అన్వేషించండి

Janaki Kalaganaledu April 11th: మనోహర్ దెబ్బకి రామ, జానకి విలవిల- రోడ్డున పడ్డ జ్ఞానంబ పరువు

బిల్డర్ మధుని హత్య కేసు నుంచి తప్పించడం కోసం మనోహర్ రామని ఇరికిస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

జానకి ఇంట్లో లేకపోవడంతో జ్ఞానంబ ఎక్కడికి వెళ్ళిందని నిలదీస్తుంది. అర్జంట్ పని ఉంటే నేనే స్టేషన్ కి వెళ్ళమని చెప్పానని రామ అంటాడు. దీంతో జ్ఞానంబ కోపంగా సర్పంచ్ కి ఫోన్ చేసి పీటల మీద విష్ణు, మల్లిక కూర్చుంటారని చెప్పు. సౌభాగ్య వ్రతం రోజు ఇలాగే జరిగింది. తన ఉద్యోగం అలాంటిది. తను ఏ పని మీద వెళ్లిందో తెలుసా? జానకి వెళ్లేటప్పుడు నాకు ఎందుకు చెప్పలేదని కోపంగా అడుగుతుంది. సందు దొరికింది కదా అని మల్లిక మరింత ఎగేసేలా మాట్లాడుతుంది. జానకి మీద ఉన్న ప్రేమని పక్కన పెట్టి ఆలోచించమని మల్లిక అంటుంది. సర్పంచ్ అడగ్గానే ఎవరి అనుమతి తీసుకోకుండా పెద్ద కొడుకు, కోడలు కూర్చుంటారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ స్థానంలో మేము కూర్చుంటే ఎంగిలి కూడు కోసం ఆశపడినట్టు ఉంటుందని మల్లిక దెప్పి పొడుస్తుంది. జ్ఞానంబ మాత్రం గుడికి వెళ్ళేలోపు జానకి ఇంటికి రావాల్సిందేనని చెప్పేసి వెళ్ళిపోతుంది.

Also Read: తులసి తల్లి కాళ్ళ మీద పడిన నందు- దివ్యకి విక్రమ్ లవ్ లెటర్, ఆటాడేసుకున్న ప్రేమ్

మనోహర్ స్టేషన్ లో ఎవరి కోసమో ఎదురుచూస్తూ ఉంటే జానకి వచ్చి ఎస్పీ దగ్గరకి వెళ్దామా అని అడుగుతుంది. అప్పుడే కానిస్టేబుల్ ఒక వ్యక్తిని పట్టుకుని ఈడ్చుకుంటూ వస్తాడు. అది గమనించి ఎస్పీ దగ్గరకి వెళ్దామని నటిస్తాడు. కానిస్టేబుల్ తెచ్చిన వ్యక్తి దగ్గర మత్తు పదార్థాలు దొరికాయని ఎస్సైకి ఇస్తాడు. వచ్చాక ఈ కేసు చూద్దాం ముందు ఎస్పీ దగ్గరకి వెళ్దామని జానకి అంటుంది కానీ మనోహర్ మాత్రం ఆ కేసు కంటే ఇదే ముఖ్యమని వాడిని కొడతాడు. ఈ మత్తు పదార్థాలు రామ దగ్గర కొన్నాను అతనే అమ్ముతాడని చెప్పేసరికి ఎవరు ఆ రామ అని ఎస్సై ఏమి తెలియనట్టు అడుగుతాడు. మిఠాయి బండి రామ అని చెప్పేసరికి జానకి వాడి చెంప పగలగొడుతుంది. చంపేస్తాను ఇంకోసారి ఆ పేరు నీ నోటి నుంచి వచ్చిందంటే ఏదో ఒక పేరు చెప్పి తప్పించుకోవాలని అనుకుంటున్నావా తిడుతుంది.

