Bigg Boss 8 Telugu: పెద్ద బాంబ్ పేల్చిన బిగ్ బాస్ - అభయ్ క్లాన్ మొత్తానికి కష్టాలు... చీఫ్ పదవిని పీకేసి స్ట్రాంగ్ వార్నింగ్
మాట మాటకి బిగ్ బాస్ పై సెటైర్లు వేస్తున్న అభయ్ నవీన్ కు తాజా ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అభయ్ నోటి దురుసు కారణంగా ఆయన టీం కూడా కష్టాల్లో పడింది.
![Bigg Boss 8 Telugu: పెద్ద బాంబ్ పేల్చిన బిగ్ బాస్ - అభయ్ క్లాన్ మొత్తానికి కష్టాలు... చీఫ్ పదవిని పీకేసి స్ట్రాంగ్ వార్నింగ్ Abhay Naveen fires on Bigg Boss and gets warning in return Know Bigg Boss 8 Telugu Day 20 Review Bigg Boss 8 Telugu: పెద్ద బాంబ్ పేల్చిన బిగ్ బాస్ - అభయ్ క్లాన్ మొత్తానికి కష్టాలు... చీఫ్ పదవిని పీకేసి స్ట్రాంగ్ వార్నింగ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/21/e7aa5f42d950ca9de9809fa99013711617268853557281106_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బిగ్ బాస్ సీజన్ 8 లో ఉన్న కంటెస్టెంట్లలో అభయ్ నోటి దురుసుకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఏకంగా బిగ్ బాస్ పైనే సెటైర్లు వేయడం, కామెడీ చేయడంతో పాటు అసహనం వ్యక్తం చేస్తున్నాడు. కొన్నిసార్లు కరెక్ట్ గానే మాట్లాడినప్పటికీ అది బిగ్ బాస్ హౌస్ కాబట్టి అవన్నీ చెల్లవు కదా. ఇక అతనితో పాటు అతని టీం సభ్యులు కూడా తోడయ్యారు. దీంతో తాజాగా బిగ్ బాస్ అభయ క్లాన్ పై బిగ్ బాంబ్ పేల్చాడు.
చీఫ్ పదవిని పీకేసి స్ట్రాంగ్ వార్నింగ్....
అభయ్ చీఫ్ గా మారినప్పటికీ గేమ్ సరిగ్గా ఆడట్లేదు. పైగా తన టీమ్ లోని ఎవ్వరిని ఆడని ఇవ్వట్లేదు కూడా. ఈ నేపథ్యంలోనే "ఇదేం పనికిమాలిన గేమ్? గేమ్ బయాజ్డ్, కాదు కాదు బిగ్ బాస్ బయాజ్డ్... బయటకు వెళ్ళాక ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట చెప్తాను" అంటూ అభయ్ బిగ్ బాస్ ని తిట్టడంతో, ప్రేరణ కూడా అందులో పాలుపంచుకుంది. ఇద్దరూ కలిసి సెటైర్ల మీద సెటైర్లు వేశారు బిగ్ బాస్ పై. ఇక ఆ తర్వాత మొత్తానికి గుడ్ల టాస్క్ ను ముగించిన బిగ్ బాస్ ఓడిపోవడంతో అభయ్ చీఫ్ పదవిని పీకేశాడు. చీఫ్ అయినప్పటి నుంచి నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్న అభయ్ ఛీ తన పదవిని పీకేసాక కూడా మళ్లీ రెచ్చిపోయాడు. శక్తి టీం గెలిచింది కాబట్టి మరోసారి చీఫ్ కంటెండర్ గా అతను పోటీ పడొచ్చని, అలాగే రెడ్ ఎగ్ ఉన్న వాళ్ళు కూడా పోటీలో ఉంటారని చెప్పారు. ఇక కాంతారా టీం నుంచి ముగ్గురుని చీప్ కంటెండర్ పోటీకి సెలెక్ట్ చేశారు. దీంతో అభయ్ మళ్లీ తన నోటికి పని చెప్పాడు. "అసలు బిగ్ బాస్ కి క్లారిటీ ఉందా? నోటికి ఏది వస్తే అదే చెప్తున్నాడా? ఈ బిగ్ బాస్ ని మార్చేయాలి" అంటూ కామెంట్స్ చేశాడు.
అర్ధరాత్రి హౌస్ మేట్స్ కు వార్నింగ్
ఇక హౌస్ మేట్స్ అందర్నీ అర్ధరాత్రి గార్డెన్ లో నిలబెట్టి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్. "గుడ్ల టాస్క్ లో గెలిచిన శక్తి టీం లో చీఫ్ పదవి కోసం నిఖిల్ ఒక్కరితో మాత్రమే తలపడాల్సి ఉంటుంది. విన్ అయినందుకు అది అతనికి లభించిన ప్రయోజనం. ఓడిపోయిన టీమ్ నుంచి ముగ్గురు పదవి కోసం పోటీ పడాల్సి ఉంటుంది? అని చెప్పారు బిగ్ బాస్. ఆ తర్వాత "ఇదే బిగ్ బాస్.. బిగ్ బాస్ రూల్స్ కు కట్టుబడి ఉంటేనే ఇక్కడ ఉండండి. కాదనుకుంటే వెళ్లిపోండి. బిగ్ బాస్ కంటే ఎక్కువ అని ఫీల్ అయితే ఉండాల్సిన అవసరం లేదు" అంటూ గేటు ఓపెన్ చేశారు. అప్పుడు కూడా అభయ్ సారీ చెప్పడానికి నిరాకరించడంతో పాటు తానసలు ఏమీ అనలేదని, కామెడీ కూడా చేయొద్దు అంటే కన్ఫేషన్ కి రూమ్ కి పిలిచి చెప్తే తను మాట్లాడేవాడినని అన్నాడు అభయ్. ఇలా బుకాయించడమే కాకుండా మరోసారి బిగ్ బాస్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత "అభయ్ బిగ్ బాస్ పై అభ్యంతరకర పదజాలం వాడారు. రాజే ఇలా ఉంటే అతని ప్రజల నుంచి ఇంకా ఏం ఆశించగలం" అంటూ అభయ్ కి ఇచ్చి పడేసాడు బిగ్ బాస్. అంతేకాకుండా అతను చేసిన తప్పుకు టీం మొత్తం శిక్ష అనుభవించాల్సిందేనని కాంతారా టీంకు చీఫ్ పదవి కోసం కంటెండర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయినట్టు ప్రకటించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)