అన్వేషించండి

Bigg Boss Telugu 6 Episode 62: ఎట్టకేలకు కెప్టెన్ అయిన శ్రీసత్య, చివరి వరకు పోరాడి ఓడిన ఇనయా

Bigg Boss Telugu 6: 9 వ వారం ఇంటికెప్టెన్‌గా ఎన్నికైంది శ్రీసత్య.

Bigg Boss Telugu 6: మిషన్ పాజిబుల్ టాస్కు గొడవలు, అరుపులతో దద్దరిల్లిపోయింది. ఈ వారం ఇనయా  గొంతే ఎక్కువగా వినిపించింది. నామినేషన్స్ రోజు మొదలైన ఆమె ఏడుపులు, అరుపులు వారమంతా కొనసాగాయి. ఇంటికి కొత్త కెప్టెన్‌గా శ్రీసత్య ఎంపికైంది. ఆమెకు గీతూ, ఫైమా చాలా సాయం చేశారు. 

ఈ ఎపిసోడ్లో ఏమైందంటే...మిషన్ పాజిబుల్ టాస్క్ కొనసాగింది. ఇందులో గీతూ అవుట్ అవ్వడంలో ఫిజికల్‌గా ఆడే అర్హత కోల్పోయింది. అయినా కూడా బుద్ధిబలం అని చెబుతూ రాత్రి అందరూ పడుకున్నాక ఆదిరెడ్డి టీషర్టుపై ఉన్న బ్లూ స్ట్రిప్పులను తీసేసింది. ఆ బ్లూ స్ట్రిప్పులు తీసేస్తే ఆ వ్యక్తి గేమ్ నుంచి అవుట్ అయినట్టే. అయితే ఆదిరెడ్డి గేమ్ నుంచి అవుట్ అయిన నువ్వు ఈ పని ఎలా చేస్తావంటూ గీతూతో వాదన పెట్టుకున్నాడు. అంతేకాదు కోపంతో టీషర్ట్‌తో పాటూ మైక్‌ను నేలకేసి కొట్టాడు. ఆట పూర్తయ్యాక బిగ్‌బాస్ ఆ విషయాన్ని తప్పుబట్టారు. అలా మైక్‌ను నేలకేసి కొట్టడం వల్ల ఆదిరెడ్డి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడని చెప్పారు. ఇక ఫిజికల్‌గా ఆడే అర్హత కోల్పోయిన గీతూ ఆదిరెడ్డి స్ట్రిప్స్ దొంగిలించడాన్ని కూడా బిగ్ బాస్ సమర్థించలేదు. 

ఇక టాస్కు ముగిసే సమయానికి రెడ్ టీమ్, బ్లూ టీమ్ సభ్యులు సమానంగా ఉండడంతో ఆట డ్రా అయ్యింది. దీంతో ఇరుజట్ల కెప్టెన్లు ముగ్గురిని ఎంపిక చేసి కెప్టెన్సీ కంటెండర్లను చేయాలని చెప్పాడు బిగ్ బాస్. రెడ్ టీమ్ నుంచి గీతూ, శ్రీసత్య, ఫైమా వెళ్లారు. ఇక బ్లూటీమ్ నుంచి ఇనయా, వాసంతి, మెరీనా పోటీ పడ్డారు. అందరూ ఆడవాళ్లే పోటీ పడినందువల్ల ఏమో చాలా సింపుల్ టాస్కు ఇచ్చారు బిగ్ బాస్. 

వారికి ఒక్కొక్కరికి ఒక్కో బెలూన్ ఇచ్చి వాటిని కాపాడుకుంటూ ఇతరుల బెలూన్లను కాపాడుకోవాలని చెప్పారు. ఇందులో ఆదిరెడ్డి సంచాలకుడిగా ఉన్నారు. అయితే మొదటగా గీతూ అవుట్ అయింది. మెరీనా చేతిలో బెలూన్‌ను శ్రీసత్య కింద పడేసింది. దీంతో మెరీనా అవుట్ అయింది. ఇక వాసంతిని ఫైమా గీతూ ఒకేసారి ఎటాక్ చేసి బెలూన్ లాక్కుని పేల్చేశారు. దీంతో ఆమె అవుట్. ఇక వాసంతి, మెరీనా కలిపి ఫైమా బెలూన్ పగుల గొట్టారు. ఇక మిగిలింది ఇనాయ, శ్రీసత్య. ఇనాయకు అంతగా వాసంతి, మెరీనా సపోర్ట్ చేయలేదు. వాళ్లిద్దరినీ కలిపి ఫైమా ఒక్కటే అడ్డుకుంది. ఇక గీతూ, శ్రీసత్య కలిపి ఇనాయ బెలూన్ పేల్చేశారు. దీంతో శ్రీసత్య కెప్టెన్ అయింది. 

ఇనాయ ఓడిపోవడంతో శ్రీహాన్, రేవంత్, గీతూ, ఫైమా ఆనందంతో గెంతులు వేశారు. అరుపులతో హోరెత్తించారు. ఇనాయ కోపంగా వెళ్లలి కూర్చుని సపోర్ట్‌తో గెలిచారు అంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Inaya Sultana (@inayasulthanaofficial)

Also read: ఇనయాను ఎలిమినేషన్ తీసుకుని సూర్య ఇంటికెళ్లి కూర్చోమను - నోరుజారుతూ మరో గీతూలా మారిన శ్రీసత్యా

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Embed widget