నిజంగా రామ దగ్గర కొన్న ఎప్పటి నుంచో అతని దగ్గరే కొంటున్నానని అంటాడు. వీడు అబద్ధం చెప్తున్నాడు వీడి మాటలు నమ్మొద్దని జానకి చెప్తుంది. ఎస్పీని కలిసి తర్వాత గుడికి కళ్యాణంకి వెళ్ళి వచ్చిన తర్వాత చూద్దామని అంటుంది. కానీ మనోహర్ మాత్రం రామ ఇల్లు సెర్చ్ చేయాలని నాటకం ఆడతాడు. అందరి ముందు మాట పడకుండా ఉండాలంటే సెర్చ్ చేయాలని చెప్తాడు. దీంతో జానకి చేసేది లేక మనోహర్ తో కలిసి ఇంటికి బయల్దేరుతుంది. ఇక ఇంటి దగ్గర జానకి ఇంకా రాలేదని మల్లిక సీన్ క్రియేట్ చేస్తుంది. ఎంత చెప్పినా వినకుండా జానకి వెళ్లారు ఇప్పుడు అమ్మ ముందు దోషిగా నిలబడ్డాననని మనసులో అనుకుంటాడు. రామ ఇంట్లో వాళ్ళని కళ్యాణానికి వెళ్ళమని జానకి వచ్చేవరకు ఇంట్లోనే ఉంటానని చెప్తాడు. తన ప్లాన్ వర్కవుట్ అయినందుకు మనోహర్ లోలోపల సంతోషపడతాడు. రామ మళ్ళీ జానకికి కాల్ చేస్తాడు దార్లో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. దార్లో ఉన్నారని ఇంట్లో చెప్పేసరికి మల్లిక నవ్వుతుంది.

Also Read: అపర్ణకి కండిషన్ పెట్టిన శుభాష్- స్నేహితురాలి ఇంటికి చేరిన స్వప్న, కావ్య ఇంట్లో రాజ్ తిప్పలు

జానకి దొంగ నోటి వెంట రామ పేరు ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నానని చెప్పేసరికి మనోహర్ గుటకలు వేస్తాడు. కాసేపటికి జానకి ఇంటికి రావడం చూసి సంతోషపడతారు. అంతలోనే వెనుక నుంచి మనోహర్ రావడం చూసి జ్ఞానంబ షాక్ అవుతుంది. గంజాయి పట్టుకున్న వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి రామని ఎప్పుడైనా చూశావా అని అడుగుతాడు. ఇతను నీ దగ్గర మిఠాయి కొనే కస్టమర్ కాదు నీ దగ్గర రెగ్యులర్ గా నిషిద్ధ మాదక ద్రవ్యాలు కొనే కస్టమర్ అంట అని చెప్పేసరికి అందరూ షాక్ అవతారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Asia Cup:  వందల కోట్ల జరిమానా భయం - దెబ్బకు దిగొచ్చిన పాక్ - యూఏఈతో మ్యాచ్‌ షూరూ!
వందల కోట్ల జరిమానా భయం - దెబ్బకు దిగొచ్చిన పాక్ - యూఏఈతో మ్యాచ్‌ షూరూ!
Telangana Education Policy: ధనవంతులు కూడా ప్రభుత్వ బడుల్లో చేరేలా కొత్త విద్యావిధానం - సీఎం రేవంత్ దిశానిర్దేశం
ధనవంతులు కూడా ప్రభుత్వ బడుల్లో చేరేలా కొత్త విద్యావిధానం - సీఎం రేవంత్ దిశానిర్దేశం
Disha Patani house Encounter: దిశాపటాని ఇంటిపై కాల్పులు జరిపిన గ్యాంగ్  ఎన్ కౌంటర్ - ఇద్దర్ని కాల్చి చంపిన యూపీ పోలీసులు
దిశాపటాని ఇంటిపై కాల్పులు జరిపిన గ్యాంగ్ ఎన్ కౌంటర్ - ఇద్దర్ని కాల్చి చంపిన యూపీ పోలీసులు
YSRCP Asssembly Hurdle: పాపం.. YSRCP ఎమ్మెల్యేలు..అధ్యక్షుడికి చెప్పలేరు... అసెంబ్లీకి వెళ్లలేరు..!
పాపం.. YSRCP ఎమ్మెల్యేలు..అధ్యక్షుడికి చెప్పలేరు... అసెంబ్లీకి వెళ్లలేరు..!
Advertisement

