News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Rahul Sipligunj: ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ‘బిగ్ బాస్’ రతికపై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్?

రతిక ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లిన రోజు నుంచి.. రాహుల్ సిప్లిగంజ్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై రాహుల్ పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో విన్నర్‌గా నిలిచాడు రాహుల్ సిప్లిగంజ్. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రాహుల్‌కు అవకాశాలు పెరిగాయి. ఆస్కార్ స్టేజ్ మీద పాడేంత వరకు తన పాపులారిటీ వెళ్లిపోయింది. అయినా కూడా బిగ్ బాస్ తనకు ఇచ్చిన ఫేమ్‌ను రాహుల్ మర్చిపోలేదు. అందుకే ఇంకా బిగ్ బాస్‌ను ఫాలో అవుతున్నాడని తన లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూస్తే అర్థమవుతోంది. అయితే, అతడి పోస్ట్ ‘బిగ్ బాస్’ గురించి కాదు. అందులోని కంటెస్టెంట్ రతిక గురించి అని తెలుస్తోంది. గత కొద్ది రోెజులుగా సోషల్ మీడియాలో ట్రెండవ్వుతోన్న రతిక, రాహుల్ సిప్లిగంజ్ ఫొటోలపై పరోక్షంగా స్పందించినట్లు టాక్.

‘‘ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? జనాలు ఎప్పుడూ తమ సొంత టాలెంట్‌ను నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఎప్పుడూ ఇతరుల పేరు, టాలెంట్‌పైనే ఆధారపడుతుంటారు. అదే విషయాన్ని కొందరు నిరూపిస్తారు కూడా. ఫేమ్ కోసం అవసరం కంటే ఎక్కువ వాడుకుంటారు. నీలోని మనిషికి ఆల్ ది బెస్ట్. డబ్బులు తీసుకున్న టీమ్‌కు కంగ్రాట్స్’’ అని రాహుల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేశాడు.

బలపడుతున్న అనుమానాలు

రాహుల్ పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ.. తాజాగా బిగ్ బాస్ హౌజ్‌లో రతిక చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌ అని నెటిజన్స్ అంటున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి రతిక గేమ్ ప్లాన్ చాలా డిఫరెంట్‌గా ఉందని చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు. అంతే కాకుండా పలుమార్లు తను తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్తూ బాధపడింది. అదే సమయంలో ఆమె రాహుల్‌తో చనువుగా దిగిన ఫోటోలు బయటికి వచ్చాయి. దీంతో రతిక ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ అయ్యిండవచ్చని అనుమానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో రాహుల్ ఇలా స్పందించి ఉంటాడని తెలుస్తోంది.

రాహుల్ సపోర్ట్ ఎవరికి..?

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో గ్రూప్స్ ఫార్మ్ అయిపోయాయి. ఎవరి ఫ్రెండ్స్ వారినే సపోర్ట్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఆ ఫ్రెండ్స్ కూడా మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇవన్నీ బిగ్ బాస్ ప్రేక్షకులు బయట నుంచి గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చాలామంది ఎక్స్ కంటెస్టెంట్స్ సైతం బిగ్ బాస్‌ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ అందులో తమ సపోర్ట్ ఎవరికీ అని సోషల్ మీడియా ద్వారా బయటపెడుతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 ఫేమ్ అఖిల్ సార్థక్ సైతం తన సపోర్ట్ పల్లవి ప్రశాంత్‌కే అంటూ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఇన్‌డైరెక్ట్‌గా ఒక కంటెస్టెంట్‌ను తిడుతూ.. మరో కంటెస్టెంట్‌ను సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. 

Also Read: మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వసుందరి - మరి అనుష్క శెట్టి సంగతేంటి?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 20 Sep 2023 10:36 PM (IST) Tags: Rahul Sipligunj bigg boss season 7 telugu Rathika rose Rathika Rathika Rahul Sipligunj Rathika Sipligunj Love

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: అదే మా ఇంట్లో ఆడవాళ్లైతే గొంతు మీద కాలేసి తొక్కేవాడిని - శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు

Bigg Boss 7 Telugu: అదే మా ఇంట్లో ఆడవాళ్లైతే గొంతు మీద కాలేసి తొక్కేవాడిని - శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు

Bigg Boss 7 Telugu: శివాజీని గెలిపించిన హౌజ్‌మేట్స్ - తాను నమ్మే సూత్రం అదేనట!

Bigg Boss 7 Telugu: శివాజీని గెలిపించిన హౌజ్‌మేట్స్ - తాను నమ్మే సూత్రం అదేనట!

Bigg Boss 7 Telugu: పక్కనోళ్లని చూసి నేర్చుకోవాలి - శోభాకు అమర్ సీరియస్ సలహా

Bigg Boss 7 Telugu: పక్కనోళ్లని చూసి నేర్చుకోవాలి - శోభాకు అమర్ సీరియస్ సలహా

Keerthi Bhat: రక్తం మరిగిపోతోంది - అమర్ అభిమానులపై సీరియల్ నటి కీర్తి భట్ ఆగ్రహం

Keerthi Bhat: రక్తం మరిగిపోతోంది - అమర్ అభిమానులపై సీరియల్ నటి కీర్తి భట్ ఆగ్రహం

Bigg Boss 7 Telugu: ఆడపిల్ల అని అడ్వాంటేజ్ తీసుకోకు, మంచిది కాదు - శోభాకు శివాజీ వార్నింగ్

Bigg Boss 7 Telugu: ఆడపిల్ల అని అడ్వాంటేజ్ తీసుకోకు, మంచిది కాదు - శోభాకు శివాజీ వార్నింగ్

టాప్ స్టోరీస్

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Rashmika Mandanna: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?

Rashmika Mandanna: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం