Balakrishna: బాలయ్య కోసం బాలీవుడ్ బ్యూటీ - కన్ఫర్మ్ అయినట్లే!
బాలయ్య 108 సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని తీసుకున్నారు.
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా బాలయ్య మరో సినిమా ఓకే చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు.
హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది (NBK 108 Movie). ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలకు హిందీలో పేరున్న నటీనటులను తీసుకోవాలని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఆలోచిస్తున్నారట. హీరోయిన్ ను కూడా హిందీ నుంచి తీసుకున్నట్లు సమాచారం.
మొదట త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు అనిల్ రావిపూడి. దానికి తగ్గట్లుగా బాలీవుడ్ హీరోయిన్ ఉంటే మార్కెట్ పరంగా కలిసొస్తుందనేది ప్లాన్. ఈ క్రమంలో సోనాక్షి సిన్హాను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ బబ్లీ హీరోయిన్ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. సౌత్ లో రజినీకాంత్ తో కలిసి 'లింగా' అనే సినిమా కూడా చేసింది.
ఇప్పుడు బాలయ్యతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుంది. ఈమె కంటే బెటర్ ఆప్షన్ కోసం చూస్తున్నారు కానీ దాదాపు సోనాక్షినే ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని టాక్. నిజానికి నవంబర్ లో సినిమాను మొదలుపెట్టాలనుకున్నారు కానీ ఇప్పుడు వచ్చే ఏడాదికి పుష్ చేశారు. ఈ సినిమా కథ ప్రకారం.. బాలయ్యకి కూతురు కూడా ఉంటుందట. ఆ పాత్రలో హీరోయిన్ శ్రీలీల కనిపించబోతుంది. తెలుగమ్మాయి, మరో హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.
బాలయ్యతో ప్రయోగం:
ఈ సినిమా గురించి గతంలో దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు బాలయ్యను ఎవరూ ఈ కోణంలో చూపించలేదని.. తన మనసులో బాలయ్యను ఓ కొత్త కోణంలో చూస్తున్నానని.. కొత్తగా ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. సినిమా విడుదలైన తరువాత బాలయ్యను ఇలా కూడా చూపించొచ్చా అనేలా ఉంటుందని తెలిపారు.
View this post on Instagram