(Source: ECI/ABP News/ABP Majha)
Bigg Boss Telugu 7: నమ్మినందుకు బాధపడుతున్నా, నా కళ్లు ఇప్పుడు తెరుచుకున్నాయి - నామినేషన్స్‌లో ప్రశాంత్ ఎమోషనల్
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి. ఈ సమయంలో అందరికీ నామినేషన్స్ అనేవి కీలకంగా ఉంటాయి. తాజాగా జరిగిన నామినేషన్స్‌లో ప్రశాంత్ తనను నామినేట్ చేసినందుకు ఎమోషనల్ అయ్యాడు.
Bigg Boss Telugu 7: తాజాగా డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరు కంటెస్టెంట్స్.. హౌజ్‌ను వదిలి వెళ్లిపోయిన తర్వాత ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో 8 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఇక వీరందరి మధ్య పోటీ మరింత పెరగనుంది. ఇకపై జరిగే నామినేషన్స్, ఎలిమినేషన్స్ అనేవి మరింత కీలకంగా మారనున్నాయి. అందుకే నామినేషన్స్‌లో వాగ్వాదాలు మరింత పెరిగినట్టు తాజాగా విడులదయిన ప్రోమోలు చూస్తే తెలుస్తోంది. పైగా గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో చాలామంది కంటెస్టెంట్స్‌కు మనస్పర్థలు వచ్చాయి. అవే కారణాలపై ఈవారం నామినేషన్స్ ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు అర్థమవుతోంది.
నాకు కళ్లు తెరుచుకున్నాయి..
ముందుగా శోభా శెట్టి వచ్చి తన నామినేషన్.. యావర్, పల్లవి ప్రశాంత్ అని ప్రకటించింది. యావర్‌ను నామినేట్ చేసినందుకు తనతో గొడవ మొదలయ్యింది. ‘‘గేమ్ ఓవర్ శెట్టి’’ అని మర్డర్ టాస్క్‌లో పోలీసులను డైవర్ట్ చేయడానికి యావర్ లెటర్ రాయడం గురించి గుర్తుచేసింది శోభా. ‘‘నేనే రాశాను అని నువ్వు చూశావా?’’ అని ప్రశ్నించాడు యావర్. లేదు అని సమాధానమిచ్చింది శోభా. ఇంకెందుకు నామినేట్ అని కామెడీగా తీసుకున్నాడు యావర్. ‘‘ఎవరో ఒకరిని చేయాలి కాబట్టి చేస్తుంది’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రశాంత్‌ను నామినేట్ చేస్తూ తనది సేఫ్ గేమ్ అని చెప్పింది శోభా. మధ్యలో ప్రశాంత్ మాట్లాడడానికి ప్రయత్నించగా.. ‘‘మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తాను నా పాయింట్ పూర్తి అవ్వనివ్వు’’ అని సీరియస్ అయ్యింది. ‘‘సేఫ్ ప్లే ఆడావు. నీ వల్లే అమర్ కెప్టెన్సీ పోయింది అది నాకు నచ్చలేదు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని క్లియర్‌గా చెప్పింది. ఇదే మాట అమర్‌ను అడిగాడు ప్రశాంత్. దీనికి అమర్ కూడా షాక్ అయ్యాడు. ‘‘నా కళ్లు ఇప్పుడు తెరుచుకున్నాయి’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు ప్రశాంత్. తను మాట్లాడుతుండగానే శోభా వచ్చి పెయింట్ పూసే ప్రయత్నం చేసింది. డిఫెండ్ చేసుకుంటా అని ప్రశాంత్ చెప్తున్నా వినకుండా.. ‘‘నాకు ఒంట్లో బాలేదు నేను వెళ్లి కూర్చుంటా’’ అంటూ ముందుకొచ్చింది.
ఎమోషనల్ అయిన ప్రశాంత్..
ఆ తర్వాత వచ్చిన అమర్‌దీప్.. పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. కానీ ప్రశాంత్ మాత్రం ఈ నామినేషన్‌కు ఒప్పుకోలేదు. దీంతో ‘‘నామినేట్ చేయొద్దు కదా చేయను పో. కూర్చో పో. చేయనులే పో ఏడవద్దు ఇంకెందుకు చెప్పు’’ అని అమర్ అన్నాడు. ‘‘నువ్వు నామినేట్ చేస్తున్నందుకు కాదు. నిన్ను నమ్మినందుకు నేను బాధపడుతున్నాను ఇప్పుడు’’ అని ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. ‘‘నమ్మకద్రోహం అనే మాట మాట్లాడితే నాకంటే మూర్ఖుడు ఉండడు. పోయి కూర్చో. నేనే సెల్ఫ్ నామినేషన్ వేసుకుంటా’’ అని అమర్ అరవడం మొదలుపెట్టాడు. ‘‘నేను కూర్చోను బరాబర్ ఇక్కడే ఉంటా’’ అని సీరియస్ అయ్యాడు ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ తర్వాత గౌతమ్‌ను నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు అమర్. ‘‘తరువాత నేను నీకే సపోర్ట్ చేస్తాలే అన్నావా లేదా. మరి స్టాండ్ తీసుకుంటే ఒకరికే తీసుకోవాలి కదా’’ అని కారణం చెప్తూ బాధపడ్డాడు. ‘‘అయితే నామినేషన్ వేస్తావా’’ అని అడుగుతూ గౌతమ్ సీరియస్ అయ్యాడు.
జనాలు పిచ్చోళ్లు కాదు..
గౌతమ్ వచ్చి శివాజీని నామినేట్ చేస్తున్నటు చెప్పాడు. ‘‘ప్రశాంత్ రైతుబిడ్డ అని చెప్పి తనకు సపోర్ట్ చేయడం’’ అని గౌతమ్ కారణం చెప్తుండగానే.. ప్రశాంత్ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. ప్రశాంత్‌ను ఆగమని చెప్పి శివాజీ మాట్లాడడం మొదలుపెట్టాడు. ‘‘వాడిని ఎప్పుడైనా రైతుబిడ్డ అని సపోర్ట్ చేశానా? లేదంటే యావర్ ఫలానా అని సపోర్ట్ చేశానా?’’ అని అడిగాడు. మరి స్పై ఏంటి అని గౌతమ్ ప్రశ్నించగా.. ‘‘నేనేమైనా పెట్టానా ఏంటి అది?’’ అని రివర్స్ ప్రశ్న వేశాడు. మరి ఎందుకొచ్చింది అని గౌతమ్ అన్నాడు. శివాజీ ఇదంతా పట్టించుకోకుండా వెళ్లి కూర్చొని.. ‘‘నువ్వు ఇదంతా క్రియేషనే. అరవడం, క్రియేట్ చేయడం’’ అని గౌతమ్‌పై ఆరోపించాడు. ‘‘మీరే క్రియేట్ చేస్తున్నది. కావాలని చేస్తున్నాడు అని అంటున్నారు. కావాలని చేస్తే జనాలు ఏమైనా పిచ్చివాళ్లా ఇక్కడ ఉంచడానికి’’ అని సీరియస్ అయ్యాడు గౌతమ్. ‘‘మేం తప్పులు చేస్తే మమ్మల్ని ఎందుకు ఉంచారు’’ అని కౌంటర్ ఇచ్చాడు శివాజీ.
Also Read: ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ తీసి పడేసిన శివాజీ.. అదరగొడుతున్న ప్రోమో!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply