Rithu Chowdary: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ To బిగ్ బాస్ హౌస్ - ముద్దుగుమ్మ రీతూ చౌదరి గురించి ఈ విషయాలు తెలుసా?
Rithu Chowdary Background: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాపులర్ అయ్యి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు ఫేమస్ రీతు చౌదరి. మరి ఆమె కెరీర్ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభం అయ్యిందనే వివరాలు ఓసారి చూస్తే...

TV Actress Rithu Chowdary Background: ఫేమస్ టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్ సీజన్ 9' ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఈసారి సరికొత్తగా సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లతో పాటు సామాన్యులు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జబర్దస్త్ ఫేం రీతూ చౌదరి ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓ సాధారణ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ స్థాయి నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి రీతూ ఎలా ఎంటర్ అవుతున్నారో ఓసారి చూస్తే...
యాంకర్‌గా కెరీర్ ప్రారంభం
తెలంగాణ ఖమ్మం జిల్లా నుంచి వచ్చారు రీతూ చౌదరి. తొలుత సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆమె ఇన్ స్టాలో అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. తొలుత లోకల్ చానల్స్‌లో చిన్న చిన్న కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరించేవారు. ఆ తర్వాత 'స్టార్ మా' ఛానల్లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే హోస్ట్‌గానూ వ్యవహరించేవారు. 2018లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు 'పెళ్లిచూపులు' షోలో కంటెస్టెంట్‌గా ఉండి టీవీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు.
యాంకర్ To సీరియల్స్
యాంకర్‌గా క్రేజ్ సంపాదించుకున్న తర్వాత సీరియల్స్‌లో అడుగుపెట్టారు. అలా ఫస్ట్ టైం 'ఆడదే ఆధారం' సీరియల్ ద్వారా టీవీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'గోరింటాకు', 'గిరిజా కల్యాణం' సీరియల్స్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. వీటి తర్వాత జీ తెలుగు సీరియల్స్ రామసక్కని సీత, సూర్యవంశం, ఇంటిగుట్టులో నటించి మెప్పించారు. సీరియల్స్‌తో పాటే తమిళ మూవీస్‌లోనూ నటించారు. తెలుగులో 'మౌనమే ఇష్టం' మూవీలో నటించారు. 'ఉప్పెన' మూవీలో సైతం ఓ చిన్న పాత్రలో కనిపించారు.
ఆ తర్వాత ఈటీవీ కామెడీ షో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో ఎంట్రీ ఇచ్చారు రీతూ చౌదరి. వీటి ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఆమె... పలు షోలకు యాంకర్‌గానూ వ్యవహరించారు.
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'స్పిరిట్' మూవీపై డైరెక్టర్ సందీప్ వంగా బిగ్ అప్డేట్
కాంట్రవర్శీస్ కూడా
అయితే, రీతూ కెరీర్‌లోనూ కొన్ని వివాదాలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో పోలీస్ విచారణను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఓ ల్యాండ్ స్కామ్‌లో ఆమె పాత్ర ఉందంటూ అప్పట్లో రూమర్స్ రాగా... అందులో నిజం లేదని కావాలనే కొందరు ఇందులోకి తనను లాగుతున్నారంటూ క్లారిటీ ఇచ్చారు.
ఫస్ట్ కంటెస్టెంట్‌గా
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, టీవీ షోస్, యాంకర్, హీరోయిన్ ఇలా అంచెలంచెలుగా సెలబ్రిటీ ఫేం సంపాదించుకున్న రీతు ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆమె పాపులారిటీ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఎన్నో సీజన్లలో ఆమె ఎంట్రీ ఇస్తారని ప్రచారం సాగినా 9వ సీజన్‌లో ఛాన్స్ దక్కించుకున్నారు. రీతూ ఫస్ట్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తుండగా... స్టేజ్‌పై డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మ హౌస్‌లో మైండ్ గేమ్స్ ఆడి ఎలా ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.






















