Bigg Boss 7 Telugu: శివాజీకి ఓట్లు వేయాలంటూ అన్నదానం - ‘బిగ్ బాస్’ ట్రోఫీ కోసం అభిమానుల వినూత్న ప్రయత్నం
Bigg Boss Telugu 7: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 6లో ఉన్న కంటెస్టెంట్స్ అభిమానులంతా తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను విన్నర్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
![Bigg Boss 7 Telugu: శివాజీకి ఓట్లు వేయాలంటూ అన్నదానం - ‘బిగ్ బాస్’ ట్రోఫీ కోసం అభిమానుల వినూత్న ప్రయత్నం sivaji fans distributes food to people to make him winner of Bigg Boss 7 Telugu Bigg Boss 7 Telugu: శివాజీకి ఓట్లు వేయాలంటూ అన్నదానం - ‘బిగ్ బాస్’ ట్రోఫీ కోసం అభిమానుల వినూత్న ప్రయత్నం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/12/85e68ed128f8dbf18b637fdce70ee6e41702357024145802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ దగ్గరకు వచ్చేశాయి. మొదటి రోజు నుండి 14 వారాల వరకు హౌజ్‌లో ఉన్న టాప్ ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఫినాలే అస్త్రా సాధించి ముందుగానే ఫైనల్స్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు అర్జున్. ఆ తర్వాత ప్రియాంక.. రెండో ఫైనలిస్ట్‌గా కన్ఫర్మ్ అయ్యింది. యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్ కూడా ఫైనలిస్ట్స్‌గా నిలిచారు. అయితే ఈ ఆరుగురి మధ్య ఓటింగ్ విషయంలో పోటీ మొదలయ్యింది. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి, ఎవరు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అవుతారు అని అందరిలో ఆసక్తి మొదలవ్వగా.. ఈ ఆరుగురు కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ మాత్రం ఓట్ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా శివాజీ ఫ్యాన్స్ చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది.
అన్నదానం చేస్తున్న ఫ్యాన్స్..
శివాజీ ఎలాగైనా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అవ్వాలని తన ఫ్యాన్స్, టీమ్.. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్ చూసినా చూడకపోయినా.. శివాజీకి ఓటు వేయమని తన టీమ్.. అందరికీ మెసేజ్‌లు పంపించింది. అమరావతి రైతుల కోసం, ఆంధ్ర రైతుల కోసం శివాజీ కష్టపడ్డాడని, అలాంటి వ్యక్తికి ఓట్లు వేసి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ చేయమని ఆ మెసేజ్‌ల ద్వారా కోరారు. ఇప్పుడు ఏకంగా తన పేరు మీద పేదవారికి అన్నదానం చేస్తున్నారు ఫ్యాన్స్. శివాజీ ఫ్యాన్స్, టీమ్.. ఓట్ల కోసం కష్టపడుతున్నంత.. ఇంకెవరి ఫ్యాన్స్ కష్టపడడం లేదని చూస్తున్న ప్రేక్షకులు అనుకుంటున్నారు. శివాజీ ఫ్యాన్స్ చేస్తున్న ఈ పని తనకు ఓట్లు తెచ్చిపెడతాయేమో అని కూడా కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
లీడ్‌లో పల్లవి ప్రశాంత్..
మొదటివారం నుండి ఓటింగ్ విషయంలో శివాజీ టాప్ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత నామినేషన్స్‌లో జరిగిన గొడవ వల్ల పల్లవి ప్రశాంత్ కూడా హైలెట్ అవ్వడంతో ఓటింగ్ విషయంలో శివాజీతో తను కూడా పోటపడ్డాడు. వారాలు గడుస్తున్నకొద్దీ.. శివాజీ ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. కేవలం పల్లవి ప్రశాంత్, యావర్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తూ, వారిని మాత్రమే గెలిపించాలి అనుకోవడం.. తోటి కంటెస్టెంట్స్‌కు మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా నచ్చలేదు. దాంతో పాటు కొంతమంది కంటెస్టెంట్స్‌ను మాత్రమే టార్గెట్ చేసినట్టు మాట్లాడడం కూడా చాలామందిలో తనపై నెగిటివ్ అభిప్రాయం కలిగేలా చేసింది. ఇది తన ఓటింగ్‌పై ఎఫెక్ట్ చూపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న పోలింగ్ ప్రకారం పల్లవి ప్రశాంతే ఓటింగ్ విషయంలో టాప్ స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఆడపిల్లలపై కామెంట్..
గతవారం శోభా, ప్రియాంకలను ఉద్దేశించి శివాజీ చేసిన కామెంట్స్.. తనపట్ల ప్రేక్షకుల్లో చాలా నెగిటివ్ అభిప్రాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇదే విషయంపై ఆడియన్స్‌తో మాట్లాడే అవకాశం తనకు దొరికినా.. అప్పుడు కూడా శివాజీ తానే కరెక్ట్ అన్నట్టు మాట్లాడడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఆడపిల్లల గురించి కామెంట్ చేయడం వల్ల ఆడపిల్లలందరికీ అది వర్తిస్తుందని, షో చూస్తున్న ఆడపిల్లలకు సారీ చెప్పమని నాగార్జున చెప్పగా.. తాను చెప్పను అని మొండి పట్టుదలతో ఉన్నాడు శివాజీ. ఆరోజు శివాజీ ప్రవర్తన తన ఫ్యాన్స్‌కు తప్పా మరెవరికీ నచ్చలేదు. నాగార్జునను ఎదిరించి నిలబడ్డాడు అంటూ, శివాజీ గ్రేట్ అంటూ తన ఫ్యాన్స్.. పోస్టులు షేర్ చేసినా కూడా తప్పు తనదే అని చాలామంది ప్రేక్షకులు అప్పటికే ఫిక్స్ అయిపోయారు. దీని వల్ల తన ఓటింగ్ మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: 14 వారాలకు శోభా శెట్టి అందుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)