Pallavi Prashanth: రైతుబిడ్డకు ఇచ్చే విలువ ఇంతేనా? పోలీసులపై బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ సీరియస్
Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్‌గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. ట్రోఫీ తీసుకొని బయటికి వచ్చే సమయానికి తన ఫ్యాన్స్ రచ్చ మొదలుపెట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ చాలా గ్రాండ్‌గా జరిగాయి. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వగా.. అమర్‌దీప్ రన్నర్‌గా నిలిచాడు. ఫైనల్స్‌ను చూడడం కోసం మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తున్న అమర్ దీప్, అశ్వినీ, గీతూ రాయల్ కార్లపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ కొందరు దాడికి దిగారు. కార్లపై మాత్రమే కాకుండా అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. దీంతో పోలీసులు.. వారిని కంట్రోల్ చేయడం కోసం చాలా కష్టపడ్డారు. అదే క్రమంలో పల్లవి ప్రశాంత్ ఉన్న కారును అక్కడ ఆపకుండా పంపించేశారు. అయితే, బయట ఏం జరిగిందో తెలియని పల్లవి ప్రశాంత్ పోలీసులపై సీరియస్ అయ్యాడు.
బండి ఆగొద్దు..
పల్లవి ప్రశాంత్ గెలుపును చూడడానికి చాలామంది అభిమానులు చాలా దూరం నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్నారు. కానీ అప్పటికే కొందరు ఆకతాయిలు.. అక్కడ రాళ్ల దాడి చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అందుకే పల్లవి ప్రశాంత్ ఉన్న కారును ఆగనివ్వకుండా తనను సేఫ్‌గా ఇంటికి పంపే ప్రయత్నం చేశారు. అది అర్థం చేసుకోని ప్రశాంత్.. వారి మీద రివర్స్ అయ్యాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘శాంతిభద్రతలకు భంగం కలుగుతోంది. నడవండి. బండి కదులుతూనే ఉండాలి. ఆగొద్దు’’ అని పోలీసులు చెప్పడం ఈ వీడియోలో రికార్డ్ అయ్యింది.
పోలీసులే వద్దంటున్నారు..
‘‘ఏంటన్నా ఇది. ఒక రైతుబిడ్డకు ఇంత కూడా విలువ ఇవ్వట్లేదు’’ అని వారిని ప్రశ్నించాడు పల్లవి ప్రశాంత్. అయితే తనను కలవడానికి వచ్చిన ఒక అభిమాని కారు వెంటే పరిగెడుతూ ఏడుస్తుందని కారులో ఉన్న వ్యక్తి ప్రశాంత్‌తో చెప్పాడు. ‘‘ఏం చేయాలిరా. పోలీసులే వద్దంటున్నారు’’ అని ఆ వ్యక్తిపై సీరియస్ అయ్యాడు ప్రశాంత్. ఒక అమ్మాయి కూడా.. ‘‘ప్రశాంత్ నీకోసం ఇంతమంది వస్తుంటే నువ్వు ఎందుకు ఆగట్లేదు. ఒక కామన్ మ్యాన్‌గా నిన్ను సపోర్ట్ చేయట్లేదా’’ అని తనను ప్రశ్నించింది. అది పట్టించుకోకుండా జనాలను, పోలీసులను మొత్తం వీడియోలు తీయమని కారులో ఉన్న తన ఫ్రెండ్స్‌కు ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.
సారీ.. ఏమనుకోకండి..
కొందరు పోలీసులు.. ప్రశాంత్‌ను వెళ్లిపోమని చెప్తుంటే.. ఒక పోలీస్ మాత్రం కారు పక్కన పరిగెడుతూ వచ్చి.. తనను పలకరించాడు. ‘‘ఎలా ఉన్నావు, ఇంటికి వచ్చి కలుస్తా’’ అని చెప్పాడు. అది చూసిన ప్రశాంత్.. తనకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ‘‘పోలీసులే ఇలా చేస్తున్నారు ఏంటన్నా? మీ పోలీసులే ఇలా చేస్తే ఎలా? ఒక రైతుబిడ్డ అన్నా’’ అని అంటూ పోలీసుకు చెప్తూ వాపోయాడు. కానీ ఆ పోలీస్ మాత్రం ప్రశాంత్ చెప్పేది పట్టించుకోకుండా వెళ్లిపోమన్నాడు. దీంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయిన ప్రశాంత్.. తనకోసం వచ్చిన అభిమానులకు సారీ చెప్పాడు. ఏం అనుకోకండి అంటూ దండం పెట్టాడు. పోలీసులు జోక్యం చేసుకొని పంపించడం వల్ల పల్లవి ప్రశాంత్ సేఫ్‌గా వెళ్లగలిగాడు. కానీ అమర్‌దీప్‌పై దాడిని వారు కంట్రోల్ చేయలేకపోయారు. అందుకే అమర్ కారు అద్దాలు కూడా పగిలాయి. కారులో ఉన్న అమర్ ఫ్యామిలీ హడలిపోయారు.
Veedu winner entra karma kakapothe🥴🤦🏻♂️
— ✯ (@sagatuXuser) December 17, 2023
Law n order issue ani cheptunte, oka raithu bidda ki viluva isthaleru antunadu💀🤧#BiggBossTelugu7pic.twitter.com/ooDetkYlK6
గమనిక: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న వీడియోను ఇక్కడ యథావిధిగా షేర్ చేశాం. వాటిలో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’కు ఎటువంటి సంబంధం లేదని గమనించగలరు.
Also Read: తిండి కూడా తినకుండా ఇక్కడే తిరిగా, ప్రైజ్ మనీ మొత్తం రైతులకే: పల్లవి ప్రశాంత్