారం గడుస్తోంది. అయితే అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు నెట్టిం వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్ రచ్చ రవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. 

‘జబర్దస్త్’ షోతో గుర్తింపు..

రచ్చరవి తెలంగాణకు చెందిన అబ్బాయి. ఆయన అసలు పేరు దొడ్డపాటి రవి కుమార్. చిన్నప్పటి నుంచే చార్లి చాప్లిన్ సినిమాలు చూసి కమెడియన్ అవ్వాలనుకున్నాడు. అందుకే మిమిక్రీ నేర్చుకొని పలు ప్రదర్శనలు ఇచ్చాడు. ఎలాగైన నటుడు అవ్వాలనే కోరికతో చెల్లెలు ఇచ్చిన డబ్బుతో హైదరాబాద్ వచ్చాడు. అక్కడ సరైన అవకాశాలు రాక దుబాయ్ లో రేడియో జాకీగా కొన్నాళ్లు చేశాడు. అక్కడ నుంచి మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశాడు. అయితే ఓ రోజు ‘జబర్దస్త్’ లో చమ్మక్ చంద్ర టీమ్ లో సభ్యుడు కోసం ఆడిషన్స్ జరగ్గా అందులో పాల్గొని సెలెక్ట్ అయ్యాడు. తర్వాత తన కామెడీ టైమింగ్ తో రచ్చరవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

100 సినిమాలకు పైగానే..

రచ్చ రవికు సినిమాల్లో నటించాలనే కోరిక చిన్నప్పటి నుంచే ఉండేది. అందుకే ముందు మిమిక్రీ నేర్చుకొని ఆ టాలెంట్ తో సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నాడు. అయితే 2013 లో వచ్చిన ‘వంద అబద్దాలు’ సినిమాలో ఓ పాత్రలో నటించాడు. తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. అయితే ‘జబర్దస్త్’ లో రచ్చరవి గా హిట్ అవ్వడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అప్పటినుంచి సినిమాల్లో నటిస్తూ దాదాపు 100 కు పైగా సినిమాల్లో కనిపించాడు రచ్చరవి. ఎప్పటికైనా అన్ని భాషల లోనూ తాను నటించాలనేదే తన కోరిక అని  గతంలో కూడా పలు ఇంట్వ్యూలలో చెప్పుకొచ్చాడు రవి. 

Also Read: ఈ కొరియా హార్రర్ మూవీస్ చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 03 Aug 2023 02:53 PM (IST) Tags: jabardast TOLLYWOOD Racha Ravi Birthday Racha Ravi Comedian Racha Ravi

ఇవి కూడా చూడండి

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా

Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్

Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్

టాప్ స్టోరీస్

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్