Bimbisara Vs Karthikeya 2: కళ్యాణ్ రామ్ వర్సెస్ నిఖిల్ - ఇద్దరిలో వెనక్కి తగ్గేదెవరు?
నిఖిల్, కళ్యాణ్ రామ్ లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన 'కార్తికేయ2' సినిమాను ఆగస్టు 5న విడుదల చేయబోతున్నారు. అదే సమయానికి కళ్యాణ్ రామ్ 'బింబిసార'ను కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరిలో ఒకరు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవి రెండూ కూడా ఫాంటసీ జోనర్ లో తెరకెక్కిన సినిమాలే. పైగా భారీ బడ్జెట్ తో రూపొందించారు. కాబట్టి ఒకేసారి రెండూ రిలీజైతే ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే అటు నిఖిల్ కానీ ఇటు కళ్యాణ్ రామ్ కానీ తమ సినిమాను వాయిదా వేయాలనుకోవడం లేదట. ఎందుకంటే ఆగస్టు 5న మిస్ చేస్తే ఆ తరువాత వారంలో 'లాల్ సింగ్ చద్దా', 'కోబ్రా', 'మాచర్ల నియోజకవర్గం' ఇలా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటితో పోటీ పడితే కనీసపు థియేటర్లు కూడా దొరకవు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 5నే తమ సినిమాలను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
పోనీ ప్రీపోన్ చేద్దామా అంటే నాగచైతన్య 'థాంక్యూ', రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఆగస్టు 5నే రావడం బెటర్ అనుకుంటున్నారు. కానీ ఓ అగ్ర డిస్ట్రిబ్యూటర్ మాత్రం రంగంలోకి దిగి ఒక సినిమాను వాయిదా వేయించే దిశగా చర్చలు జరుపుతున్నారట. మరి ఈ ఇద్దరి హీరోల్లో ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి!
Also Read: శ్రీనువైట్లకు షాక్ - విడాకులకు అప్లై చేసిన భార్య!
Also Read: రామ్ చరణ్ సినిమాతో శంకర్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?
View this post on Instagram
A song which rightly depicts the might of the almighty!#Eeswarude song from #Bimbisara 🎧
— NTR Arts (@NTRArtsOfficial) July 17, 2022
- https://t.co/6RA1p6Eu3P@NANDAMURIKALYAN @DirVassishta @kaalabhairava7 @ShreeLyricist @mmkeeravaani @ChirantannBhatt @saregamasouth pic.twitter.com/pocQhtP3qC