అన్వేషించండి

Priyanka Jain: ముంబాయ్‌లో ప్రియాంక ఇల్లు చూశారా? ఒక స్లమ్‌లో చిన్న రూమ్‌లో అంతమంది ఉండేవారా?

Priyanka Jain: సీరియల్ నటిగా తెలుగు బుల్లితెరపై ఎంతో ఆదరణ సంపాదించుకుంది ప్రియాంక జైన్. కానీ దానికంటే ముందు తను ఒక స్లమ్ జీవితాన్ని అనుభవించింది.

Priyanka Jain: సీరియల్‌లో నటించేవారు చాలా సౌకర్యవంతంగా జీవిస్తారని, వారికి ఏ లోటు ఉండదని చాలామంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతీ ఒక్కరికి వారి కష్టాలు ఉంటాయని తెలియడానికి ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తున్న చాలామంది నటీనటుల జీవితాలే ఉదాహరణ. అందులో ప్రియాంక జైన్ కూడా ఒకరు. ముంబాయ్‌లో పుట్టి పెరిగిన ప్రియాంక.. ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌లో పాపులర్ నటిగా మారింది. ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అడుగుపెట్టిన బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. కానీ సీరియల్స్‌లోకి ఎంటర్ అవ్వకముందు ముంబాయ్‌లో తన ఇల్లు, తన జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని తన బాయ్‌ఫ్రెండ్ శివ్.. ఒక హోమ్ టూర్ వీడియోలో బయటపెట్టాడు. 

ముంబాయ్ స్లమ్‌లో ప్రియాంక ఇల్లు..
ముంబాయ్‌లోని ఒక చిన్న ఇంట్లో ప్రియాంక.. తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉండేది. ఒక చిన్న రూమ్‌లో దాదాపు తొమ్మిదిమంది కలిసి ఉండేవారట. వాళ్ల తాతయ్య, నాన్నమ్మ సంపాదించుకున్న ఆ ఇంట్లోనే వారి వారసులంతా ఉండేవారని ప్రియాంక.. తన హోమ్ టూర్ వీడియోలో చెప్పింది. ముంబాయ్‌లో తన ఇల్లు ఉన్న ప్రాంతాన్ని చౌల్ అంటారని ప్రియాంక చెప్పుకొచ్చింది. అంటే ఒక స్లమ్ అని అర్థం. ముందుగా ఈ వీడియోలో తన ఇల్లును చూపిస్తూ.. ‘‘నాన్నమ్మ, తాతయ్య నాకు వదిలేసి వెళ్లిన ఇల్లు ఇది. ఇక్కడ నుంచే మా అమ్మ, నాన్న కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వాళ్లు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. అమ్మ గుజరాతీ, నాన్న మార్వాడీ. క్యూట్ కపుల్’’ అని చెప్పింది ప్రియాంక. ఈ హోమ్ టూర్ వీడియోలో తన ఇల్లు చూపిస్తూ చాలాసార్లు ఎమోషనల్ అయ్యింది ప్రియాంక. అప్పట్లో ఆ చిన్న ఇంట్లో ఎలా అడ్జస్ట్ అయ్యేవారో చెప్తూ ఫీల్ అయ్యింది. ఇప్పటికీ ఆ చిన్న రూమ్‌లో తన బాబాయ్ వాళ్లు ఉంటున్నారని బయటపెట్టింది.

అన్ని కుటుంబాలకు రెండే బాత్రూమ్స్..
వాళ్లకు ఉన్న ఆ చిన్న రూమ్‌లోనే తొమ్మిది మంది ఉండేవారని చెప్పుకొచ్చింది ప్రియాంక. తన అమ్మ, నాన్న మాత్రం అటకపైకి ఎక్కి పడుకునేవారని, అదే వారి బెడ్‌రూమ్‌లాగా భావించేవారని చెప్పింది. ఆ రూమ్‌లో ప్రత్యేకంగా కిచెన్ కూడా లేదు. స్నానం చేయడానికి చిన్న వాష్‌రూమ్‌లాగా ఉన్నా.. అందులో స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఆడవాళ్లంతా పక్కింట్లోకి వెళ్లాల్సి వచ్చేది అని తెలిపింది ప్రియాంక. ఆ వాష్‌రేమ్ కేవలం టాయిలెట్ వరకే ఉపయోగించే వీలు ఉండేదని, బాత్రూమ్‌కు వెళ్లాలంటే 60 నుంచి 80 కుటుంబాలకు కలిపి కేవలం రెండు బాత్రూమ్స్ ఉండేవని చెప్పుకొచ్చింది. ఇక తను సీరియల్స్‌లో నటించడం ప్రారంభించిన తర్వాత తనతో పాటు తన కుటుంబానికి కూడా సౌకర్యవంతమైన జీవితాన్ని అందించగలిగానని సంతోషపడింది ప్రియాంక.

ఇప్పటికీ అద్దె ఇంట్లోనే..
ఇక తాజాగా ఒక ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ శివ్.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రియాంక ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే విషయం బయటపెట్టాడు. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు వారి కుటుంబం ఆర్థికంగా బాగుంది. కానీ ఇప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఒక అద్దె ఇంట్లోనే ఉంటున్నారని, ప్రియాంక సీరియల్స్‌లో యాక్ట్ చేస్తూ వచ్చిన డబ్బులతోనే ఆ అద్దె కడుతుందని శివ్ తెలిపాడు. ఇప్పటికీ ప్రియాంక వాళ్ల అమ్మ.. బ్యూటీషియన్‌గా పనిచేస్తూ సంపాదిస్తుందని చెప్పాడు. ప్రియాంక తండ్రి మాత్రం పలు బిజినెస్‌లు చేసి లాస్ అయిపోయారని, ఇంక ఇప్పుడు ఆయనకు వయసు పెరగడంతో ఏ పని చేయడానికి అయినా కష్టంగా మారిందని తెలిపాడు. ప్రియాంక కష్టాలు తెలుసుకున్న తర్వాత బిగ్ బాస్ సీజన్ 7కు తను ఎన్ని కష్టాలు పడి వచ్చిందో అని ఫ్యాన్స్ జాలిపడుతున్నారు. మరి, ఆమెకు ట్రోఫీ గెలుచుకునే లక్ ఉందో లేదో.

Also Read: శివాజీకి ఓట్లు వేయాలంటూ అన్నదానం - ‘బిగ్ బాస్’ ట్రోఫీ కోసం అభిమానుల వినూత్న ప్రయత్నం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget