Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!
లాంగ్ రన్ లో తన సత్తా చాటుతోంది 'బింబిసార'. 13 రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం!
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన 'బింబిసార' (Bimbisara) సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆగస్టు 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు తొలి ఆట నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ చాలా థియేటర్లలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ ప్రదర్శింపబడుతోంది. తొలి మూడు రోజుల్లోనే దాదాపు బ్రేక్ ఈవెన్ సాధించింది ఈ సినిమా. లాంగ్ రన్ లో తన సత్తా చాటుతోంది 'బింబిసార'. 13 రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం!
ఏరియాల వారీగా కలెక్షన్స్..
నైజాం - రూ.9.68 కోట్లు
సీడెడ్ - రూ.6.45 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ.3.99 కోట్లు
ఈస్ట్ - రూ.1.78 కోట్లు
వెస్ట్ - రూ.1.50 కోట్లు
గుంటూరు - రూ.1.96 కోట్లు
కృష్ణా - రూ.1.57 కోట్లు
నెల్లూరు - రూ.0.88 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 రోజులకు గాను ఈ సినిమా రూ. 26.81 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 53.62 కోట్లు.
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.99 కోట్లు, ఓవర్సీస్ 2.23 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 'బింబిసార' ఇప్పటివరకు రూ. 32.03 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 64.06 కోట్ల వసూళ్లు రాబట్టింది.
'బింబిసార'లో నందమూరి కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశారు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా... నటుడిగా రెండు పాత్రలో వైవిధ్యం చూపించారు. కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon), వరీనా హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, వరికుప్పల యాదగిరి పాటలు రాశారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందించారు. చిరంతన్ భట్ స్వరాలు అందించారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె ఈ సినిమాను నిర్మించారు.
Bimbisara OTT Release : 'బింబిసార' 50 రోజుల తర్వాతే ఓటీటీ వేదికలో విడుదల అవుతుందని 'దిల్' రాజు చెప్పారు. ఆగస్టు 5న థియేటర్లలో 'బింబిసార' విడుదల అయ్యింది. అప్పటి నుంచి 50 రోజులు లెక్క వేసుకుంటే... సెప్టెంబర్ 23, 2022న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది. 'బింబిసార' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ 'జీ 5' ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. సో... 'జీ 5'లో సెప్టెంబర్ నెలాఖరున కళ్యాణ్ రామ్ సినిమా సందడి చేయనుందన్నమాట.
Also Read: తిరు రివ్యూ : ధనుష్, నిత్యా మీనన్ సినిమా ఎలా ఉందంటే?
Also Read: విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'కు సీక్వల్, ఆ పాత్ర చేసేందుకు కంగనా తిరస్కరణ?