Shobha Shetty: 'ఘాటెక్కిన' బిగ్ బాస్ హౌస్ - స్పైసీ చికెన్ టాస్క్ లో ఏడ్చేసిన శోభా శెట్టి
మూడో పవర్ అస్త్ర కోసం పోటీలో నిలిచిన ముగ్గురికి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. కంటెండర్ గా నిలిచేందుకు తాము అర్హులమని నిరూపించుకునేందుకు బాగానే కష్టపడుతున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో మూడో పవర్ అస్త్ర కోసం వాడీ వేడిగా పోటీలు జరుగుతున్నాయి. ఇప్పటికే సందీప్, శివాజీ పవర్ అస్త్ర గెలుచుకోగా మూడో పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్ ముగ్గురు కంటెండర్లని సెలెక్ట్ చేశాడు. అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టిని ఎంపిక చేశారు. అయితే వాళ్ళు అర్హులో కాదో తెలియజేయాలంటూ ఇంటి సభ్యుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వాళ్ళలో ముందుగా ప్రిన్స్ యావర్‌ను రతిక, దామిని, తేజ.. అనర్హులు అని ప్రకటించారు. దీంతో తను అనర్హుడా? కాదా? అని తమనే టెస్ట్ చేయమన్నాడు బిగ్ బాస్. దీంతో ఆ ముగ్గురు రంగంలోకి దిగి యావర్‌కు చుక్కలు చూపించారు. ఇక ఇప్పుడు శోభా శెట్టి వంతు వచ్చింది. బాగా ఘాటుగా ఉన్న చికెన్ పంపించి తినమని చెప్పాడు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు.
స్పైసీ చికెన్ టాస్క్.. ఏడ్చిన శోభా శెట్టి
శోభాని వ్యతిరేకించిన ముగ్గురు ఇంటి సభ్యులతో పోటీ పడి కంటెండర్ షిప్ ని డిఫెండ్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ తనకి ఇచ్చాడు. కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఎదురుగా బౌల్ లో అత్యంత కారంగా ఉన్న చికెన్ తినమని బిగ్ బాస్ ఆదేశించాడు. మీలో గెలవాలనే ఆకలిని నిరూపించుకునే సమయం వచ్చిందని చెప్పారు. శోభా కారంగా ఉన్న చికెన్ తినేందుకు చాలా వరకు ట్రై చేసింది. తన లైఫ్ లో ఇంతవరకు ఎప్పుడు ఇంత కారం తినలేదని ఏడ్చేసింది. మీరు ఎంత ఎక్కువ కారం తింటే అది మీ ప్రత్యర్థులని బీట్ చేయడానికి ఇచ్చే బెంచ్ మార్క్ అవుతుందని బిగ్ బాస్ చెప్పాడు. పాపం ఒకానొక టైమ్ లో కారం తట్టుకోలేక బాగా ఏడ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేటప్పుడు ఏడవనని అమ్మకి మాట ఇచ్చాను కానీ అంటూ కారం ఘాటు తట్టుకోలేక గుక్కపట్టి ఏడ్చేసింది.
ఇక శోభాని వ్యతిరేకించిన శుభశ్రీ, ప్రశాంత్, గౌతమ్ కృష్ణ ముందు కారంగా ఉన్న చికెన్ పెట్టారు. ముగ్గురిలో ఎవరు త్వరగా వాటిని తినేస్తారో వాళ్ళు శోభ స్థానంలో కంటెండర్ గా ఉంటారని బిగ్ బాస్ వాళ్ళకి పోటీ పెడతాడు. గౌతమ్ తింటుంటే అయ్యయ్యో డాక్టర్ బాబు అని దామిని అంటుంది. ముగ్గురు కూడా పోటా పోటీగా స్పైసీ చికెన్ లాగించేస్తూ కనిపించారు. మరి ఈ పోటీలో ఎవరు విజేతలుగా నిలిచారు. లేదంటే శోభానే కంటెండర్ గా కొనసాగిందా లేదా తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
నిన్నటి పోటీలో ప్రిన్స్ యావర్ కు రతిక, దామిని, తేజ చుక్కలు చూపించారు. ఏం జరిగినా కూడా స్టాండ్ బై మీద పెట్టిన మొహం కదిలించకూడదని బిగ్ బాస్ యావర్ ని ఆదేశించాడు. దీంతో వాళ్ళ ముగ్గురు యావర్ కి చుక్కలు చూపించారు. మొహం మీద నీళ్ళు, గుడ్లు కొట్టారు. పేడ తెచ్చి ఒంటి మీద వేశారు. ఐస్ ముక్కలు యావర్ ప్యాంట్ జేబులో వేసినా కూడా కదలకుండా స్ట్రాంగ్ గా నిలబడి పోటీలో గెలిచాడు.
Also Read: ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ‘బిగ్ బాస్’ రతికపై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్?