అన్వేషించండి

BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్

‘దసరా’ మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా యాంకర్ సుమతో కలసి హీరో నాని, కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ యాస గురించి కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవతున్నాయి.

న్యాచురల్ స్టార్ నాని, నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు, టీజర్ లు ఆకట్టుకుంటున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో హీరో నాని సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. అలాగే మూవీలో కీర్తి సురేష్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ మార్చి 30 న పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు మేకర్స్. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా యాంకర్ సుమతో కలసి హీరో నాని, కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో యాంకర్ సుమ తెలంగాణ యాస గురించి కీర్తి సురేష్ ను ఓ ప్రశ్న అడిగింది. దానికి కీర్తి ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు, పొలిటికల్‌గా కూడా ఆమె వ్యాఖ్యలను వాడేసుకుంటున్నారు.

ఇటీవల ‘దసరా’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు హీరో నాని, కీర్తి సురేష్. ఈ సందర్భంగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు నాని, కీర్తి. ఈ నేపథ్యంలో తెలంగాణ యాస గురించి సుమ కీర్తిను ఓ ప్రశ్న అడిగింది. సాధారణంగా తెలంగాణ యాస అంటే కొంచెం స్పైసీ గా ఉంటుంది. అది తెలుగు వాళ్లకే కొంచెం కష్టంగా ఉంటుంది. మరి ఈ సినిమా కోసం ఆ యాసను ఎలా నేర్చేకున్నావ్ అని కీర్తిను అడిగింది సుమ. దానికి కీర్తి సమాధానం చెబుతూ.. తనకు మామూలుగా స్పైస్ టోలరంట్స్ అంటే ఇష్టమే అని, అందుకే తాను నేర్చుకున్నానని అన్నారు. అయినా తానేమీ గుజరాత్ నుంచి రాలేదని, చెన్నై నుంచే వచ్చానని అందుకే తనకేమీ అదంత కష్టంగా అనిపించలేదని చెప్పింది. 

ఆమె ఫ్లోలో చెప్పిన ఆ మాటలను రాజకీయ నేతలు వాడేసుకుంటున్నారు. తెలంగాణకు చెందిన ఓ బీఆర్ఎస్ పార్టీ మహిళా నేత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానితో పాటు ఓ నోట్ ను కూడా రాసుకొచ్చారు. అదేంటంటే.. ‘‘గుజరాత్ నుంచి వచ్చిన వాళ్లకు మా తెలంగాణ యాస అర్థం కాదని కళ్లు తెరిపించేలా చెప్పావు తల్లీ’’ అంటూ రాసుకొచ్చారు. దీంతో కీర్తి వ్యాఖ్యలు అటు రాజకీయంగానూ ఇటు ఇండస్ట్రీలోనూ చర్చనీయంశమవుతున్నట్లే కనిపిస్తోంది. అయితే ఆ మహిళా నేత చేసిన వ్యాఖ్యలపై ఏ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Also: ‘స్వీటెస్ట్ బ్రదర్’ అంటూ చెర్రీకి మంచు మనోజ్ బర్త్‌డే విసెష్, విష్ణును ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

టాప్ హెడ్ లైన్స్

Jagamae Sangeetham: 'జగమే సంగీతం' సిరీస్‌కు చిరంజీవి రివ్యూ... ప్రకాష్ రాజ్ గురించి ఏం చెప్పారంటే?
'జగమే సంగీతం' సిరీస్‌కు చిరంజీవి రివ్యూ... ప్రకాష్ రాజ్ గురించి ఏం చెప్పారంటే?
Sree Vishnu: అమీర్‌పేట్‌ ఛాలెంజ్‌లు వద్దు... బట్టలు విప్పొద్దు... పబ్లిసిటీ రాయుళ్ళకు శ్రీవిష్ణు కౌంటర్
అమీర్‌పేట్‌ ఛాలెంజ్‌లు వద్దు... బట్టలు విప్పొద్దు... పబ్లిసిటీ రాయుళ్ళకు శ్రీవిష్ణు కౌంటర్
Bigg Boss Telugu 10 : గెట్ రెడీ ఫర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 - లాంచింగ్ ఎపిసోడ్ ముఖ్య అతిథిగా సర్దార్
గెట్ రెడీ ఫర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 - లాంచింగ్ ఎపిసోడ్ ముఖ్య అతిథిగా సర్దార్
Singer Jhansi : బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Singer Jhansi : బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget