Bigg Boss Season 7: హౌజ్‌మేట్స్‌ను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్న తేజ, అశ్వినికి బిగ్ బాస్ అర్థం కావడం లేదన్న నాగ్
Bigg Boss Season 7: బిగ్ బాస్ సీజన్ 7లో సండే ఫన్‌డే గేమ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ఇందులో కంటెస్టెంట్స్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు నాగార్జున.
బిగ్ బాస్ సీజన్ 7లో మరో సండే ఫన్‌డే ఎపిసోడ్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి నాగార్జున సిద్ధమయ్యారు. ఇప్పటికే సండే ఫన్‌డే సంబంధించిన మొదటి ప్రోమో విడుదల కాగా.. అనిల్ రావిపూడి, శ్రీలీల బిగ్ బాస్‌కు వచ్చి సందడి చేసినట్టుగా అందులో చూపించారు. తమ చిత్రం ‘భగవంత్ కేసరి’ ప్రమోషన్స్ కోసం వచ్చిన శ్రీలీల, అనిల్.. కాసేపు కంటెస్టెంట్స్‌తో కబుర్లు కూడా చెప్పారు. ఇది కాకుండా తాజాగా బిగ్ బాస్ సండే ఫన్‌డేకు సంబంధించి రెండో ప్రోమో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కంటెస్టెంట్స్‌తో ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడించారు నాగార్జున. ఫైనల్‌గా దామిని, రతిక, శుభశ్రీల రీఎంట్రీ కోసం ఓటింగ్ కూడా జరిగింది.
తేజ కామెడీ..
సండే ఫన్‌డే టాస్కులో ముందుగా ఒక్కొక్క కంటెస్టెంట్‌ను పిలిచి.. వారి గురించి ప్రశ్నలు అడుగుతారు నాగార్జున. ఆ ప్రశ్నలకు ఎస్ లేదా నో బోర్డ్ చూపించి సమాధానాలు చెప్పాలి ఇతర కంటెస్టెంట్స్. ముందుగా తేజను పిలిచిన నాగ్.. ‘‘తేజ కామెడీని మాత్రమే ఉపయోగించి ముందుకు వెళ్తున్నాడు’’ అని అన్నారు. దానికి తేజ.. ‘‘రెండుసార్లు కెప్టెన్సీ కంటెండర్ కూడా అయ్యాను అది ఆలోచించుకొని చెప్పండి’’ అంటూ కంటెస్టెంట్స్‌కు గుర్తుచేశాడు. అది విన్న నాగార్జున.. ‘‘ఇదే ఇన్‌ఫ్లుయెన్స్ చేయడమంటే’’ అన్నారు. దీంతో తేజ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా నిలబడ్డాడు. ఇక నాగ్ అడిగిన ప్రశ్నకు చాలామంది నో అనే సమాధానం చెప్పినా.. గౌతమ్, యావర్, భోలే మాత్రం తేజ కామెడీతో మాత్రమే ముందుకు వెళ్తున్నాడని సమాధానమిచ్చారు. దీంతో టైమ్ బాగుంది నీది అని కామెంట్ చేశారు నాగార్జున.
అశ్వినికి ఆట అర్థం కావడం లేదు..
ఆ తర్వాత అశ్వినిని పిలిచి ‘‘అశ్వినికి బిగ్ బాస్ అర్థం కావడం లేదు’’ అని అన్నారు. దీనికి అందరు కంటెస్టెంట్స్ అవును అనే సమాధానమే ఇచ్చారు. కానీ తేజ మాత్రం ముందు కాదు అని చూపించి.. ఆ తర్వాత అవును అన్నాడు. ఇది నాగార్జున గమనించారు. ‘‘సేఫ్ గేమ్ బాగా ఆడావు. నువ్వు ఒక్కడివే నో చెప్పావు కాబట్టి నువ్వే షాట్ తీసుకోవాలి’’ అని అన్నారు. వేరేదారి లేక షాట్ తాగిన తేజ.. ‘‘ఈసారి కరెక్ట్‌గా తిప్పుతాను. ఎటు పడితే అటు తిప్పను.’’ అని మాటిచ్చాడు.
శోభా సగం, తేజ సగం..
శోభా శెట్టిని పిలిచిన నాగ్.. ‘‘శోభా ఓటమిని తీసుకోలేదు’’ అన్నారు. ప్రియాంక తప్పా అందరూ అవును అనే సమాధానమిచ్చారు. దీంతో శోభా షాట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నేను సగం, తేజ సగం తాగుతాము అని చెప్పగానే నాగార్జున కూడా దానికి ఒప్పుకున్నారు. దీంతో తేజ మళ్లీ బుక్ అయ్యాడు. ఆ తర్వాత అమర్‌దీప్ టర్న్ వచ్చింది. ‘‘ఫ్రెండ్స్ చెప్పే మంచి కూడా అమర్ అర్థం చేసుకోలేకపోతున్నాడు’’ అని అన్నారు నాగ్. దానికి దాదాపుగా అందరు కంటెస్టెంట్స్ అవును అనే అన్నారు. ఆ సమాధానాలు చూసి అమర్ షాక్ అయ్యి షాట్ తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సందీప్ ఒక షాట్ తీసుకున్న తర్వాత కూడా అమర్ కోసం ఇంకొకటి అని మరో షాట్ కూడా తాగాడు. అది చూసిన శివాజీ ‘‘ఇదే త్యాగం’’ అని కామెంట్ చేశాడు. ఇక ఈ ప్రోమో చివరిలో రతిక, దామిని, శుభశ్రీ రీఎంట్రీ కోసం ఓటింగ్ జరిగింది.
Also Read: బిగ్ బాస్ స్టేజ్‌పై శ్రీలీల సందడి- "మాస్" డైలాగ్‌తో అదరగొట్టిన యావర్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial