అన్వేషించండి
Advertisement
Bigg Boss Telugu 6: ఛాన్స్ కొట్టేసిన టీవీ9 యాంకర్ - వివరాలివే!
20వ కంటెస్టెంట్ గా టీవీ9 యాంకర్ ఆరోహి రావు ఎంట్రీ ఇచ్చింది.
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
20వ కంటెస్టెంట్ గా టీవీ9 యాంకర్ ఆరోహి రావు ఎంట్రీ ఇచ్చింది. చాలా సీజన్లుగా బిగ్ బాస్ షోలోకి టీవీ9 యాంకర్లు వస్తున్నారు. తొలి సీజన్‌లో కత్తి మహేష్, రెండో సీజన్‌లో యాంకర్ కమ్ రిపోర్టర్ దీప్తి నల్లమోతు, మూడో సీజన్ లో యాంకర్ జాఫర్, నాలుగో సీజన్‌లో దేవి నాగవల్లి బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్స్ గా వెళ్లి అలరించారు. సీజన్ 5లో ఇతర ఛానెల్ యాంకర్స్ కి ఛాన్స్ దక్కింది. ఈసారి మళ్లీ టీవీ9 నుంచి ఆరోహిరావు అనే యాంకర్ ను కంటెస్టెంట్ గా రంగంలోకి దింపారు. మరి ఆమె తన ఆటతీరుతో ఎంతవరకు రాణిస్తుందో చూడాలి!
ఇక ఈసారి అబ్బాయిల నెంబర్ కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హౌస్ లో కనిపించబోతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. మొత్తం చాలా మంది పోటీదారులు ఉన్నారు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు.
We welcome our 20th contestant #ArohiRao to Bigg Boss house.#ArohiOnBBTelugu#BiggBossTelugu6 #BBLiveOnHotstar@StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/I9tyUQHqm3
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 4, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion