అన్వేషించండి

RC15: రామ్ చరణ్ సినిమాతో శంకర్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

వరుసగా తమిళ దర్శకుడు తెలుగు స్టార్స్ కి షాకులిస్తుండడంతో ఇప్పుడు అందరి దృష్టి శంకర్ పై పడింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. గత కొన్నేళ్లుగా మన హీరోలు తమిళ దర్శకులతో చేస్తోన్న సినిమాలేవీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. 

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన 'స్పైడర్' సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఆ తరువాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. ఆనంద్ శంకర్ కలిసి 'నోటా' అనే సినిమా తీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. రీసెంట్ గా హీరో రామ్ కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. తమిళ దర్శకుడు లింగుస్వామితో తీసిన 'ది వారియర్' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 

వరుసగా తమిళ దర్శకుడు తెలుగు స్టార్స్ కి షాకులిస్తుండడంతో ఇప్పుడు అందరి దృష్టి శంకర్ పై పడింది. ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు శంకర్ తెలుగు హీరోలతో సినిమాలు చేయలేదు. గత కొన్నేళ్లుగా ఆయన తీస్తోన్న సినిమాలు వర్కవుట్ కావడం లేదు. ఈ విషయం తలచుకుంటేనే మెగా ఫ్యాన్స్ లో భయం కలుగుతోంది. కమల్ తో చేయాల్సిన 'ఇండియన్ 2' సినిమా మధ్యలో ఆగిపోయిన సమయంలో శంకర్.. చరణ్ తో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. అతడి నమ్మి దిల్ రాజు రూ.200 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు. కానీ తన ఫామ్ ని కోల్పోయిన శంకర్ మునుపటిలా హిట్టు కొట్టగలడా..? తెలుగు స్టార్స్ కి షాక్ ఇస్తోన్న తమిళ దర్శకుల ట్రెండ్ ను శంకర్ బ్రేక చేస్తారా..? అనేది చూడాలి. 

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ నాటికి పూర్తవుతుందని అంటున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. 

Also Read: నాగచైతన్య 'థాంక్యూ' సినిమా రన్ టైం ఎంతంటే?

Also Read: కోవిడ్ బారిన పడ్డ హీరోయిన్ - వీడియో వైరల్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ram Charan (@alwaysramcharan)

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller OTT : నాలుగు ఓటీటీల్లో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
నాలుగు ఓటీటీల్లో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Sobhita Dhulipala : మనకు మనమే శత్రువులం - ఎవరూ సపోర్ట్ చేయరు... అక్కినేని కోడలు శోభిత ధూళిపాల రియాక్షన్
మనకు మనమే శత్రువులం - ఎవరూ సపోర్ట్ చేయరు... అక్కినేని కోడలు శోభిత ధూళిపాల రియాక్షన్
Raaka Update : అల్లు అర్జున్ రాకా నుంచి సీక్రెట్ పోస్టర్ - 37 డీకోడ్ చేస్తే...
అల్లు అర్జున్ రాకా నుంచి సీక్రెట్ పోస్టర్ - 37 డీకోడ్ చేస్తే...
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని తొందర పెట్టేసిన సహస్ర! అంబికతో మహా ఛాలెంజ్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని తొందర పెట్టేసిన సహస్ర! అంబికతో మహా ఛాలెంజ్!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR 2004 election affidavit: కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
KTR counter to Revanth Reddy: కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
West Bengal: అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Russia Sanctions Bill: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
Ganesha Visarjan Date time 2026: గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 24 or 25? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
గణేష్ నిమజ్జనం 2026: సెప్టెంబర్ 24, 25లో ఏది సరైన తేదీ? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget