Bigg Boss Telugu 7 Promo: శివాజీకి ఎదురు మాట్లాడిన పల్లవి ప్రశాంత్ - శోభాశెట్టిపై ఫైర్, ఓటమికి వాళ్లే కారణమా?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 ప్రారంభం అయినప్పటి నుండి శివాజీ, పల్లవి ప్రశాంత్ ఎప్పుడూ కలిసే ఉన్నారు. కానీ మొదటిసారి ప్రశాంత్‌పై శివాజీ సీరియస్ అవ్వగా ప్రశాంత్ కూడా ఆయనకు కౌంటర్ ఇచ్చాడు.
Pallavi Prashanth, Shivaji fight : బిగ్ బాస్ సీజన్ 7లో చివరిగా మిగిలిన ఆటగాళ్ల మధ్య ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీ మొదలయ్యింది. ముందుగా ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం అమర్‌దీప్, గౌతమ్, అర్జున్, రతిక, అశ్విని పోటీపడ్డారు. వీరంతా కలిసి పజిల్ టాస్క్ ఆడారు. ఈ ఆటలో అందరూ చిన్న చిన్న తప్పులు చేసినా.. చివరిగా అర్జున్ విన్నర్ అని డిసైడ్ చేశాడు శివాజీ. దీంతో మొదటిగా అర్జున్ చేతికి ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వెళ్లింది. కానీ ఇది అర్జున్ దగ్గరే ఉండిపోదని, దీనిని కాపాడుకోవడం కోసం ఇతర కంటెస్టెంట్స్‌తో అర్జున్ పోటీపడాల్సి ఉంటుందని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు. అక్కడ నుంచి అసలు ఆట మొదలయ్యింది. ఇప్పుడు ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అర్జున్ చేతి నుంచి యావర్ చేతికి వచ్చింది. ఇక ఆ పాస్‌ను సొంతం చేసుకోవడం కోసం శివాజీ, ప్రియాంకలతో పోటీపడ్డాడు యావర్. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
యావర్‌కు ప్రశాంత్ సలహాలు
‘‘ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను సొంతం చేసుకోవడం కోసం ఒకరితో కాదు ఇద్దరితో డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది’’ అని బిగ్ బాస్ యావర్‌కు చెప్పడంతో ఈ ప్రోమో ప్రారంభమయ్యింది. ‘‘ఆ ఇద్దరు శివాజీ, ప్రియాంక. ఈ ఛాలెంజ్‌లో మీరు మీ విల్లును పైకి లేపి, బాల్స్ కింద పడకుండా వాటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది’’ అని టాస్క్ గురించి స్పష్టంగా చెప్పారు బిగ్ బాస్. దీంతో ఈ విల్లు పోటీకి యావర్, శివాజీ, ప్రియాంక సిద్ధమయ్యారు. ఈ టాస్క్‌కు శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ సంచాలకులుగా వ్యవహరించినట్టుగా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. టాస్క్ ఆడుతున్నంతసేపు యావర్‌కు సపోర్ట్ చేయడం కోసం తన పక్కనే నిలబడ్డాడు పల్లవి ప్రశాంత్. ‘‘చేయి విడిచిపెట్టు, అలా పట్టుకోకు’’ అంటూ పక్కన ఉండి సలహాలు ఇచ్చాడు. ఇదంతా శివాజీకి నచ్చలేదు.
శివాజీని డిస్టర్బ్ చేసిన ప్రశాంత్
ఒక బాల్‌ను బ్యాలెన్స్ చేసిన తర్వాత కంటెస్టెంట్స్ రెండో బాల్ పెట్టాల్సిన సమయం వచ్చింది. దీంతో రెండో బాల్ పెట్టమని యావర్‌ను ఆదేశించింది శోభా. అదే సమయంలో యావర్ పక్కన నిలబడి ‘‘రెండూ ఒకేసారి పెట్టు’’ అంటూ ఏదో ఒక సలహా ఇస్తూనే ఉన్నాడు ప్రశాంత్. అది చూసి విసిగిపోయిన శివాజీ.. ‘‘నువ్వు మాట్లాడకు. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు అందరిని’’ అని కోప్పడ్డాడు. దీంతో ప్రశాంత్ కాసేపు సైలెంట్ అయ్యాడు. మూడో బాల్ పెట్టే సమయానికి విల్లుపై బ్యాలెన్స్ అవ్వక ప్రియాంక గేమ్ నుంచి తప్పుకుంది. బ్యాలెన్స్ చేసుకోండి అని శోభా చెప్తుండగానే.. శివాజీ విల్లుపై బాల్స్ బ్యాలెన్స్ అవ్వక కింద పడిపోయాయి. దీంతో తన విల్లును కిందపడేసి ‘‘ముందు నీది డిస్టర్బెన్స్‌గా ఉంది’’ అని కోప్పడుతూ ఆట నుంచి పక్కకు తప్పుకున్నాడు.
నీకంటే పెద్దగా అరుస్తా..
‘‘సెలెంట్‌గా ఉండొచ్చు కదా. లాస్ట్‌లో చెప్పేది. తప్పయితే తప్పు. సైగలు చేస్తున్నావు. బాగా డిస్టర్బ్ చేశావు’’ అని పల్లవి ప్రశాంత్‌పై కోపడ్డాడు శివాజీ. ‘‘మమ్మల్ని చూడొద్దు. గేమ్ మీద ఫోకస్ పెట్టాలి’’ అని శివాజీకి ఎదురు సమాధానం ఇచ్చాడు ప్రశాంత్. పల్లవి ప్రశాంత్.. శివాజీపైకి ఎదురుతిరగడం చూసి అమర్‌దీప్, అర్జున్ నవ్వుకున్నారు. ఆ తర్వాత టాస్క్ ఫలితం ఏంటో చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. ‘‘శివన్న ఎక్కువసేపు బాల్‌ను హోల్డ్‌లో పెట్టుకున్నారు కాబట్టి ఆయనను ఔట్ చేశాము’’ అని శోభా చెప్తుండగానే.. ‘‘నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకో’’ అని శివాజీ సీరియస్ అయ్యాడు. దానికి శోభా అరవడం మొదలుపెట్టింది. శివాజీ కూడా ‘‘నీకన్నా పెద్దగా అరుస్తా. ఎందుకు అరుస్తున్నావు. అరవలేనా నేను’’ అంటూ శోభా మీదకు వచ్చాడు. మొత్తంగా చాలావరకు కూల్‌గా ఉండే శివాజీ.. నేడు జరగనున్న టాస్క్‌లో బ్యాలెన్స్ కోల్పోనున్నట్టు అనిపిస్తోంది.
Also Read: 'అన్ స్టాపబుల్‘ షోలో ‘యానిమల్’ టీమ్ సందడి, ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?