వీడియోలు

YS Jagan Assembly Absence | పాపం.. YSRCP ఎమ్మెల్యేలు..అధ్యక్షుడికి చెప్పలేరు... అసెంబ్లీకి వెళ్లలేరు
Hardik Pandya Rumoured Girlfriend Mahieka Sharma | ఎవరీ మహికా శర్మ?
Mohammad Yousuf about Suryakumar | సూర్యకుమార్‌పై మాజీ క్రికెటర్ దారుణ వ్యాఖ్యలు
Rashid Khan Breaks Bhuvi Record Asia Cup 2025 | భువీ రికార్డ్‌ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్
Team India Jersey Sponsor | టీమ్ ఇండియా స్పాన్సర్ గా అపోలో టైర్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Asia Cup:  వందల కోట్ల జరిమానా భయం - దెబ్బకు దిగొచ్చిన పాక్ - యూఏఈతో మ్యాచ్‌ షూరూ!
వందల కోట్ల జరిమానా భయం - దెబ్బకు దిగొచ్చిన పాక్ - యూఏఈతో మ్యాచ్‌ షూరూ!
Telangana Education Policy: ధనవంతులు కూడా ప్రభుత్వ బడుల్లో చేరేలా కొత్త విద్యావిధానం - సీఎం రేవంత్ దిశానిర్దేశం
ధనవంతులు కూడా ప్రభుత్వ బడుల్లో చేరేలా కొత్త విద్యావిధానం - సీఎం రేవంత్ దిశానిర్దేశం
Disha Patani house Encounter: దిశాపటాని ఇంటిపై కాల్పులు జరిపిన గ్యాంగ్  ఎన్ కౌంటర్ - ఇద్దర్ని కాల్చి చంపిన యూపీ పోలీసులు
దిశాపటాని ఇంటిపై కాల్పులు జరిపిన గ్యాంగ్ ఎన్ కౌంటర్ - ఇద్దర్ని కాల్చి చంపిన యూపీ పోలీసులు
YSRCP Asssembly Hurdle: పాపం.. YSRCP ఎమ్మెల్యేలు..అధ్యక్షుడికి చెప్పలేరు... అసెంబ్లీకి వెళ్లలేరు..!
పాపం.. YSRCP ఎమ్మెల్యేలు..అధ్యక్షుడికి చెప్పలేరు... అసెంబ్లీకి వెళ్లలేరు..!
Mirai Villain: ఆ హీరోకి 'మిరాయ్'లో విలన్ ఛాన్స్ మిస్... మనోజ్ మంచుకు ముందు ఆప్షన్ ఎవరో తెలుసా?
ఆ హీరోకి 'మిరాయ్'లో విలన్ ఛాన్స్ మిస్... మనోజ్ మంచుకు ముందు ఆప్షన్ ఎవరో తెలుసా?
Telangana Armed Struggle: తెలంగాణ సాయుధ పోరాటంలో చరిత్ర చెప్పని సంచలన విషయాలు.. కమ్యూనిస్టుల పాత్ర..!
తెలంగాణ సాయుధ పోరాటంలో చరిత్ర చెప్పని సంచలన విషయాలు.. కమ్యూనిస్టుల పాత్ర..!
Nara Lokesh In London: 15నెలల్లో 10లక్షల కోట్ల పెట్టుబడులు-  క్వాంటమ్ వ్యాలీ, డాటా సిటీలతో మారనున్న ఏపీ రూపురేఖలు: నారా లోకేష్
క్వాంటమ్ వ్యాలీ, డాటా సిటీలతో మారనున్న ఏపీ రూపురేఖలు: లండన్‌లో మంత్రి నారా లోకేష్
Rajagopal Reddy Congress: నేాపాల్ తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత కూల్చేస్తారు -  ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు
నేాపాల్ తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత కూల్చేస్తారు - ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు
Embed widget