Bigg Boss 5 Telugu: 'సన్నీది నిజమైన గెలుపు కాదు..' ట్రోల్ చేస్తోన్న షణ్ముఖ్ ఫ్యాన్స్..
షణ్ముఖ్ ఫ్యాన్స్ సన్నీని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా సన్నీని ట్రోల్ చేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ.. రన్నరప్ గా షణ్ముఖ్ నిలిచారు. నిజానికి హౌస్ లో షణ్ముఖ్ బిహేవియర్ కారణంగా అతడిపై నెగెటివిటీ క్రియేట్ అయింది. కానీ అతడికున్న మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఫినాలే వరకు వచ్చేలా చేసింది. సన్నీ, షణ్ముఖ్ లకు ఫినాలే స్టేజ్ కి నాగార్జున తీసుకొచ్చినప్పుడు.. చాలా మంది షణ్ముఖ్ విన్నర్ అవ్వాలని కోరుకున్నారు. కానీ సన్నీ ట్రోఫీ కొట్టేశాడు. దీంతో షణ్ముఖ్ ఫ్యాన్స్ సన్నీని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా సన్నీని ట్రోల్ చేస్తున్నారు.
సన్నీది నిజమైన గెలుపు కాదని.. అతడికున్న పీఆర్ టీమ్ బాగా పుష్ చేయడంతోనే ట్రోఫీ దక్కించుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. హౌస్ లో ఉన్నన్ని రోజులు గ్రూప్ గా ఆడాడని.. సన్నీను టార్గెట్ చేస్తున్నారు. దీంతో సన్నీ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. షణ్ముఖ్ తో పాటు అతడి ఫ్యాన్స్ కూడా పాజిటివిటీను తీసుకోలేకపోతున్నారని.. ప్రతి విషయాన్ని నెగెటివ్ గా చూడడమే వాళ్లకు తెలుసంటూ మండిపడుతున్నారు.
సన్నీని విన్నర్ గా అనౌన్స్ చేసిన తరువాత షణ్ముఖ్ కనీసం స్టేజ్ పై సన్నీని కంగ్రాట్యులేట్ చేయలేదని.. తన స్పీచ్ లో కూడా గెలుపనేది ముఖ్యం కాదని.. ఎలా ఆడామనేదే ముఖ్యమంటూ డైలాగ్స్ వేశాడని.. దాన్ని బట్టి అతడు సన్నీ విజయాన్ని తట్టుకోలేకపోయాడనే విషయం క్లియర్ గా తెలుస్తుందని.. అతడొక నెగెటివ్ పెర్సన్ అంటూ సన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
షణ్ముఖ్ కూడా తన గేమ్ కోసం సిరిని వాడుకున్నాడని.. అసలు అతడు టాస్క్ లు ఆడకుండా మోజ్ రూమ్ లో కూర్చుంటున్నాడంటూ నాగార్జున కూడా చాలా సార్లు తిట్టారంటూ హౌస్ లో సంఘటనలను గుర్తు చేసి మరీ షణ్ముఖ్ ఫ్యాన్స్ ను ట్రోల్ చేస్తున్నారు సన్నీ ఫ్యాన్స్. ఏదేమైనా.. అత్యధిక ఓట్లతో సన్నీ గెలిచాడనేది నిజం. ప్రస్తుతం సన్నీ తన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
Also Read: 'మగాడివైతే రా ఆడు అన్నారు..' ఇప్పుడు గెలిచి చూపించాడు.. సన్నీ గెలుపుకి కారణాలివే..
Also Read:బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 'మిర్చి' బ్యూటీ.. గుండెబరువెక్కిస్తున్న ఎమోషనల్ ట్వీట్
Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?
Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి