అన్వేషించండి

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss Telugu 7: శివాజీ, గౌతమ్.. అన్నాదమ్ములుగా కలిసున్న వారి మధ్య ముందు నుండే కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. అసలు అది ఎందుకు, ఎక్కడ మొదలయ్యింది అనే విషయం తాజాగా బయటికొచ్చింది.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ అంతా బయటికి అన్యూన్యంగా కనిపించినా.. కొంతమంది కోల్డ్ వార్ కూడా నడుస్తూ ఉంటుంది. అలా బిగ్ బాస్ సీజన్ 7లో గౌతమ్, శివాజీల మధ్య మొదటినుంచి కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అప్పుడప్పుడు వీరు బాగానే కలిసున్నట్టు కనిపించినా.. నామినేషన్స్ సమయం వచ్చేసరికి ఒకరి మీద మరొకరు కోపాన్ని బయటపెడతారు. శనివారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో కూడా అదే జరిగింది. నాగార్జున ముందే శివాజీ, గౌతమ్.. ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. కానీ గౌతమ్ చెప్పిన పాయింట్స్ సరైనవి కావు అనిపించడంతో నాగార్జున.. శివాజీకే సపోర్ట్ చేశారు.

శివాజీపై కోపం ఎందుకంటే.?
ముందుగా ‘కుల్లు, కుట్ర, కుతంత్రం నుంచి విముక్తి పొందడం ఎలా?’ అనే పుస్తకాన్ని గౌతమ్‌కు డెడికేట్ చేశాడు శివాజీ. అక్కడ గొడవ మొదలయ్యింది. మొదటివారం నుంచి గౌతమ్.. తనను నెగిటివ్‌గానే చూస్తున్నాడు అంటూ శివాజీ చెప్పడం మొదలుపెట్టాడు. అయితే శివాజీ ఎప్పుడూ యావర్, ప్రశాంత్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తాడని, వారు తప్పు చేసినా సపోర్ట్ చేస్తూనే ఉంటాడని ఆరోపించాడు గౌతమ్. తప్పు జరిగితే స్టాండ్ తీసుకుంటా అనే వ్యక్తి వారిద్దరూ తప్పు చేస్తే మాత్రం అలా చేయకూడదు అని చెప్పడని అన్నాడు. తప్పు జరిగితే చెప్పడానికి తాను ఎవరినని, అందరితో ఒకేలాగా ఉంటానని, వారికి మాత్రమే సపోర్ట్ చేస్తాను, ఇంకొకరి చేయను అని తానెప్పుడూ చెప్పలేదని శివాజీ సమర్థించుకున్నాడు.

అసలు గౌతమ్.. శివాజీ గురించి అలా అనుకోవడానికి కారణాలు ఏంటి అని నాగార్జున క్లియర్‌గా అడిగారు. అయితే తను డాక్టర్ కాబట్టి తన ఫ్యామిలీ మంచి స్థాయిలో ఉందని శివాజీ అనుకుంటున్నారని, తనకు కూడా సమస్యలు ఉన్నాయని, లోన్స్ ఉన్నాయని బయటపెట్టాడు గౌతమ్. కానీ శివాజీ మాత్రం అలా అనుకోకుండా ముందు నుండే వారే ఏమీ లేనివారని వారికి మాత్రమే సపోర్ట్ చేస్తూ తనకు ఈ షో అవసరమే లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడని చెప్పాడు. అయితే ఇదే విషయాన్ని శివాజీతో చెప్తే క్లియర్ అయిపోయేది కదా అని శివాజీ సలహా ఇచ్చారు. దానికి గౌతమ్ దగ్గర సమాధానం లేదు. శివాజీకి, తనకి జరుగుతున్న ఈ వాగ్వాదం మధ్యలోకి యావర్‌ను తీసుకొచ్చాడు గౌతమ్.

ప్రియాంక చేస్తే తప్పు కాదా.?
ఒకసారి యావర్.. తనకు చదువు చెప్పిన గురువుల గురించి తప్పుగా మాట్లాడాడని గౌతమ్ ఆరోపించాడు. తను అన్న మాటలకు ఉద్దేశ్యం అది కాదని యావర్ క్లారిటీ ఇచ్చాడు. ముందుగా గౌతమ్.. ఇంజెక్షన్ అని సైగ చూసి చూపించి గొడవ మొదలుపెట్టడం వల్లే యావర్ అలా మాట్లాడాడని, ముందుగా తప్పు గౌతమ్‌దే అని నాగార్జున సమర్థించారు. ఇంత వాగ్వాదం జరిగిన తర్వాత కూడా శివాజీ.. తను ప్రశాంత్, యావర్‌లకు స్పెషల్‌గా సపోర్ట్ చేయడం లేదనే మాట్లాడుతుండడంతో ప్రేక్షకులు కూడా సహనం కోల్పోయారు. ఆయన సపోర్ట్ చేస్తున్న విషయం క్లియర్‌గా కనిపిస్తుందని అనుకున్నారు. కానీ నాగార్జున మాత్రం ప్రియాంక కూడా తన ఫ్రెండ్స్‌కే సపోర్ట్ చేస్తుందని, అలాంటప్పుడు ఎందుకిలా ఆరోపించలేదని గౌతమ్‌ను నిలదీశాడు. దానికి గౌతమ్ దగ్గర సమాధానం లేదు. మొత్తంగా శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ప్రియాంక గ్రూప్ గేమ్ ఆడుతుంది అని ఆరోపణలు ఎదుర్కుంది. చాలామంది ప్రేక్షకులు కూడా అదే నిజమని ఫీల్ అవుతున్నారు. 

Also Read: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
Eknadh Harika: బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget