Yashmi Gowda Bigg Boss: ముందు నిన్ను స్కూల్లో పడేయాలి... 'బిగ్ బాస్' యష్మీ గౌడను ఆటాడేసుకుంటున్న నెటిజన్లు
Bigg Boss 8 Telugu Yashmi Gowda: బిగ్ బాస్ యాష్మీ గౌడను నెటిజన్లు ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్‌గా నిర్వహించిన స్పెల్లింగ్స్ పోటీలో ఆమె కరెక్టుగా రాయకపోవడంతో ఫన్నీగా సటైర్లు వేస్తున్నారు.
![Yashmi Gowda Bigg Boss: ముందు నిన్ను స్కూల్లో పడేయాలి... 'బిగ్ బాస్' యష్మీ గౌడను ఆటాడేసుకుంటున్న నెటిజన్లు Yashmi Gowda trolled by netizens for misspelling government word on Bigg Boss 8 Telugu Yashmi Gowda Bigg Boss: ముందు నిన్ను స్కూల్లో పడేయాలి... 'బిగ్ బాస్' యష్మీ గౌడను ఆటాడేసుకుంటున్న నెటిజన్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/14/051d6a0e0a29b770690ae8b08cefc1e81726299812765544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Netizens Trolling On Bigg Boss Yashmi Gowda: బిగ్ బాస్ షో ప్రేక్షకులు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ పంచుతోంది. నవంబర్ 1న ప్రారంభం అయిన ఈ షో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. తొలి వారం బెజవాడ బేబక్క షో నుంచి ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారం మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. విష్ణు ప్రియ, సోనియా, నిఖిల్, శేఖర్ భాష, నాగ మణికంఠ, కిరాక్ సీత, నైనిక, పృథ్వి నామినేషన్స్ లో ఉండగా, శేఖర్ భాష, ఆదిత్య ఓం డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీరిద్దరు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే వీరిలో ఒకరు బయటకి వెళ్ళడం పక్కా అని తెలుస్తోంది. కాసేపు ఈ ఎలిమినేషన్స్ గోలను పక్కన పెడితే, హౌస్ లో కన్నడ బ్యూటీ యష్మీ గౌడ చేసే సందడి మామూలుగా లేదు. ప్రతి విషయంలో ఆడపులిలా అగ్రెసివ్ గా వెళ్తూ ఆకట్టుకుంటున్నది.
యష్మీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
తాజాగా ''తన దగ్గర ఉన్న వస్తువులను తీసుకోవాలంటే పద్దతిగా వచ్చి అడగాలని, చిన్న పిల్లల్లా నేను తీసుకోవచ్చా అని అడగొద్దు'' అంటూ తోటి కంటెస్టెంట్ల మీద సీరియస్ అయ్యింది. ''వీళ్లను తీసుకెళ్లి స్కూల్లో పడేయాలి'' అంటూ ఫైర్ అయ్యింది. ఇప్పుడు అదే మాట ఆమెకు రివర్స్ తగిలింది. తాజాగా బిగ్ బాస్ తాజాగా హౌస్ లో స్పెల్లింగ్స్ పోటీ నిర్వహించాడు. ఇందులో యష్మీ ఒక్కటంటే, ఒక్క పదానికి కూడా కరెక్టుగా స్పెల్లింగ్ రాయలేదు. కనీసం గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా రాయలేకపోయింది. ‘Government’కు బదులుగా ‘Goverment’ అని రాసింది. దీంతో నెటిజన్లు ఓ రేంజిలో టార్గెట్ చేశారు. “ఫస్ట్ నిన్నుస్కూల్లో పడేయాలి” అంటూ ట్రోల్ చేస్తున్నారు. “ప్రైవేట్ స్కూల్ లో చదువుకుంటే గవర్నమెంట్ స్పెల్లింగ్ ఎలా వస్తుంది?” అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. “చిన్నప్పుడు ఈమె స్కూల్ కు వెళ్లి చదువుకోకుండా, పక్కవారి దగ్గర ఫుడ్ దొంగతనం చేసి ఉంటుంది” అని ఇంకొంత మంది సెటైర్లు వేస్తున్నారు.
View this post on Instagram
యాష్మీ గౌడ గురించి..
యాష్మీ గౌడ బెంగళూరులో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకుంది. స్కూల్లో ఉండగానే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. మోడలింగ్ నుంచి నెమ్మదిగి బుల్లితెర మీద అవకాశం దక్కించుకుంది. తొలుత ‘విద్యా వినాయక’ అనే సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘స్వాతి చినుకులు’ సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ గా బాగా పాపులర్ అయ్యింది.
Read Also: ఈ వీక్ ఎలిమినేషన్ కత్తి ఆ ఇద్దరి మీదే... ఇది ఊహించలేదు భయ్యా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)