అన్వేషించండి

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్ సీజన్ 7’ ఫినాలే - రూ.15 లక్షలతో అతడు జంప్, టాప్ 3కు చేరుకున్న ఆ ముగ్గురు

Bigg Boss Telugu 7: ‘బిగ్ బాస్ సీజన్ 7’లో మిగిలిన టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ముగ్గురు ఎలిమినేట్ అయిపోయి.. టాప్ 3 కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారని సమాచారం.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో మామూలుగా టాప్ 5 కంటెస్టెంట్స్ ఫైనల్స్‌కు చేరుకుంటారు. కానీ బిగ్ బాస్ సీజన్ 7లో మాత్రం ఆరుగురు కంటెస్టెంట్స్.. ఫినాలే వీక్‌కు చేరుకున్నారు. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు ఛాన్సులు ఉన్నాయని, ఆరుగురి నుంచి ఒక కంటెస్టెంట్.. ఫినాలే వీక్‌లో ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్లిపోతుందని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు.. ఫైనల్‌గా ఫైనల్స్‌‌కు షూటింగ్ మొదలయ్యింది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేసి బయటికి పంపించారని.. ప్రస్తుతం హౌజ్‌లో ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారని సమాచారం. అయితే, అర్జున్, ప్రియాంకలు ఖాళీ చేతులతో హౌస్ నుంచి బయటకు వెళ్లగా. యావర్ మాత్రం తెలివిగా రూ.15 లక్షలతో ఫినాలే రేసు నుంచి తప్పుకున్నాడని తెలిసింది.

టాప్ 6 నుంచి ముగ్గురు ఎలిమినేట్..
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7కు విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కానీ రన్నర్‌గా ఎవరు ఉంటారు? టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ముందుగా ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే ప్రశ్నలకు ఫైనల్‌గా సమాధానం దొరికినట్టుగా అనిపిస్తోంది. ఫినాలే అస్త్రా సాధించినా కూడా ఓటింగ్ విషయంలో అర్జున్ లాస్ట్‌లో ఉన్నాడని నాగార్జున ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే రెండు వారాల్లో అర్జున్ ఓటింగ్‌లో ఏ మార్పు రాలేదు. అందుకే ముందుగా బిగ్ బాస్ సీజన్ 7లోని టాప్ 6 కంటెస్టెంట్స్‌ నుంచి అర్జున్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం. తనతో పాటు మరో ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ హౌజ్‌ను వదిలి వెళ్లిపోయారట.

యావర్ ఓట్లకు గండి..
బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ కలిసి ‘స్పై’ అనే బ్యాచ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ బ్యాచ్‌కు సపోర్ట్ చేసేవారి ఓట్లు చీలిపోయాయి. టాస్కుల్లో యాక్టివ్‌గా ఉంటూ ఎక్కువశాతం టాస్కుల్లో గెలిచిన పల్లవి ప్రశాంత్‌కు కొందరు ఓట్లు వేస్తే.. మరికొందరు మాత్రం చాకచక్యంగా ఆలోచించి, ఎత్తుకు పైఎత్తులు వేసే శివాజీకి ఓట్లు వేశారు. దీంతో యావర్ ఓట్లకు గండిపడింది. ఎక్కువ ఫ్యాన్‌బేస్ సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్, శివాజీలకు ఎక్కువగా ఓట్లు పడడంతో యావర్‌కు వచ్చే ఓట్ల శాతం తగ్గిపోయింది. దీంతో అర్జున్‌తో పాటు యావర్ కూడా బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయినట్టు సమాచారం.

టాప్ 3 చేరుకున్న ఆ ముగ్గురు..
అర్జున్, యావర్‌తో పాటు ప్రియాంక కూడా బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చేసినట్టు సమాచారం. అర్జున్‌లాగానే ప్రియాంకకు కూడా చాలా తక్కువ ఫ్యాన్‌బేస్ ఉంది. అందుకే ఓట్ల విషయంలో తన ఫ్యాన్స్ అంతా కలిసినా కూడా టాప్ 3 స్థానానికి తన ఫేవరెట్ కంటెస్టెంట్‌ను చేర్చలేకపోయారు. కానీ తన ఆటను మాత్రం చాలాకాలం వరకు బిగ్ బాస్ ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక ప్రియాంక, యావర్, అర్జున్ ఎలిమినేట్ అయిపోవడంతో.. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్ మాత్రం టాప్ 3 స్థానాలకు చేరుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ టాప్ 3 కంటెస్టెంట్స్‌లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ప్రజల ‘పల్లవి’ - ప్రశాంత్.. ప్లస్, మైనస్‌లు ఇవే, గురూజీని ముంచేస్తాడా?

టాప్ హెడ్ లైన్స్

Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget