అన్వేషించండి

Bigg Boss 7 Telugu: ఫుడ్ దొంగ అమర్ - నేను కప్ కోసం రాలేదు, డబ్బుల కోసం నాటకాలు ఆడలేను - శివాజీ గీతోపదేశం

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7కు ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క లక్ష్యంతో వచ్చారు. కానీ శివాజీ మాత్రం డబ్బు కోసం, కప్ కోసం రాలేదని తాజాగా బయటపెట్టాడు.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో మామూలుగా లగ్జరీ ఐటెమ్స్‌ను సొంతం చేసుకోవాలంటే కంటెస్టెంట్స్ అంతా లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఆడవలసి ఉంటుంది. కానీ సీజన్ 7లో లగ్జరీ బడ్జెట్ అంతా చాలా ఈజీగా కంటెస్టెంట్స్ చేతికి వచ్చింది. ఇక ఫినాలే వీక్ కావడంతో లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా హౌజ్‌లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్‌కు స్వీట్స్ వచ్చాయి. ఆ స్వీట్స్‌ను, లగ్జరీ బడ్జెట్‌ను అందరికీ సమానంగా పంచే బాధ్యతను ప్రియాంకకు ఇచ్చారు నాగార్జున. కానీ హౌజ్‌మేట్స్ మాత్రం అదంతా పట్టించుకోకుండా తనకు చెప్పకుండానే పూతరేకులను ఓపెన్ చేసి తిన్నారు. అర్జున్, అమర్‌దీప్, శివాజీ తిన్న తర్వాత మిగిలిన స్వీట్స్‌ను తీసుకెళ్లి దాచిపెట్టుకున్నాడు అమర్. అదే విషయాన్ని ప్రశాంత్‌తో చెప్తూ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అవ్వడం అనేది తనకు ముఖ్యమా కాదా అనే విషయాన్ని బయటపెట్టాడు శివాజీ.

హౌజ్‌లో ఫుడ్ దొంగతనం..
‘‘ఈ హౌజ్‌లో ఎంత ఫుడ్ దొంగతనం చేశారు వాళ్లు. నిన్న వచ్చిన దాంట్లో కూడా అది తీసుకొని లోపల పెట్టుకున్నాడు వాడు’’ అని అమర్‌దీప్ చేసిన పని గురించి పల్లవి ప్రశాంత్‌తో చెప్పుకొచ్చాడు శివాజీ. ‘‘అందరికీ ఇవ్వమని సార్ చెప్పాడు’’ అని ప్రశాంత్ గుర్తుచేశాడు. ‘‘అందరు తీసుకోండి అని చెప్తే.. పూతరేకులు అయిపోయాయి అని చెప్పాడు వాడు’’ అని అన్నాడు శివాజీ. ఇక హౌజ్‌మేట్స్ అందరి కోసం కాఫీ పౌడర్ పంపిస్తే.. శివాజీకి మాత్రమే సీక్రెట్‌గా తీసుకెళ్లి ఇచ్చాడు ప్రశాంత్. ఆ విషయంపై నాగార్జున చేత తిట్లు కూడా తిన్నాడు. అయితే తను రిక్వెస్ట్ చేయడం వల్లే కాఫీ పౌడర్ వచ్చింది అనుకున్నానని, అందుకే తీసుకొచ్చి తనకే ఇచ్చానని క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్. అలా కాసేపు బిగ్ బాస్ హౌజ్‌లోని ఫుడ్ గురించి మాట్లాడిన తర్వాత అసలు తను ఈ రియాలిటీ షోలోకి ఎందుకు వచ్చాడో బయటపెట్టాడు శివాజీ.

డబ్బు శాశ్వతం కాదు..
‘‘నేను కప్ కోసం రాలేదు. డబ్బుల కోసం రాలేదు. నేను జనం మనసులు గెలుచుకోవాలని వచ్చాను. అంతే. దానికోసం నాటకాలు ఆడలేను. డబ్బుల కోసం కూడా ఆడలేను. ఇంత డబ్బు వస్తుంది అంటే అది శాశ్వతంగా మన దగ్గర ఉండిపోదు. కోట్లు చూశాను నేను. పోయింది. మళ్లీ వచ్చింది. దాని అర్థమేంటి? డబ్బు మన దగ్గర శాశ్వతంగా ఉండదు. మన క్యారెక్టరే మనతో ఉంటుంది’’ అని పల్లవి ప్రశాంత్‌కు గీతోపదేశం చేశాడు శివాజీ. ప్రశాంత్‌తో మాత్రమే కాదు.. ఆడియన్స్‌తో కూడా గెలుపు గురించి తాను ఆలోచించడం లేదని, జనాల హృదయాలు గెలవడానికి వచ్చానని, అది తాను చేశానని నమ్ముతున్నానని అన్నాడు. 

ప్రపంచంలోనే గొప్ప షో..
బిగ్ బాస్ హౌజ్‌లో తన జర్నీ వీడియో చూసుకొని ఎమోషనల్ అయ్యాడు. తన 22 ఏళ్ల సినీ కెరీర్ అంతా ఒక ఎత్తు అయితే.. ఈ బిగ్ బాస్‌లో తను గడిపిన జీవితం మరొక ఎత్తు అని అన్నాడు. అంతే కాకుండా ప్రపంచంలో ఎక్కడా ఇంత గొప్ప షో లేదని ప్రశంసించాడు. తన ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసేలా చేసినందకు బిగ్ బాస్‌కు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఓటింగ్ విషయంలో కూడా శివాజీ.. టాప్ 2 స్థానంలో ఉన్నాడు. తన శిష్యుడైన పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఓటింగ్ శాతంలో పెద్దగా తేడా లేదని తెలుస్తోంది. అందుకే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు అవుతారా అని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది.

Also Read: భోలేను అన్నయ్య అనేసిన అశ్విని - పాపం ఎంత ఫీల్ అయ్యాడో!

టాప్ హెడ్ లైన్స్

Eknadh Harika: బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget