By: ABP Desam | Updated at : 23 Jan 2023 10:54 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Sithara Entertainments/Instagram
అర్జున్ దాస్, అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, ప్రధాన పాత్రలు పోషిస్తున్న మూవీ 'బుట్ట బొమ్మ'. ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాన్ని ప్రటించారు మేకర్స్. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల (జనవరి) 26న విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాలతో ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. కాస్త ఆలస్యంగా వచ్చినా, ఆ ఆలస్యాన్ని మరిపించేలా వినోదాన్ని అందిస్తామని మేకర్స్ వెల్లడించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా 'బుట్టబొమ్మ' సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.
ఫీల్ గుడ్ రూరల్ డ్రామాగా 'బుట్ట బొమ్మ'
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా 'బుట్ట బొమ్మ'. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హీరో అర్జున్ దాస్ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. హీరోయిన్ అనిఖా సురేంద్రన్ సైతం ఈ సినిమా కలర్ ఫుల్ గా, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు. సినిమా చూశాక మంచి అనుభూతి కలుగుతుందన్నారు.
గతేడాది డీజే టిల్లు, ఈ ఏడాది ‘బుట్ట బొమ్మ’
గతేడాది ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి 'డీజే టిల్లు' చిత్రాన్ని నిర్మించింది సితార ఎంటర్టైన్మెంట్స్. 2022 ఫిబ్రవరిలో విడుదలైన ‘డీజే టిల్లు’ చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వస్తున్న 'బుట్టబొమ్మ' కూడా ఆ విజయాన్ని పునరావృతం చేస్తుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక వర్గాన్ని పరిశీలిస్తే, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. గణేష్ కుమార్ రావూరి సంభాషణలు అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు. వివేక్ అన్నామలై ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ప్రొడక్షన్ కంట్రోలర్ గా సిహెచ్ రామకృష్ణా రెడ్డి ఉన్నారు. పీఆర్ఓ గా లక్ష్మి వేణుగోపాల్ చేస్తున్నారు.
Read Also: ఆస్కార్ రేసులో ఎన్టీఆర్ దూకుడు, హాలీవుడ్ స్టార్స్‌ను సైతం వెనక్కి నెట్టి...
Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?
The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి
Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!
HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం