Mansoor Ali khan Trisha: మన్సూర్ అలీ ఖాన్, త్రిష కేసులో కొత్త ట్విస్ట్ - చిరంజీవిపై పరువు నష్టం దావా
Mansoor Ali khan to file case on Chiranjeevi: మన్సూర్ అలీ ఖాన్, త్రిష కేసు కొత్త మలుపు తిరిగింది. ఇందులో చిరు మీద పరువు నష్టం దావా కేసు వేయనున్నట్లు మన్సూర్ అలీ ఖాన్ ప్రకటించారు.
Mansoor Ali Khan latest comments on Trisha issue: తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ యూ టర్న్ తీసుకున్నారు. కథానాయిక త్రిషకు క్షమాపణ చెప్పి కనీసం వారం కూడా గడవక ముందు కొత్త వివాదానికి తెర తీశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
చిరంజీవి, ఖుష్బూ మీద పరువు నష్టం దావా!
Mansoor Ali Khan comments on Trisha: 'లియో'లో మన్సూర్ అలీ ఖాన్ ఓ కీలక పాత్రలో నటించారు. అందులో కథానాయిక త్రిషతో తనకు రేప్ సీన్ లేదని ఒక విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయ్యింది. ఈ నెల (నవంబర్) 11న ఆయన కామెంట్స్ చేస్తే... కొంత ఆలస్యంగా అది వెలుగులోకి వచ్చింది. ఆయన వ్యాఖ్యలను పలువురు ప్రముఖులు ఖండించారు. జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది.
What is the issue between Trisha and Mansoor: త్రిషకు మద్దతుగా 'లియో' దర్శకుడు లోకేష్ కనగరాజ్, మెగాస్టార్ చిరంజీవి, యువ హీరో నితిన్, నటి ఖుష్బూ, హీరోయిన్లు మాళవికా మోహనన్ తదితరులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వివాదం పెద్దది కావడంతో మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత 'తప్పు చేయడం మానవత్వం.... క్షమించడం దైవత్వం' అని త్రిష పేర్కొన్నారు. దాంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అందరూ భావించారు. ఈ సమయంలో మన్సూర్ అలీ ఖాన్ మరో కొత్త వివాదానికి తెర తీశారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
త్రిషతో పాటు చిరంజీవి, ఖుష్బూ మీద కేసు నమోదు చేయనున్నట్లు మన్సూర్ అలీ ఖాన్ తాజాగా వెల్లడించారు. తన లాయర్ గురు ధనుంజయ్ ద్వారా చెన్నై కోర్టులో సోమవారం కేసు వేయనున్నట్లు ఓ లేఖ విడుదల చేశారు. పది రోజుల పాటు ప్రజాశాంతికి విఘాతం కలిగించారని, వ్యభిచారానికి ప్రేరేపిస్తూ అల్లర్లు సృష్టించాలని ప్లాన్ చేశారని ఆయన కొత్త పలుకులు చెప్పారు. క్రిమినల్, సివిల్ దావా వేస్తామన్నారు.
Also Read: ది విలేజ్ వెబ్ సిరీస్ రివ్యూ: ఆర్య & మిళింద్ రావు థ్రిల్ ఇచ్చారా? భయపెట్టారా?
తాను విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలను వారం తర్వాత ఎడిట్ చేశారని, త్రిష గురించి తాను తప్పుగా మాట్లాడినట్లు అసభ్యంగా చిత్రీకరించారని, తాను పూర్తి ఆధారాలతో కేసు వేయనున్నట్లు మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. ఆయన నిర్ణయం పట్ల భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముగిసిన గాయాన్ని మళ్ళీ ఆయన గుర్తు చేస్తున్నారని, వివాదాన్ని మరింత పెద్దది చేయాలని ఆయన చూస్తున్నారని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఆయన వేయబోయే పరువు నష్టం దావా గురించి చిరు, త్రిష, ఖుష్బూ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: సుకుమార్ రేర్ రికార్డ్ - తెలుగులో రాజమౌళి తర్వాత లెక్కల మాస్టారే!