అన్వేషించండి

BiggBoss 6 Telugu: స్నేహితులు జట్టుగా ఆడితే తప్పు కాదు, అదే భార్యాభర్తలు కలిసి ఆడితే తప్పేంటి - రోహిత్‌ జర్నీ వీడియోలో బిగ్‌బాస్

BiggBoss 6 Telugu: రోహిత్ జర్నీ వీడియో చాలా హూందాగా ఉంది.

BiggBoss 6 Telugu: సీరియల్ హీరో రోహిత్ సాహ్ని. సీరియల్స్‌లో చేసినప్పుడు వచ్చిన గుర్తింపు కంటే బిగ్‌బాస్ లో అడుగుపెట్టాకే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని ప్రవర్తన ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉండే రోహిత్ విన్నర్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అమ్మాయిల్లో కీర్తి, మెరీనా, అబ్బాయిల్లో రోహిత్ ఈ సీజన్లో చాలా కామ్ అండ్ కంపోజ్డ్. కాగా ఫైనల్లోకి వెళ్లేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నాడు రోహిత్. మిడ్ వీక్ ఎలిమినేషన్లో కూడా సేవ్ అయితే అతడు ఫైనలిస్టు అయిపోతాడు. కాగా అతని జర్నీ వీడియోని వేశారు బిగ్ బాస్. 

గార్డెన్ ఏరియాలోకి వచ్చిన రోహిత్ అదే కామ్‌నెస్ తో ఉన్నాడు. అక్కడ పెట్టిన ఫోటోలు చూశాడు. తరువాత మెరీనా మాటలు విన్నాడు. ఇక బిగ్ బాస్ రోహిత్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ‘మొసలి నీటిలో ఉన్నప్పుడు తన బలాన్ని స్వేచ్ఛగా ప్రదర్శిస్తుంది. అదే నేలపై మాత్రం ఒక్క అడుగు వేయాలన్న ఆలోచిస్తుంది. కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి ఏదైనా సాధించడానికి ధైర్యం కావాలి. అదే ధైర్యాన్ని చూపిస్తూ కంటెస్టెంట్లుగా మారిన భార్యా భర్తలుగా మీరు బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టారు. ఎదురయ్యే సవాళ్లను, కష్టసుఖాలను పంచుకోవడం కేవలం జీవితభాగస్వామితోనే సాధ్యం. ఆ తోడు మీకు ఈ ఇంట్లో లభించింది. మిగతా ఇంటి సభ్యులు ఇదే విషయంపై మిమ్మల్ని తరచూ నామినేట్ చేస్తూ వచ్చారు. స్నేహితులు జట్టుగా  ఆడితే తప్పులేనిది, మీరిద్దరూ ఆడితే ఎందుకు చర్చనీయాంశం అయ్యింది? భార్యాభర్తలకు మించిన స్నేహితులు ఉంటారా? అనే భావన కలిగింది. అయినా మీరు అవేవీ లెక్క చేయలేదు. సహనాన్ని కోల్పోలేదు. విడివిడి ఆడుతున్నప్పటి నుంచి మీ వేగం పెరిగింది. మరానీ ఇంటికి వెళ్లిపోయినప్పుడు మీ పడవపై మీరొక్కరే మిగిలారు. కష్టం వచ్చినప్పుడు మీ మౌనాన్నే ఆయుద్ధంగా వాడారు. ఇది అనవసరమైన వాటి నుంచి మిమ్మల్ని దూరం చేసింది. ఆట మీద దృష్టి పెట్టే మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. మీ మంచితాన్ని ఇతరులు అవకాశంగా తీసుకున్నా, మీరు వారికి మంచి చెయ్యడానికే నిర్ణయించుకున్నారు. మీ అమ్మగారు మిమ్మల్ని కెప్టెన్ గా చూడాలనే కోరిక అసంపూర్ణంగా మిగిలిపోయినా, ఈ స్థానంలో మిమ్మల్ని చూసి చాలా గర్వపడతారు’ అంటూ బిగ్ బాస్ రోహిత్ గురించి చాలా అందంగా చెప్పారు. విన్నర్ మెటీరియల్ అంటే ఇలా ఉండాలి అనేట్టుగా ఉంది బిగ్ బాస్ జర్నీని. చొక్కాలు చించుకుని ఆడితేనే విజేత కాదు, ఎలాంటి పరిస్థితులు వచ్చిన తట్టుకుని నిలబడాలి, సహనాన్ని కోల్పోకూడదు, మాటలు విసరకూడదు... ఇవన్నీ రోహిత్ లోనే పుష్కలంగా ఉన్న గుణాలు. రేవంత్ ఆట బాగా ఆడిన అతని ప్రవర్తన చాలా చికాకు కలిగించేలా ఉంటుంది. ప్రతి దానికి వాదన, విపరీతమైన కోపం చూడటానికి అంత ప్రశాంతంగా ఉండవు. 

ఆదిరెడ్డి ప్రసంగం
ఆదరెడ్డి గురించి బిగ్ బాస్ మాట్లాడుతూ ‘ఒక సామాన్యుడిగా ఆసక్తితో బిగ్ బాస్ రివ్యూవర్‌గా మారారు. ఇప్పుడు కంటెస్టెంట్‌గా మీ ప్రయాణం చివరి వారానికి చేరింది. ఇంట్లోకి రాకముందే ఆట గురించి ఎన్నో లెక్కలు వేసి, ఇంట్లోకి అడుగుపెట్టగానే మీలోని స్ట్రాటజీ మాస్టర్ చురుకయ్యారు.కొన్నిసార్లు మీ అంచనా తప్పి మీకే నష్టం జరిగింది. అలాగే మీలోని ఒక సామాన్యుడిని కూడా కొన్నిసార్లు బయటపెట్టారు. మీరు చేసిన డ్యాన్సు కూడా అందులో ఒకటి. మీలో మీకు తెలియని కోణాన్ని ఈ ఇల్లు ప్రేక్షకులకు పరిచయం చేసింది. సామాన్యుడిగా మొదలై విజేతగా నిలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్న మీ ప్రయాణం ఆగకూడదని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు. తరువాత ఆదిరెడ్డి ఎప్పట్లాకే పెద్ద ప్రసంగం మొదలుపెట్టాడు. ‘బిగ్ బాస్ ఇది నా మోస్ట్ ఎమెషనల్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. నేనొక కామన్ మ్యాన్ ఉన్నందుకు గర్వ పడే క్షణం ఇది. బిగ్ బాస్ లేకుంటే నేను లేను. బిగ్ బాస్ నా జీవితాన్ని మార్చింది. ఇప్పుడున్న ఆనందం మరో రెండు మూడేళ్లు మెయింటేన్ చేస్తే నేను వందేళ్లు బతుకుతా....’ అంటూ చాలా సేపు ఏవేవో మాట్లాడాడు ఆదిరెడ్డి. 

Also read: రేవంత్, శ్రీసత్య జర్నీని అందంగా చెప్పిన బిగ్‌బాస్ - కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్లు

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
Kalyan: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Embed widget