News
News
X

Bigg Boss 6 Telugu: ఇనయాను ఎలిమినేషన్ తీసుకుని సూర్య ఇంటికెళ్లి కూర్చోమను - నోరుజారుతూ మరో గీతూలా మారిన శ్రీసత్యా

Bigg Boss 6 Telugu: గీతూ ఒక్కతే అనుకుంటే ఈ సీజన్లో నోరు జారే బ్యాచ్ ఎక్కువే ఉంది.

FOLLOW US: 
 
Bigg Boss 6 Telugu: ఆరు నెలలు కలిసుంటే వాళ్లు వీరవుతారని అంటారు, కానీ శ్రీసత్య కొన్ని వారాలకే గీతూతో కలిసి ఆమెలాగే తయారైంది. నోటికొచ్చింది మాట్లాడడం, అతిగా యాటిట్యూడ్ చూపించడం చూస్తుంటే వెళ్లే ముందు నెగిటివిటీ మూటగట్టుకుని వెళ్లేలా కనిపిస్తోంది. ఈరోజు రాబోయే ఎపిసోడ్‌లో రెచ్చిపోయి మాట్లాడింది. 

అసలేమైందంటే... సూర్య వెళ్లినప్పటి నుంచి ఇనయా చాలా ఫీలవుతోంది. అంతేకాదు అందరూ ఆమె వల్ల సూర్య వెళ్లిపోయాడని అని నానా మాటలు అన్నారు. నామినేషన్లో ఉతికేశారు. దీంతో ఇంకా ఫీలైపోతుంది. ఆమె సూర్య ప్లేటులోనే తినడం ప్రారంభించింది. ఆ ప్లేటు వెనుక సూర్య అని పేరు రాసి ఉంటుంది. ఇనయా ఆ ప్లేటు గురించి వెతికితే దొరకలేదు. ఎవరి దగ్గరైనా సూర్య ప్లేటు ఉంటే ఇవ్వండి అని అడిగింది. దానికి బాలాదిత్య ‘సూర్య ప్లేటుపై పేరును చెరిపేశారు’ అని చెప్పాడు. దానికి ఇనయా ‘నేను వాడుతున్నా అని తెలుసు కదా ఎందుకు చెరిపేశారు’ అని అడిగింది. ఈలోపు రేవంత్ చెరిపేశారని ఎందుకు చెప్పారని బాలాదిత్యను అడిగాడు. దానికి బాలాదిత్య ‘నాకు శ్రీసత్య చెప్పింది’ అని చెప్పాడు. దానికి ఇనయా గొడవపడింది. ఆ గొడవలోకి శ్రీహాన్ ఎంటర్ అయ్యాడు. పిల్లికి ఎలుక సాక్ష్యంలా మధ్యలో ఫైమా వచ్చి ఇనయాకు వ్యతిరేకంగా మాట్లాడింది. దీంతో శ్రీహాన్ మాట మార్చావు అంటూ రెచ్చిపోయాడు. ఫైమా ఇనయాను ఫ్రెండు అంటూనే ఆమెకు వ్యతిరేకంగా చాలా పనులు చేయడం, మాట్లాడడం చేస్తోంది. 

ఇనయా అన్నం తినకుండా ఓ మూల కూర్చుంటే... బాలాదిత్య వచ్చి అన్నం తినమని బతిమిలాడాడు. ఈలోపు అగ్నికి ఆజ్యం పోసిన ఫైమా కూడా వచ్చి అన్నం తిను అని అడిగింది. ఇనయా ‘నువ్వెళ్లు తల్లి వెళ్లు’ అనేసింది. నీ ఫ్రెండు కాదంటే చెప్పు వెళ్లిపోతా అంది ఫైమా. కాదని చెప్పేసింది ఇనయా. ఇక మెరీనా వచ్చి బతిమిలాడి అన్నం తినిపించింది. 

News Reels

నోరుజారిన శ్రీసత్య...
ఎలాంటి ఎమోషన్స్ లేకుండా, అవసరం కోసం అర్జున్ కళ్యాణ్‌ను వాడకుని వదిలేసిన శ్రీసత్య ఇనయా గురించి నోరుజారింది. ‘అంత ప్రేముంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ తీసుకుని వెళ్లిపోయి సూర్య ఇంటికెళ్లి కూర్చోమను’ అంది. అలా అనవద్దని వారించాడు రాజశేఖర్. గీతూతో స్నేహం మొదలుపెట్టినప్పట్నించి ఆమె కన్నా దారుణంగా తయారైంది శ్రీసత్య. 

ఇనయా దుస్తులు కింద పడేసి ఉన్నాయి, అలాగే వాష్ రూమ్ వరస్ట్ గా ఉంది. దీంతో ఇనయా వచ్చి ఎవరలా చేశారని గట్టిగా అరిచింది. తరువాత ఆదిరెడ్డి శ్రీసత్యతో ‘మీ వాళ్లే, మీ టీమ్ వాళ్లే చేశారు. వీక్‌నెస్ అనేది పట్టుకుని చేస్తున్నారు ఇలా’ అని అరిచాడు. దానికి శ్రీసత్య ‘బిగ్‌బాస్ ఇచ్చిన గేమ్ అదే, మీరేంటి రాంగ్ చెబుతారు’ అంది. బిగ్ బాస్ బుద్ధిబలంతో ఆడమంటే ఎదుటి వారి వీక్‌నెస్ తో ఆడుతున్నారు శ్రీసత్యా, గీతూ. వీళ్లకి ఎప్పుడు అర్థమవుతుందో బుద్ధిబలం అంటే ఏంటో?

ఎదురెదురుగా నిల్చుని కొట్టకునే టాస్కు ఇచ్చినట్టున్నారు. ఇక ఉన్మాది రేవంత్ ఎదుటివారిని కొట్టేలా చెయ్యేత్తాడు. దానికి ఆదిరెడ్డి అలా వద్దు బ్రో అని చెప్పాడు. దానికి రేవంత్ నువ్వు నాకు చెప్పకు అంటూ విరుచుకుపడ్డాడు. తాను కొడదామనుకున్నాడు కానీ తన కంటికే తగిలింది. అదే ఎవరి తీసిన గోతిలో వాళ్లే పడతారు అంటే ఇదేనేమో. 

Also read: తాను దొంగ, వెధవ, వెధవన్నర వెధవ అని ఒప్పుకున్న గీతూ - నిజమేనన్న ఆదిరెడ్డి

Published at : 03 Nov 2022 12:07 PM (IST) Tags: Revanth Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Sri Sathya Inaya sulthana

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు