Brahmamudi April 12th: స్వప్నకి ఘోరమైన అవమానం, మళ్ళీ రోడ్డున పడ్డ బతుకు- రాజ్ తిక్క కుదురుస్తున్న అప్పు
రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే,,
రాజ్ కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ఆవేశంగా వెళ్తుంటే డోర్ తీయగానే మీనాక్షీ ఎదురుపడుతుంది. కాసేపు రాజ్ బుర్ర ఫోర్క్ వేసుకుని మరీ తింటుంది. అది తట్టుకోలేక తల బాదుకుంటాడు. ఇదేంటి ఈ బట్టలే ఉంచావ్ లుంగీ బనియన్ ఇవ్వలేదా అంటుంది. మీరు ఉండే మూడు రోజులు మిమ్మల్ని ప్రేమతో ముంచెత్తుతాము అనేసరికి రాజ్ బిత్తరపోయి కావ్య దగ్గరకి వెళ్ళి గుసగుసలాడతాడు. మూడు రోజులు కాదు నాలుగు రోజులు ఉందామని అంటున్నాడాని కావ్య రాజ్ ని ఇరికిస్తుంది. అప్పు రాజ్ ని చూడటం చూసి లోపలికి వస్తావా డార్లింగ్ అని పిలుస్తాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత కళ్లు తాగిన కోతిలాగా చిందులేస్తాడు. బంగాళాదుంపల పరుపు మీద కిర్రు కిర్రుమనే ఫ్యాన్ ఉక్కపోత కింద నేను ఉండలేను నేనే వెళ్ళి చెప్తాను అని వెళ్లబోతుంటే అమ్మ, పెద్దమ్మని దాటుకుని వెళ్తారా అని కావ్య బెదిరిస్తుంది. వీళ్ళ అతిని భరించడం కంటే ఎలాగోలా ఇక్కడే చావడం బెటర్ అని బెడ్ మీద కూర్చుంటాడు అది గుచ్చుకునేసరికి దెబ్బకి లేచి కూర్చుని తల పట్టుకుంటాడు.
Also Read: యష్ చెంప పగలగొట్టిన వేద- మాళవిక గొంతు నులిమేసిన అభిమన్యు
అటు రాజ్ ఇంట్లో అందరూ అపర్ణ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురుచూస్తారు. వడ్డించమంటారా అని అపర్ణ అంటే శుభాష్ తినడానికి పిలిచానని చెప్తాడు. భార్యాభర్తలు ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. ఇంతమంది తింటుంటే నువ్వు ఖాళీ కడుపుతో ఉండటం బాగోలేదని సీతారామయ్య అంటాడు. అన్నం మీద అలగడం కరెక్ట్ కాదని ఇంద్రాదేవి నచ్చజెపుతుంది. దీంతో అపర్ణ అన్నానికి కూర్చుంటుంది కానీ కూర వేసుకోకుండా పచ్చడి వేసుకుని తినడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కన్నీళ్ళు పెట్టుకుంటూనే మొండిగా కారం తింటుంది. మొదటి సారి ఈ ఇంట్లో ఆత్మగౌరవం దెబ్బతింది మేము అర్థం చేసుకోగలము కానీ కొడుకుని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని సీతారామయ్య చెప్తాడు. ఇంట్లో డబ్బులు లేక అప్పు కోసం బయటకి వెళ్తుంటే కృష్ణమూర్తి పిలుస్తాడు. వాళ్ళ దగ్గరకి వచ్చి కావ్య ఏమైందని అడుగుతుంది. నీకు పెళ్లై వెళ్ళిపోయిన దగ్గర నుంచి రంగులు సరిగా వేయడం లేదని గిరాకీ తగ్గింది ఇంట్లో కష్టంగా ఉందని అప్పు కావ్యకి చెప్తుంది.
అత్తారింట్లో నువ్వు సంతోషంగా ఉన్నావా అని కృష్ణమూర్తి కావ్యని అడుగుతాడు. చాలా సంతోషంగా ఉన్నాను, చాలా పెద్ద ఇల్లు కదా ఎవరి గదులు వాళ్ళవి. నాకు కూడా మన ఇల్లులాంటి రూమ్ ఇచ్చారని కావ్య చెప్తుంది. అదేంటి నువ్వు అల్లుడుగారు ఒకే గదిలో ఉండటం లేదా అని అడుగుతాడు. కానీ కావ్య అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది. కోపంగా ఉంటే నన్ను ఇక్కడకి ఎందుకు తీసుకొస్తారు, ఇక్కడ ఎందుకు ఉంటారని అంటుంది. స్వప్న తన స్నేహితురాలు సిరి ఇంట్లో భోజనం చేయబోతుంటే మోసపోయావా అని అడుగుతుంది. నువ్వు నమ్మి వెళ్ళిన వ్యక్తి నిన్ను మోసం చేశాడా అంటుంది. స్వప్న కచ్చితంగా అన్నం తినబోతుంటే సిరి తల్లి వచ్చి తిడుతుంది. ఇన్ డైరెక్ట్ గా స్వప్నని తిడుతుంది. నీ ఫ్రెండ్ మీద నీకున్న ప్రేమ కాలనీ వాళ్ళకి మన మీద ఉండదు. లేచిపోయిన దాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నానని అంటారు. ఇప్పుడు నేను నోరు మూసుకుంటే ఆ కనకానికి పట్టిన గతే నాకు పడుతుంది. కావ్య కుటుంబ పరువు కాపాడటం కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిందని సిరి తల్లి నోటికొచ్చినట్టు స్వప్నని తిడుతుంది.
Also Read: మనోహర్ దెబ్బకి రామ, జానకి విలవిల- రోడ్డున పడ్డ జ్ఞానంబ పరువు
భోజనం చేసిన వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అనేసరికి స్వప్న తినకుండా చేయి కడిగేసుకుని బాధగా వెళ్ళిపోతుంది. కనకం బట్టలు తీసుకొచ్చి రాజ్ కి ఇస్తుంటే వద్దని అంటాడు. కావ్య వచ్చి తన తండ్రి ఇచ్చిన బట్టలు వేసుకోమని బతిమలాడుతుంది. కానీ రాజ్ వాటిని విసిరి కొట్టడం అప్పు చూసి ఆ లుంగీ ఎలా కట్టుకోవో నేను చూస్తానని అనుకుంటుంది. స్వప్న మళ్ళీ రోడ్డున పడుతుంది. దీనంతటికీ కారణం రాహుల్ తను వదలకుండా ఉండి ఉంటే ఈ అవమానం జరిగేది కాదు. వెంటనే రాహుల్ కి కాల్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయడు.