అన్వేషించండి

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌజ్ నుండి రతిక ఎలిమినేట్ - అతడి వల్లే అని చెప్తూ ఎమోషనల్

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్‌లో తన సెకండ్ ఛాన్స్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఈవారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో శనివారం ఎపిసోడ్‌లో అశ్విని ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుండి వెళ్లిపోయింది. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో రతిక కూడా బయటికొచ్చేసింది. నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరు సేవ్ అవుతూ ఉండగా.. చివరిగా డేంజర్ జోన్‌లో రతిక, అర్జున్ మిగిలారు. పల్లవి ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరికైనా ఆ పాస్‌ను ఉపయోగించాలని అనుకుంటున్నావా అని నాగార్జున.. తనను అడిగారు. కానీ నిన్న చెప్పిన మాట మీదే ఉన్నాడు ప్రశాంత్. 14వ వారంలో ఎవరికి ఆ పాస్ అవసరమో వారికోసమే ఉపయోగిస్తానని అన్నాడు. ఆ తర్వాత రతిక ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు.

ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇవ్వనందుకు సారీ..
ఒకసారి ఎలిమినేట్ అయిన తర్వాత రతిక.. మరో అవకాశంతో బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. అయితే బయటికి వెళ్లి తను చేసిన తప్పులు చూసి వచ్చింది కాబట్టి మళ్లీ అలాంటి తప్పులు రిపీట్ చేయదేమో అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ మొదట్లో ఉన్న రతికనే బెటర్ అనిపించేలా చేసింది. దీంతో తనకు సెకండ్ ఛాన్స్ వచ్చిన తర్వాత కూడా ఇన్నిరోజులు ఉండడం వేస్ట్ అని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక హౌజ్ నుండి వెళ్లిపోయి స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత రతికకు చివరి కాఫీ ఇద్దామని అనుకున్నాని, ఇంతలోపే బయటికి వెళ్లిపోయిందని అన్నాడు శివాజీ. ఇక శివాజీతో మంచిగా ఉండమని, మనస్ఫర్థలు ఉంటే క్లియర్ చేసుకోమని ప్రియాంకకు సలహా ఇచ్చింది రతిక. ప్రశాంత్‌కు కూడా బాగా ఆడమని చెప్పింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించనందుకు రతికకు సారీ చెప్పాడు ప్రశాంత్. ఈ విషయాన్ని నాగార్జున ఒప్పుకోలేదు. అది తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ అని, తను సంపాదించుకున్నాడు కాబట్టి ఎప్పుడు, ఎవరికి ఇవ్వాలో తనే డిసైడ్ చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. 

రతిక మౌనం..
బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బజ్‌లో పాల్గొంది రతిక. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ‘‘ఇన్నిరోజులు గేమ్ ఆడకుండా ఉండగలిగావు ఎలా అనిపిస్తుంది’’ అన్నదే రతికకు ఎదురయిన మొదటి ప్రశ్న. ‘‘ఆడడానికి ట్రై చేశాను. కానీ ఎఫర్ట్ కూడా పెట్టలేదేమో అనిపిస్తుంది’’ అని తన తప్పును ఒప్పేసుకుంది. మరి ఎందుకు వెళ్లావు హౌజ్‌లోకి, ఒక్క టాస్క్ అయినా సరిగా ఆడావా, ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్‌తో ఉంటూ నామినేషన్స్‌లోకి రాకుండా మ్యానేజ్ చేశావా అనే ప్రశ్నలకు రతిక ఏమీ సమాధానం చెప్పలేకపోయింది. 

అందుకే డిస్టర్బ్ అయ్యాను..
ఆ తర్వాత ఒక్కొక్క హౌజ్‌మేట్ గురించి ప్రత్యేకంగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ముందుగా యావర్ ఫోటోను చించి చెత్త కుండిలో పడేసింది. ఆ తర్వాత గౌతమ్ ఫోటోను పట్టుకొని ఒక మనిషిని అనవసరంగా ఎక్కువ ట్రిగర్ చేశాడని చెప్తూ.. తన ఫోటోను కూడా చించి చెత్త కుండిలో పడేసింది. అమర్ ఫోటోను పట్టుకొని ‘‘బయటికి వెళ్లడానికి ఒకరకంగా ఈయననే రీజన్’’ అని కారణం చెప్పి చించేసింది. ఆ తర్వాత తను గేమ్ సరిగా ఆడలేకపోవడానికి కారణం చెప్తూ ఎమోషనల్ అయ్యింది రతిక. తనను అక్క అని గుచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు బయటికి నవ్వుతున్నా కూడా పాత విషయాలు గుర్తొచ్చేవి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘‘వెళ్లగానే డిస్టర్బ్ అయ్యాను. భోలే పాటలు పాడి, నేను ఎమోషనల్ అయ్యి కనెక్ట్ అయ్యి అక్కడే కూర్చొని ఉండేదాన్ని. ఇవే డిస్టర్బెన్స్‌లు జరిగాయి’’ అంటూ రతిక ఫీల్ అయ్యింది.

Also Read: మన్సూర్ అలీ ఖాన్, త్రిష కేసులో కొత్త ట్విస్ట్ - చిరంజీవిపై పరువు నష్టం దావా

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Physical Intimacy Health : లైంగిక ఆరోగ్యంపై చలికాలం ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
లైంగిక ఆరోగ్యంపై చలికాలం ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Jio Best Prepaid Plan: జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
Embed widget