అన్వేషించండి

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్ 7 విన్నర్‌కు ఎంత మొత్తం వస్తుంది? ప్రయోజనాలేమిటీ?

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్‌కు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుంది, వారికి వచ్చే ఇతర బహుమతులు ఏంటి అనే విషయాన్ని నాగార్జున ఇప్పటికే రివీల్ చేశారు. కానీ అందులో చిన్న ట్విస్ట్ ఉండనుంది.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో 100కు పైగా రోజులు ఉన్నందుకు వారే టైటిల్ విన్నర్ అయితే బాగుంటుంది, వారికే ప్రైజ్ మనీ వస్తే బాగుంటుంది అని ప్రతీ కంటెస్టెంట్‌కు ఉంటుంది. ఆ ప్రైజ్ మనీతో ఏవేవో చేయాలని.. దానిపై ఎన్నో ఆశలు కూడా పెట్టుకొని ఉంటారు. అయితే ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో కేవలం ప్రైజ్ మనీ మాత్రమే కాకుండా విన్నర్ అయిన వారికి కొన్ని ఎక్స్‌ట్రా గిఫ్ట్స్ కూడా లభిస్తాయి. అదే విధంగా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు కూడా రూ.50 లక్షలు ప్రైజ్ మనీతో పాటు పలు గిఫ్ట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. అన్నింటితో పాటు ట్రోఫీ కూడా కొట్టాలని ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ప్రతీ ఒక్కరు ఆశపడుతున్నారు. కానీ ఫైనల్‌గా విన్నర్ అనేవాడు ఎవడో ఒక్కడే అవుతాడు.

ప్రైజ్ మనీతో పాటు బహుమతులు..
బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్‌గా నిలిచేవారికి ట్రోఫీతో పాటు రూ.50 లక్షలు ప్రైజ్ మనీ కూడా దక్కనుందని నాగార్జున రివీల్ చేశారు. దాంతో పాటు మారుతీ సుజూకీ బ్రెజా కారు కూడా గిఫ్ట్‌గా లభిస్తుందని తెలిపారు. ఈ రెండు మాత్రమే కాకుండా రూ.15 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ కూడా విన్నర్ సొంతమవుతుందని ఇప్పటికే నాగ్ చెప్పారు. ప్రైజ్ మనీ ఎంతో రివీల్ చేసిన రోజు.. ఒకవేళ తామే విన్నర్ అయ్యి ఆ డబ్బు మొత్తం వారికే వస్తే.. దాంతో ఏం చేస్తారో కూడా కంటెస్టెంట్స్ అంతా చెప్పుకొచ్చారు. అందులో ఎక్కువగా కంటెస్టెంట్స్‌కు తమ సొంతింటి కలను నిజం చేసుకోవాలనే కోరిక ఉంది. 

విన్నర్‌ను ప్రకటించడానికి స్టార్ హీరో సిద్ధం..
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు రూ.50 లక్షలు ప్రైజ్ మనీతో పాటు కారు, వజ్రాల హారం కూడా గిఫ్ట్స్‌గా లభించనుండగా.. ఇవన్నీ విన్నర్‌కు ఇవన్నీ అందజేయడానికి మహేశ్ బాబు రానున్నాడని వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన అప్‌కమింగ్ మూవీ ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్‌ను బిగ్ బాస్ నుండే మొదలుపెట్టవచ్చని మహేశ్ భావిస్తున్నాడట. ఇప్పటికే బిగ్ బాస్ ఫైనల్స్‌కు చిరంజీవి, వెంకటేశ్‌లాంటి సీనియర్ హీరోలు వచ్చారు. కానీ మొదటిసారి ఈ స్టేజ్‌పైకి మహేశ్ రానున్నాడు. ఇక ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్‌లో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు అవుతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రైజ్ మనీ విషయంలో ట్విస్ట్..
బిగ్ బాస్ ప్రైజ్ మనీ విషయంలో ప్రతీ సీజన్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. విన్నర్‌కు దక్కాల్సిన రూ.50 లక్షలు ప్రైజ్ మనీలో కొంత మొత్తాన్ని వేరే సూట్‌కేస్‌లో పెట్టి కంటెస్టెంట్స్ అందరికీ ఆఫర్ చేస్తాడు బిగ్ బాస్. ఒకవేళ ఎవరికైనా.. తాము విన్నర్ అవ్వలేము అన్న అనుమానం ఉంటే ఆ సూట్‌కేస్ తీసుకొని వెళ్లిపోవచ్చు. ఒకవేళ బిగ్ బాస్ చెప్పిన అమౌంట్.. తక్కువ అని తనకు అనిపిస్తే.. దానినే పెంచుతూపోతాడు. దానివల్ల విన్నర్‌కు దక్కాల్సిన రూ.50 లక్షల ప్రైజ్ మనీ నుండి కొంచెంకొంచెం తగ్గుతూపోతుంది. మరి బిగ్ బాస్ సీజన్ 7లో అలా సూట్‌కేస్ ఎవరైనా తీసుకుంటారా, విన్నర్‌కు ఫైనల్‌గా ఎంత ప్రైజ్ మనీ వస్తుంది అని తెలుసుకోవాలంటే ఫైనల్స్ చివరి వరకు ఆగాల్సిందే.

Also Read: ‘బిగ్ బాస్ సీజన్ 7’ ఫినాలే - రూ.15 లక్షలతో అతడు జంప్, టాప్ 3కు చేరుకున్న ఆ ముగ్గురు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget