అన్వేషించండి

South Korean Horror Movies: ఈ కొరియా హార్రర్ మూవీస్ చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

కొంత మంది ప్రేక్షకులు హార్రర్ మూవీస్ ను చాలా ఇష్టపడతారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు కొన్ని సినిమాలను పరిచయం చేయబోతున్నాం. వీటిని చూస్తే భయంతో గజగజ వణకాల్సిందే!

రొటీన్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ హర్రర్ మూవీస్ చూసి విసిగిపోయారా? అయితే, ఈ కొరియా హర్రర్ సినిమాలు చూడండి. ఇక మీకు నిద్రపట్టదు.

1. ట్రైన్ టు బుసాన్(2016)

‘ట్రైన్ టు బుసాన్’ అనేది 2016లో విడుదలైన దక్షిణ కొరియా యాక్షన్ హారర్ మూవీ. యెయోన్ సాంగ్ హో దర్శకత్వం వహించారు. గాంగ్ యూ, జంగ్ యు మి, మా ప్రధాన పాత్రాల్లో నటించారు. ఈ మూవీ కథ సియోల్ నుంచి బుసాన్ వెళ్లే హై స్పీడ్ రైలులో జరుగుతుంది. ఒక జోంబీ దాడితో ఎలాంటి ఘోర జరుగుతుంది? ఓ తండ్రి, తన కూతురును ఈ ప్రమాదం నుంచి ఎలా కాపాడుకుంటాడు? అనే విషయాన్ని ఇందులో చూపించారు. 10 మిలియన్లకు పైగా థియేటర్‌లలో విడుదలైన తొలి కొరియన్ చిత్రంగా ‘ట్రైన్ టు బుసాన్’ రికార్డు సృష్టించింది.  

2. ది హోస్ట్(2006)

బాంగ్ జూన్ హో దర్శకత్వం వహించిన దక్షిణ కొరియా హార్రర్ మూవీ ‘ది హోస్ట్’. సాంగ్ కాంగ్ హో, బైన్ హీ బాంగ్, పార్క్ హే ఇల్ , బే డూనా, గో ఆహ్ సాంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ సియోల్‌ హాన్ నది నుంచి ఒక వింత జీవి ఉద్భవించడంతో మొదలవుతుంది. ఇది సియోల్ పై విరుచుకుపడి, పలువురిని అపహరిస్తుంది. కిడ్నాప్ అయిన వారిని రక్షించేందుకు చేసే ప్రయత్నాలను ఈ చిత్రంలో చూపించారు. ఈ మూవీలోని ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు అందరినీ ఓ రేంజిలో భయపెడతాయి.  

3. ఎ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్(2003)

‘ఎ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్’ అనేది ఒక సైకలాజికల్ హారర్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా కథ ఇద్దరు అక్కా చెల్లెళ్ల చుట్టూ తిరుగుతుంది. ఒవైపు సవతి తల్లి వారిని తీవ్ర ఇబ్బందులు పెట్టడం, మరోవైపు తమ సొంత తల్లి జ్ఞాపకాలు వెంటాడటం ఇందులో చూపిస్తారు. చివరకు ఆ ఇద్దరు అక్కాచెళ్లెళ్లు సవతి తల్లి కష్టాల నుంచి ఎలా తప్పించుకుంటారు? అనేది ఈ సినిమాలో చూపించారు. కొరియన్ జానపద కథ ఆధారంగా రూపొందించబడిన ఈ మూవీ హార్రర్ ప్రియులను ఆకట్టుకుంటుంది.   

4. థర్స్ట్(2009)

ఒక క్యాథలిక్ ప్రీస్ట్  పూజారి రక్త పిశాచంగా మారి ఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడు అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఎమిలే జోలా రచించిన నవల ‘థెరీస్ రాక్విన్’ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పార్క్ చాన్-వూక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సాంగ్ కాంగ్ హో క్యాథలిక్ పూజారి పాత్రలో నటించారు. వైద్య ప్రయోగం ఫెయిల్ కావడంతో రక్త పిశాచంగా మారి ఎలాంటి ఘోరాలు చేస్తాడు అనేది ఈ చిత్రంలో చూపించారు.  

5. ఐ సా ది డెవిల్(2010)

‘ఐ సా ది డెవిల్’ సినిమా  కిమ్ జీ వూన్ దర్శకత్వంలో తెరకెక్కింది.  లీ బైయుంగ్ హున్, చోయి మిన్ సిక్ ప్రధానపాత్రల్లో నటించారు. NIS ఏజెంట్ కిమ్ సూ-హ్యూన్ తన భార్యను సైకోపతిక్ సీరియల్ కిల్లర్ జాంగ్ క్యుంగ్ చుల్  దారుణంగా హత్య చేస్తాడు. అతడిపై ప్రతికారం తీర్చుకునేందుకు కిమ్ సూ చేసే ప్రయత్నాలను అత్యంత భయంకరంగా తెరకెక్కించారు. ఈ మూవీ ఆద్యంత రక్తపాతంతో నిండిపోయి ఉంటుంది.  

