అన్వేషించండి

Bigg Boss Telugu 7: కొన్ని గంటల్లో ‘బిగ్ బాస్’ హౌస్‌కు, ఇంతలోనే విషాదం - ఆమె షో నుంచి తప్పుకున్నట్లేనా?

మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాల్సిన ఓ బుల్లితెర నటి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి అకస్మాత్తుగా చనిపోవడంతో ఈ షో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

టైం అనేది ఎప్పుడు, ఎవరిని, ఎలా మార్చుతుందో చెప్పడం కష్టం. మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాల్సిన ఓ బుల్లితెర నటి ఇంట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఆమె బిగ్ బాస్ కోసం ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యింది. డ్యాన్సు ప్రాక్టీసు చేసింది. షో కోసం ఏవీలు రూపొందించారు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడమే తరువాయి అనుకుంటున్న సమయంలో బుల్లితెర నటి పూజా మూర్తి తండ్రి చనిపోయారు. గుండె సంబంధ సమస్యతో అకాల మరణం పొందారు. ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.  

క్షమించు నాన్నా అంటూ పూజా మూర్తి ఆవేదన!

తనను అల్లారు ముద్దుగా పెంచి పోషించిన తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో పూజా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. తండ్రి ఇక లేరనే విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరవుతోంది.ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. వీలైతే తిరిగి వచ్చేయండి నాన్నా అంటూ బతిమలాడుకుంది. 'RIP.. వీలైతే తిరిగి రండి. నిన్ను ఎంతో ప్రేమించాను నాన్నా. ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతున్నాను. నాకు తెలిసినంత వరకు నిన్ను గర్వపడేలా చేశాను అని అనుకుంటున్నాను. తెలిసో, తెలియకో ఏదైనా పొరపాటు చేసి ఉంటే క్షమించు నాన్నా. నువ్వు నాతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆశీస్సులు నాకు, అమ్మకు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఈ మేరకు తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది.   

బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్న పూజ

పూజా మూర్తి కన్నడ సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘గుండమ్మ కథ’తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. అటు యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించిన ‘సూపర్ క్వీన్’ షోలో పాల్గొంది. చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకున్న పూజకు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం లభించింది. పూజా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు రెడీ అయ్యింది. షోలో ఎంట్రీ ఇచ్చేందుకు చక్కగా డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేసింది. మరికొద్ది గంటల్లోనే ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుంది అనుకుంటున్న సమయంలో ఈ విషాదం జరిగింది. తండ్రి అకాల మరణంతో ఆమె ఈ షోకు రాలేనని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పాపం అంటున్నారు. ఆమె తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Murthy (@pooja.murthy.official)

ఇక బిగ్ బాస్ ఇప్పటికే 6 సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం 7వ సీజన్ కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 3 నుంచి ఈ షో మొదలుకానుంది. అటు బిగ్ బాస్ షోకు సంబంధించిన ప్రోమోలు, టీజర్లు ప్రేక్షకులలో మంచి ఆసక్తి కలిగిస్తున్నాయి.

Read Also:  వెల్‌కమ్ టు ది ఫ్యూచర్ - విజయ్ కొత్త మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget