Bigg Boss 6 Telugu: ఆటలో సరే, ఆట ఆగిపోయాక కూడా వీక్‌నెస్‌తో ఎందుకు ఆడుకున్నారు?
Bigg Boss 6 Telugu: ఈ రోజు ప్రోమో కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూశారు.
Bigg Boss 6 Telugu: ఈవారం ఆట మామూలుగా లేదు. రెడ్ టీమ్ సభ్యులు కన్నింగ్ కింగ్‌ల్లా ఆడారు. గీతూ లీడర్‌షిప్‌లో రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా కూడా రెచ్చిపోయి ఆడారు. బ్లూటీమ్‌తో నచ్చినట్టు ఆడారు. నోరుపారేసుకున్నారు. చివరికి తమ టీమ్ సభ్యులకే కెప్టెన్ అయ్యేలా చేశారు. అయితే ఈ గేమ్‌లో భాగంగా గీతూ బాలాదిత్యతో ఆడిన ఆటే వివాదాస్పదం అయింది. ఆయన సిగరెట్లు దాచేసి వీక్ నెస్ మీద కొట్టాలని చూశారు. ఆట ఆగిపోయాక కూడా గీతూ వాళ్ల టీమ్ ఆడతూనే ఉన్నారు. అప్పుడు కూడా కనీసం దాచేసిన సిగరెట్లు తీసి బాలాదిత్యకు ఇవ్వలేదు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయింది. ఇక బాలాదిత్య అయితే కోపంతో ఊగిపోయాడు.
ఈ రోజు ప్రోమోలో ఆ విషయాన్ని లేవనెత్తారు నాగార్జున. ఆదిరెడ్డిని తమ టీమ్ సభ్యులకు మార్కులు ఇవ్వమని చెప్పారు నాగార్జున. ఆదిరెడ్డి అయిదు మార్కుల ట్యాగును తెచ్చి బాలాదిత్య మెడలో వేశారు. వెంటనే నాగార్జున ‘నీకు వేసిన నెంబర్ కూడా చూడు సిగ్గుపడి వెనక్కి తిరిగింది’ అన్నారు. ఎందుకంత డెస్పెరేషన్ అని అడిగారు. దానికి బాలాదిత్య ‘అది కోపం కాదు సర్ బాధ’ అని చెప్పాడు. ‘ఒక మనిషి బాగా క్లోజ్ అని చెప్పినప్పుడు ఆ మనిషి వీక్‌నెస్ మీద కొట్టను కదా సర్’ అన్నాడు. దానికి నాగార్జున గేమ్ విషయానికి వస్తే తన తల్లిదండ్రులు కూడా తరువాతే అని, తానొక వెధవనని గీతూ చెప్పింది కదా అన్నారు నాగార్జున. దానికి బాలాదిత్య తాను కూడా గెలవాలనుకుంటానని కానీ గెలిచే పద్దతి కూడా ముఖ్యమని అన్నారు.
‘సిగ్గుందా, ప్రేమతో ఆడుకుంటావా? అసలు మనిషివేనా? ఆఫ్టర్ ఆల్ సిగరెట్ల కోసం ఇన్ని మాటలు అవసరమా’ అని అడిగారు నాగార్జున. దానికి మధ్యలో గీతూ వచ్చి ‘నేను ఆ మాటలకు కూడా బాధపడలేదు సర్, ఇన్నాళ్లు నువ్వు నటిస్తున్నావని చెప్పినా నమ్మలేదు, ఇప్పుడు నమ్మాలనిపిస్తోంది అన్నాడు, దానికి హార్ట్ బ్రేక్ అయిపోయింది సర్’ అని చెప్పుకొచ్చింది గీతూ.
నాగార్జున ‘ఆట సమయంలో మీరు సిగరెట్లు దాచినది ఓకే, కానీ ఆట ఆగాక కూడా బాలాదిత్య బలహీనతతో ఆడుకోవాల్సింది కాదు’ అన్నారు. దానికి బాలాదిత్య ‘నేనిక్కడ్నించి వెళ్లిపోతే సర్... బాలాదిత్య ఒక స్మోకర్, వాడికదొక వీక్‌నెస్ అన్న ట్యాగ్ నాకు వద్దు సర్’ అన్నాడు. వెంటనే నాగార్జున ఈ విషయంలో తప్పు గీతూదా లేక బాలాదిత్యదా మీరే చెప్పాలి అని ఆడియెన్సును అడిగారు.
King @iamnagarjuna kicks off this weekend episode by addressing the major issues in the house!
— starmaa (@StarMaa) November 5, 2022
Catch all the action on @StarMaa & @DisneyPlusHSTel tonight at 9 PM.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/ua4nZF3CZO
Also read: ఈ సీజన్ మొత్తానికి షాకిచ్చే ఎలిమినేషన్, ఈ వారం గీతూ అవుట్? ఓవరాక్షనే కొంపముంచిందా?