News
News
X

Bigg Boss Telugu 6: ఈ సీజన్ మొత్తానికి షాకిచ్చే ఎలిమినేషన్, ఈ వారం గీతూ అవుట్? ఓవరాక్షనే కొంపముంచిందా?

Bigg Boss Telugu 6: ఏ ఆట ఆడుతున్నా ప్రవర్తనా చాలా ముఖ్యం. అది సరిగా లేనప్పుడు ఎంత గొప్పగా ఆడినా ప్రేక్షకులు ఇంటికే పంపిస్తారు.

FOLLOW US: 

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్  6లో షాకిచ్చే ఎలిమినేషన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రేక్షకులకే ఈ ఎలిమినేషన్ ఇంత షాకిస్తే ఇక లోపలి ఇంటి సభ్యులకు ఆ షాక్ మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరు టాప్ 5లో ఉండే ప్లేయర్‌గా గీతూని చెప్పారు. ఆమె మైండ్‌తో ఆడుతుందని అన్నారు. కానీ ఆమె మైండ్‌తో ఆడేది తెలివైన గేమ్ కాదు, కన్నింగ్ గేమ్‌. అందుకే ప్రేక్షకులకు ఆమె ఆట కొంచెం కూడా నచ్చలేదు. పైగా ఆమె మాట్లాడేతీరు, పక్కవారికి గౌరవం ఇవ్వకపోవడం వంటివి కూడా బాగా ప్రభావం చూపాయి. నా భాష ఇంతే, నా యాస ఇంతే అంటుంది గీతూ కానీ ఆమె పెరిగిన ప్రాంతంలో అందరూ ఇలా ఇతరులతో అమర్యాదగా మాట్లాడడం, నడచుకోవడం చేయరు కదా. గీతూ మంచి గేమర్ అని నిరూపించుకుని బయటికి వెళ్లాలనుకుంది, కానీ విన్నర్ అయ్యేది మంచి గేమర్ మాత్రమే కాదు, మంచి లక్షణాలున్న వ్యక్తి కూడా అయి ఉండాలి. ఏ కోశాన చూసినా గీతూలో తక్కువనే చెప్పాలి. 

ఆదిరెడ్డితో తప్పా మిగతావాళ్లలో ఒక్కరితో ఆమె పద్ధతిగా నడచుకున్నట్టు కనిపించలేదు. ఇక ఇనయాతో అయితే చాలా శత్రుత్వం పెంచుకుంది మొదట్నించి. ఇక చంటితో అయితే చెప్పక్కర్లేదు, ఈమె బాధ పడలేకే చంటి బయటికి వెళ్లిపోవాలని అనుకున్నాడు. ఎలిమినేట్ అయి బయటికి వచ్చాడు. బయటికి వచ్చాక గీతూ గురించి మాట్లాడ్డానికి కూడా ఇష్టపడలేదు. ఈ వారం గీతూ ఎలిమినేట్ అయిన వార్త నిజమైతే... మాటలపై అదుపు లేకపోవడం, ప్రవర్తనలో అణకువ లేకపోవడం వల్లే గీతూ బయటికి వచ్చిందని చెప్పచ్చు. 

విన్నర్ అవ్వాల్సిన ప్లేయర్...
నిజం చెప్పాలంటే గీతూకి విన్నర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆటకి కాస్త అణకువ, మర్యాద కూడా జత అయితే ఆమెనే విన్నర్. ఎవరూ ఆపలేరు ఆమె విజయాన్ని. కానీ కేవలం ఆమె ప్రవర్తన, మాటతీరే దెబ్బేసింది. ఈ వారం ఆమెనే బయటకు వచ్చేసినట్టు పక్కా సమాచారం. ఆమెతో ఎవరైనా గొడవ పెట్టుకుంటే వారిని పదే పదే గొడవకు దిగేలా మాటలు విసురుతుంది. మర్యాద లేకుండా కసిరిపడేస్తుంది. నామినేషన్ సమయంలో ఇనయాతో ఆమె ప్రవర్తించే తీరు ఎప్పుడూ విమర్శలపాలవుతూనే ఉంది. కేవలం ఇనయానే కాదు రేవంత్ నామినేట్ చేసినా వెటకారంగా సమాధానం ఇస్తుంది. 

జంటను టార్గెట్ చేసి...
ఆ ఇంట్లో కామ్ అండ్ కంపోజ్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు మెరీనా  - రోహిత్. ఈ వారం వారిద్దరినీ టార్గెట్ చేసింది గీతూ. ప్రవర్తనలో, మాటతీరులో, మర్యాదలో వారిద్దరూ ఇంటి సభ్యుల అందరిలో మేటి అనే చెప్పాలి. అలాంటి వారిని టార్గెట్ చేసి ఏదేదో మాట్లాడ్డం కూడా ఈసారి కొంపముంచి ఉండొచ్చు. 

News Reels

సంచాలక్‌గా వరస్ట్ గా ప్రవర్తించి నాగార్జున చేత తిట్లు తింది గీతూ. పోనీ ఆ తరువాత వీక్ అంటే ఈ వీక్ ఏమైనా బాగా ఆడిందా అంటే తన ఆటతో పాటూ రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్ ఆటలకు కూడా రిమోట్ కంట్రోల్ లా మారింది. బిగ్ బాస్ చెప్పినదానికన్నా ఈమె చెప్పింది విన్నారే రెడ్ టీమ్ సభ్యులు. ఆమె బాలాదిత్య సిగరెట్లు దాచేయడం, అది కూడా మైండ్ గేమ్ అంటూ ఆయనతో బేరమాడడం ప్రేక్షకులకు పరమ చిరాకు తెప్పించింది. అందుకే ఎలిమినేట్ అయిందని చెప్పచ్చు. 

Also read: ఎట్టకేలకు కెప్టెన్ అయిన శ్రీసత్య, చివరి వరకు పోరాడి ఓడిన ఇనయా

Published at : 05 Nov 2022 06:17 PM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Inaya sulthana Geethu Elimination

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్