6. గొంజియం: హూంటెడ్ ఆశైలం(2018)

జంగ్ బమ్ షిక్ దర్శకత్వం వహించిన హార్రర్ మూవీ ‘గొంజియం: హూంటెడ్ ఆశైలం’.  ఇందులో వి హా జూన్ , పార్క్ జి హ్యూన్ , ఓహ్ యోన్ , మూన్ యే వోన్ , పార్క్ సుంగ్ హూన్ , యూ జే యూన్, లీ సీయుంగ్ వూక్ కీలక పాత్రల్లో నటించారు. భయానక గోంజియామ్ సైకియాట్రిక్ హాస్పిటల్ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉంటాయి.  కొందరు యువతీ యువకులు అక్కడ ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి చూపించాలి అనుకుంటారు. అక్కడి వెళ్లాక వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు.    

7. బెడెవిల్డ్ (2010)

సియో యంగ్ హీ, జి సంగ్-వోన్ నటించిన హర్రర్ చిత్రం ‘బెడెవిల్డ్’.  జాంగ్ చియోల్ సూ దర్శకత్వం వహించిన తొలి సినిమా. ఇందులో ఒక సిటీ లేడీ ద్వీపంలోని తన చిన్ననాటి ఇంటికి తిరిగి వెళ్తుంది. అక్కడ ఉన్న కొంత మంది నుంచి ఎలాంటి వేధింపులను ఎదుర్కొంటుంది? చివరికి వారి మీద ఎలా తిరగబడుతుంది? అనే విషయాలను చూపించారు.

8. ది వైలింగ్(2016)

2016లో విడుదలైన దక్షిణ కొరియా హార్రర్ మూవీ ‘ది వైలింగ్’. నా హాంగ్ జిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  క్వాక్ డో వాన్, హ్వాంగ్ జంగ్ మిన్, చున్ వూ హీ నటించారు. తన కూతురిని రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా గోక్‌ సాంగ్ అనే మారుమూల గ్రామంలో జరిగిన హత్యలను ఓ పోలీసు అధికారి ఎలా బయటకు తెచ్చాడు అనేది ఈ సినిమా కథ.    

9. పారాసైట్(2019)

ఈ చిత్రానికి బాంగ్ జూన్ హో దర్శకత్వం వహించారు.  కొంత మంది వ్యక్తులు ధనవంతులుగా నటిస్తూ, సంపన్నుల ఇళ్లలోకి చొరపడి వారిని ఎలా దోచుకుంటారో చూపించారు. ఈ ప్రయత్నంలో వారికి ఎదురయ్యే సంఘటనలు అందరినీ భయాందోళనకు గురి చేస్తాయి.

10. హైడ్ అండ్ సీక్(2013)

హు జంగ్ తెరకెక్కించిన తొలి మూవీ ‘హైడ్ అండ్ సీక్’. రెండు కుటుంబాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ తన సోదరుడితో విడిపోతాడు. కానీ, అతడితో ఉన్న రహస్య విషయాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడతాడో ఈ చిత్రంలో చూపిస్తారు.  

Read Also: ‘చికుబుకు చికుబుకు రైలే’ పాట వెనుక అంత కథ ఉందా? అది రెహమాన్ ప్లాన్ కాదా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
SVSN Varma: 'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం -  భయంతో పరుగులు తీసిన భక్తులు
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం - భయంతో పరుగులు తీసిన భక్తులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పరిస్తాంఎన్డీఆర్‌ఎఫ్‌ ను తెచ్చింది టీడీపీ  ప్రభుత్వమేరైతు బంధుపై ఎవరిదీ రాజకీయం?Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
SVSN Varma: 'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం -  భయంతో పరుగులు తీసిన భక్తులు
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం - భయంతో పరుగులు తీసిన భక్తులు
Kho-Kho World Cup: అమ్మాయిలు అదరగొట్టారు - ఖోఖో విశ్వవిజేతగా భారత్, ఫైనల్‌లో నేపాల్ చిత్తు
అమ్మాయిలు అదరగొట్టారు - ఖోఖో విశ్వవిజేతగా భారత్, ఫైనల్‌లో నేపాల్ చిత్తు
Kokata Murder Case: 'నా కుమారుడికి మరణ శిక్ష విధించండి' - ఆర్జీకర్ కేసు దోషి తల్లి
'నా కుమారుడికి మరణ శిక్ష విధించండి' - ఆర్జీకర్ కేసు దోషి తల్లి
Anil Ravipudi: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
Donald Trump : భారత్‌లో ట్రంప్ పర్యటన? - అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆ దేశంలోనూ..
భారత్‌లో ట్రంప్ పర్యటన? - అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆ దేశంలోనూ..
Embed widget