Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఇంటిలో ఆ హగ్గులు, ముద్దులు ఏంట్రా బాబూ... ఫ్యామిలీ షో అని మర్చిపోయారా?
బిగ్ బాస్ 8లో ముద్దులు, హాగ్గులు హద్దులు దాటుతున్నాయి. ఓవైపు క్లోజ్ గా ఉన్నట్టుగా నటిస్తూనే మరోవైపు ఛాన్స్ దొరికినప్పుడల్లా తమ నిజ స్వరూపాలను బయట పెడుతున్నారు కంటెస్టెంట్స్.
బిగ్ బాస్ హౌస్ లో ఈసారి ఉన్న కంటెస్టెంట్స్ అంతా గోడ మీద పిల్లి లాగే ఉంటున్నారు. ఓవైపు హగ్గులు, ముద్దులు, గొడవలు అంటూనే మరోవైపు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు. క్లోజ్ గా ఉంటూనే ఫ్రెండ్స్ కి వెన్నుపోటు పొడుస్తున్నారు. గోడ మీద పిల్లిలా అయితే అటు లేకపోతే ఇటు అన్నట్టుగా ఉంటున్నారు.
క్లోజ్ గా ఉంటూనే వెన్నుపోటు
అభయ్ నవీన్, నిఖిల్, సోనియా క్లోజ్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అభయ్ రెండు నాలుకల మనిషిలా ఎప్పటికప్పుడు సోనియాపై యష్మీ గౌడ, ప్రేరణ దగ్గర కంప్లైంట్ చేస్తూనే ఉన్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా సోనియాతో పాటు మణికంఠ గురించి యష్మి గౌడ, ప్రేరణ దగ్గర చెప్పారు. అక్కడే నబిల్, ఆదిత్య ఓం కూడా ఉన్నారు. ప్రేరణ అయితే "అలాంటి మనిషితో పదేళ్లు ఎలా ఫ్రెండ్షిప్ చేశావు అన్నా?" అంటూ సోనియాపై సెటైర్ వేసింది. ఆ తర్వాత నిఖిల్ కూడా సోనియాపై అభయ్ కి "సిగరెట్ తాగినందుకు మాట్లాడడం మానేసింది. నా పర్సనల్ విషయాల్లో ఎలా జోక్యం చేసుకుంటుంది" అంటూ కంప్లైంట్ చేయడమే కాకుండా మరోవైపు కిరాక్ సీత, విష్ణు ప్రియ దగ్గర కూడా మాట్లాడాడు. ఇక నిన్న కంటెండర్ టాస్క్ లో తాను ఓడిపోతాను అనుకున్నారని, "కానీ నేను ఛాన్స్ ఇచ్చాను అది ఎలా వాడుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం" అంటూ మళ్ళీ నైనిక, విష్ణు ప్రియ దగ్గరికి వెళ్లి చెప్పాడు. మరోవైపు సోనియా ఓవైపు నిఖిల్ తో క్లోజ్ గా ఉంటూనే మరోవైపు అతను వీక్ గా డెసిషన్ తీసుకుంటాడు అంటూ అభయ్ దగ్గర వాగేసింది.
ఇది ఫ్యామిలీ షో అని మర్చిపోయారా?
అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో కాస్త మసాలా ఘాటు ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. నాగ మణికంఠ ఎప్పుడు పడితే అప్పుడు ఎవర్ని పడితే వారిని హగ్ చేసుకోవడం, కిస్ చేయడం చూస్తూనే ఉన్నాము. అలాగే సోనియా, నిఖిల్ హగ్గులకైతే లెక్కేలేదు. ఇందులో పృథ్వీ రాజ్ కూడా తక్కువేమీ కాదు. నిన్నటి ఎపిసోడ్లో సోనియాను అభయ్ తో పాటు నిఖిల్, నాగ మణికంఠ కూడా గ్రూప్ గా హగ్ చేసుకున్నారు. నిఖిల్ చీఫ్ కంటెండర్ గా సోనియాని ప్రకటించిన తర్వాత మరోసారి పృథ్వీ.. నిఖిల్, సోనియాను కలిపే విధంగా దగ్గరకు తీసుకొచ్చి ముగ్గురూ హగ్ చేసుకునేలా చేశాడు. ఇక ఆ టాస్క్ లో విన్ అయినప్పుడు నిఖిల్ ని యష్మి గౌడ గట్టిగా హగ్ చేసుకోవడమే కాకుండా ముద్దిచ్చింది. ఇలా మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల కంటే ఎక్కువగా హగ్సే కనిపిస్తూ ఉండడం చికాకు పుట్టిస్తోంది. అది కూడా అమ్మాయి, అబ్బాయి మధ్యనే ఇలాంటివి కన్పిస్తుండడం గమనార్హం. వాళ్ళు ఏ ఇంటెన్షన్ తో చేసినా ప్రేక్షకులకు మాత్రం చూడడానికి చాలా బాగోలేదు. ఇది ఫ్యామిలీ షో అని మర్చిపోయారా అనే అనుమానం కలుగుతుంది.
Also Read: విశ్వక్, సిద్దుతో ఎన్టీఆర్ చిట్ చాట్ వీడియో చూడడంతో పాటు వార్తను చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి