Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?
Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే ఆదిరెడ్డి గెలుచుకున్నాడనే ప్రచారం జరిగింది. కానీ గెలిచింది శ్రీహాన్ అని సమాచారం.
Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుపు కోసం నాలుగు రోజులుగా రకరకాల టాస్కులు ఆడుతున్నారు ఇంటి సభ్యులు. ఆదిరెడ్డి ఆటల్లో ఎక్కువ పాయింట్లు సాధించడం, మొదటి గేమ్ గెలవడం వల్ల ఆయనే టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నాడని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఇంకా అనేక టాస్కులు సాగాయి. ఇప్పుడు చివరకు చేరుకుంది రేస్. ఈరోజు ఎపిసోడ్ వరకు చూస్తే ఇంటి సభ్యుల్లో అయిదుగురు మాత్రమే ఈ రేస్‌లో మిగిలారు. కీర్తి, ఇనాయ, శ్రీ సత్య ఆట నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన రేవంత్, ఫైమా, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డిలో ముగ్గురు ఆడాలని, ఆ ముగ్గురు ఎవరో ఏకాభిప్రాయంతో చెప్పాలని అడిగారు బిగ్ బాస్. ఈ అయిదుగురు కాసేపు వాదించుకున్నారు. చివరికి సంచాలక్‌లైన ఇనాయ, కీర్తి, శ్రీసత్యలను అడిగారు బిగ్ బాస్. వీరు రేవంత్, రోహిత్, ఫైమాను ఎంపిక చేశారు.
రోహిత్ గొడవ
కానీ రోహిత్ తాను ఆడనని, ఎక్కువ పాయింట్లు వచ్చిన వారు అన్యాయం అవుతారని వెనక్కి తగ్గాడు. దీంతో ఇనాయ, కీర్తి, శ్రీసత్య మాట్లాడుకుని టాప్‌లో ఉన్న ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్‌లను ఎంపిక చేశారు. ఇనాయ మాట్లాడుతూ ‘రోహిత్ ఆడనని అన్నారు కాబట్టి, వీరిని ఎంపిక చేశా’ అని చెప్పింది. దానికి రోహిత్ చాలా సీరియస్ అయిపోయారు. నేను ఆడకపోతే ఫైమాను ఎందుకు తీసేశావని అడిగాడు. సిల్లీ నిర్ణయం’ అని అన్నాడు రోహిత్. దానికి ఇనాయ ‘నువ్వు సిల్లీగా బిహేవ్ చేస్తున్నావ్’ అంది. దానికి రోహిత్ చాలా సీరియస్ అయిపోయాడు. ‘బిహేవియర్ గురించి నువ్వు మాట్లాడకు’ అంటూ కళ్లు పెద్దవి చేస్తూ మీదమీదకి వెళ్లాడు. చివరికి ఇది అబ్బాయిలు, అమ్మాయిలు గొడవగా మారింది. నలుగురు అబ్బాయిలు ఒకచోట, నలుగురు అమ్మాయిలు ఒకచోట కూర్చుని చర్చించుకున్నారు.
మీరు ముగ్గురికీ ఓ టాస్కు ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్కులో రేవంత్, శ్రీహాన్ బాగా ఆడారు. ఆదిరెడ్డికి తక్కువ పాయింట్లు వచ్చాయి. దీంతో ఆయన టాస్కు నుంచి బయటికి వెళ్లిపోయాడు. చివరికి మిగిలింది రేవంత్, శ్రీహాన్. వీరిద్దరు టాప్ 2లో ఉన్నారు. రేవంత్‌కి పదిహేను పాయింట్లు, శ్రీహాన్ 14 పాయింట్లు, ఆదిరెడ్డికి 14 పాయింట్లు వచ్చాయి. టిక్కెట్ టు ఫినాలే ఫైనల్ దశకు చేరుకుంది. ఇందులో రేవంత్‌తో శ్రీహాన్ - ఆదిరెడ్డిలో ఒకరే పోటీపడాలని చెప్పారు బిగ్ బాస్.
దీంతో శ్రీహాన్ - ఆదిరెడ్డి మధ్య ఓ పోటీ పెట్టారు. ఇందులో శ్రీహాన్ గెలిచి రెండో స్థానాన్ని నిలుపుకున్నాడు. దీంతో టిక్కెట్ టు ఫినాలే రేసులో రేవంత్ - శ్రీహాన్ మిగిలారు. వీరిలో శ్రీహాన్ టిక్కెట్ టు ఫినాలే గెలిచినట్టు సమాచారం. ఈరోజు ఎపిసోడ్లో ఈ విషయం తేలిపోనుంది.
ముందు వరకు ఏకాభిప్రాయం వద్దు అన్న ఆదిరెడ్డి, శ్రీహాన్‌తో ఓడిపోయాక మాత్రం ఏకాభిప్రాయం ఇస్తే బాగుండును అని మాట్లాడాడు. ఈయనకు నచ్చినట్టు అభిప్రాయాలు మార్చేసుకుంటున్నాడు.
Also read: గుడ్డు జాగ్రత్త టాస్కులో శ్రీసత్యతో రేవంత్ వాదన - కొనసాగుతున్న టిక్కెట్ టు ఫినాలే రేస్