అన్వేషించండి

Bigg Boss 7 Telugu: హౌజ్‌మేట్స్‌లో డబుల్ ఎలిమినేషన్ టెన్షన్ - డేంజర్ జోన్‌లో ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్!

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఇక ఈ ఎలిమినేషన్‌లో హౌజ్ నుండి వెళ్లిపోయే కంటెస్టెంట్స్ ఎవరా అని ప్రేక్షకులు అప్పుడే అంచనాలు వేయడం మొదలుపెట్టారు.

Bigg Boss Nominations: బిగ్ బాస్ సీజన్ 7లో ఈవారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో కంటెస్టెంట్స్ అందరూ అదే టెన్షన్‌లో ఉన్నారు. గతవారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ జరిగి.. ఆ పాస్ ఎవరి చేతికి వెళ్లకపోవడంతో బిగ్ బాసే స్వయంగా ఎలిమినేషన్‌ను క్యాన్సెల్ చేశారని నాగార్జున అన్నారు. అంతే కాకుండా వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా చెప్పారు. ఇక ఈవారం నామినేషన్స్‌లో ఉన్న 8 మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంపై సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. డబుల్ ఎలిమినేషన్‌లో ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఫిక్స్ అవ్వగా.. మరొక కంటెస్టెంట్ ఎవరా అని ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు.

అశ్విని ఎలిమినేషన్ ఫిక్స్..
ఈవారం నామినేషన్స్‌లో శివాజీ, అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్, అర్జున్, గౌతమ్, యావర్, రతిక, అశ్విని ఉన్నారు. అయితే వీరందరిలో శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌లకు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండడంతో ఈ ముగ్గురు ఇప్పట్లో ఎలిమినేట్ అవ్వకుండా కచ్చితంగా ఫైనల్స్‌కు వెళ్తారు అన్నది తెలిసిన విషయమే. ఎక్కువ ఓటింగ్‌ను సంపాదించడం కోసం ప్రస్తుతం అమర్, శివాజీ, ప్రశాంత్‌ల మధ్య గట్టి పోటీనే కనిపిస్తోంది. ఇక ఓటింగ్స్‌లో చివరి స్థానంలో రతిక, అర్జున్, అశ్విని ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో వీక్‌గా ఉన్న కంటెస్టెంట్ అశ్వినినే కాబట్టి తను ఈవారం కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక తనతో పాటు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరా అని ఆలోచనలోపడ్డారు.

డేంజర్ జోన్‌లో అర్జున్..
హౌజ్‌లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్ దృష్టిలో మాత్రమే కాకుండా ఆడియన్స్ దృష్టిలో కూడా అర్జున్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఓటింగ్ విషయంలో మాత్రం అర్జున్.. ఆఖరి మూడు స్థానాల్లో కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టాస్కుల విషయంలో యాక్టివ్‌గా ఉన్నా.. అర్జున్ ఎక్కువగా గొడవలకు వెళ్లకుండా, పాయింట్సే మాట్లాడతాడు అని పేరు తెచ్చుకున్నాడు. కానీ ఓటింగ్‌లో మాత్రం అర్జున్‌కు అంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు. దీంతో అశ్వినితో పాటు అర్జున్ కూడా హౌజ్ నుండి వెళ్లిపోతాడేమో అని అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ అర్జున్ కాకపోతే రతిక.. ఈవారం హౌజ్‌ను వదిలి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

టాప్ స్థానంలో ఎవరంటే..
వారాలు గడుస్తూ.. ఫైనల్స్ దగ్గర పడుతున్నకొద్దీ ఓటింగ్‌లో శాతాలు మారిపోతూ ఉన్నాయి. ముందుగా తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకొని ఓటింగ్స్‌లో టాప్‌లో నిలిచాడు శివాజీ. రెండోవారంలో నామినేషన్స్ తనకు చాలా ప్లస్ అవ్వడంతో ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్ రెండోస్థానంలో కంటిన్యూ అవుతూ వచ్చాడు. కానీ గత కొన్ని వారాలుగా శివాజీపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ ఏర్పడుతోంది. అంతే కాకుండా అమర్‌దీప్‌పై ఉన్న అభిప్రాయం కూడా కొంచెంకొంచెంగా మారుతోంది. గతవారం కెప్టెన్సీ తనకు దక్కలేదని అమర్ ఏడవడంతో కొందరు ప్రేక్షకులు అతడిపై జాలి చూపుతున్నారు. దీంతో ఈవారం ఓటింగ్ విషయంలో శివాజీని వెనక్కినెట్టి అమర్ టాప్ స్థానానికి చేరుకున్నాడని తెలుస్తోంది.

Also Read: సీరియల్ బ్యాచ్‌కు సపోర్ట్ చేసేలా బిగ్ బాస్ టాస్క్, ఈసారి కెప్టెన్ అయ్యేది అతడేనా?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Embed widget