![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Devara 2: ‘దేవర 2’లో ముంబై డాన్ గా ‘యానిమల్’ స్టార్- వెండి తెర రక్తంతో తడిసిపోవాల్సిందేనట!
Devara 2 Update: దేశవ్యాప్తంగా ‘దేవర‘ దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో ‘దేవర 2‘కు సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఇందులో ‘యానిమల్‘ స్టార్ బాబీ డియోల్ అరాచకం సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది.
![Devara 2: ‘దేవర 2’లో ముంబై డాన్ గా ‘యానిమల్’ స్టార్- వెండి తెర రక్తంతో తడిసిపోవాల్సిందేనట! bollywood actor bobby deol to play the yeti character in devara part 2 Devara 2: ‘దేవర 2’లో ముంబై డాన్ గా ‘యానిమల్’ స్టార్- వెండి తెర రక్తంతో తడిసిపోవాల్సిందేనట!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/27/f47d8335e2ba7c11b75df480874f16cc1727444404371544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bobby Deol In Devara2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీ ‘దేవర‘ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ అభిమానులలో పూనకాలు పుట్టిస్తోంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమాకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. భారత్ తో పాటు ఓవర్సీస్ లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలిభాగం అద్భుత విజయాన్ని అందుకోవడంతో రెండో పార్ట్ మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. రెండో పార్టును 2026లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘దేవర 2’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.
ముంబై డాన్ గా అరాచకం సృష్టించనున్న బాబీ డియోల్
‘దేవర’ తొలి భాగంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించగా, రెండో భాగంలో ‘యానిమల్’ యాక్టర్ బాబీ డియోల్ ను నెగెటివ్ రోల్ కోసం తీసుకున్నారు దర్శకుడు కొరటాల. ‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్ రక్తపాతం సృష్టించారు. క్రూరత్వంతో నిండిన క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించారు. తన అద్భుత నటనతో విమర్శకులను సైతం మెప్పించారు. ఈ సినిమాలో అదరిపోయే నటనతో వరుస అవకాశాలు దక్కించుకున్నారు. ఇక ‘దేవర 2’లో సైఫ్ అలీ ఖాన్ తమ్ముడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అతడి పాత్ర సెకెండ్ పార్ట్ లో పవర్ ఫుల్ గా ఉండబోతోంది. ముంబైకి చెందిన స్మగ్లింగ్ డాన్ యథి పాత్రలో ఆయన అరాచకం సృష్టించబోతున్నారట. ‘యానిమల్’ సినిమాకు మించి ఇందులో రక్తం పారించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘దేవర’ తొలి భాగం విడుదలైన నేపథ్యంలో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాజమౌళి సెంటిమెంట్ ను తిరగరాసిన ‘దేవర’
ప్రముఖ దర్శకుడు రాజమౌళితో కలిసి ‘RRR’ సినిమాలో నటించి ఎన్టీఆర్, కొరాటలో కలిసి ‘దేవర’ సినిమా చేశారు. ఇప్పటి వరకు రాజమౌళితో కలిసి పని చేసిన ఏ హీరో కూడా వెంటనే హిట్ అందుకోలేకపోయారు. ‘స్టూడెంట్ నెంబర్ 1’ నుంచి ‘RRR’ వరకు ఈ సెంటిమెంట్ కొనసాగింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను యంగ్ టైగర్ బ్రేక్ చేశారు. ‘దేవర’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి తనయుడు కార్తికేయ యంగ్ టైగర్ పై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ తో మొదలైన సెంటిమెంట్ ఎన్టీఆర్ తోనూ బ్రేక్ అయ్యిందని చెప్పుకొచ్చారు. ‘స్టూడెంట్ నెం 1’ 2001 సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా, ఇప్పుడు ‘దేవర’ కూడా సెప్టెంబర్ లోనే రిలీజై అద్భుత విజయాన్నిసొంతం చేసుకుంది.
తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జాన్వీ
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
Read Also: దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)