Bigg Boss 17: మన్నారా చెంప పగలగొట్టిన ఇషా - బిగ్ బాస్ హౌజ్‌లో ముదిరిన గొడవ
Bigg Boss 17: బిగ్ బాస్ సీజన్ 17లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ముదిరిపోయి ఒకరిపై ఒకరు చేయి చేసుకునేవరకు వచ్చింది. తాజాగా మన్నారాపై ఇషా చేయి చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది.
Isha Malviya slaps Mannara Chopra: హిందీలో బిగ్ బాస్ సీజన్ 17 దాదాపు ఫైనల్స్‌కు చేరుకుంది. దీంతో ఎవరు విన్నర్ అవుతారు అని ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. జనవరి 28న బిగ్ బాస్ 17 ఫైనల్స్‌కు రంగం సిద్ధమయ్యింది. ఇక ఫైనల్స్ దగ్గర పడుతుండడంతో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రతీ ఒక్క కంటెస్టెంట్.. తామే ట్రోఫీ గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ 17లో నామినేషన్ టాస్క్ జరిగింది. ఆ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్‌గా విడిపోయారు. మామూలుగా బిగ్ బాస్ హౌజ్‌లో టాస్క్ అంటేనే కంటెస్టెంట్స్ మధ్య కచ్చితంగా గొడవలు అవుతాయి. ఇక ఈసారి జరిగిన గొడవలో ఒక కంటెస్టెంట్.. మరో కంటెస్టెంట్‌పై చేయి చేసుకుంది.
వాడివేడిగా నామినేషన్స్ టాస్క్..
నామినేషన్ టాస్క్ కోసం జరిగిన పోటీలో కంటెస్టెంట్స్ అంతా టీమ్ ఏ, టీమ్ బీగా విడిపోయారు. టీమ్ ఏలో అరుణ్ మాషెట్టి, అభిషేక్ కుమార్, మునావర్ ఫరూఖి, మన్నారా చోప్రా ఉన్నారు. టీమ్ బీలో అంకితా లోఖండే, విక్కీ జైన్, అయేషా ఖాన్, ఇషా మాల్వియా ఉన్నారు. ఈ టాస్క్ ప్రకారం ఒక టీమ్ కంటెస్టెంట్స్ అంతా బోనులో ఉండిపోయి.. బజర్‌ను ప్రెస్ చేయాలి. మరొక టీమ్.. అవతలి టీమ్ ఆ బజర్ ప్రెస్ చేయకుండా ఆపగలగాలి. అదే సమయంలో టీమ్ బీ.. టీమ్ ఏను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇక ఈ టాస్క్ జరుగుతున్న సమయంలో, టాస్క్ అయిపోయిన తర్వాత ఇతర కంటెస్టెంట్స్ అంతా మన్నారా చోప్రాను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
మన్నారాను టార్గెట్..
మన్నారా ఎప్పుడూ చిన్నపిల్లలతోనే ఉంటుంది అంటూ తనపై నెగిటివ్‌గా కామెంట్స్ చేయడం మొదలుపెట్టింది ఇషా. ఇక మన్నారా ఎప్పుడూ మునావర్ ఒడిలోనే కూర్చుంటుంది అంటూ అంకితా కూడా అభ్యంతరకరంగా మాట్లాడింది. అంకితా చేసిన వ్యాఖ్యలకు విక్కీ ఒప్పుకున్నాడు. అలా అంకితా, ఇషా కలిసి తమ మాటలతో మన్నారాను చాలా ఇబ్బందిపెట్టారు. మన్నారాకు ఇలా జరగాల్సిందే అంటూ కొంచెం కూడా ఆలోచన లేకుండా మాట్లాడింది అంకితా. మాటలు చాలవు అన్నట్టుగా ఇషా మాల్వియా.. మన్నారాపై చేయి కూడా చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా చూసి బిగ్ బాస్ సీజన్ చివరిదశకు చేరుకున్నా కూడా కంటెస్టెంట్స్ విచక్షణ లేకుండా ప్రవర్తించడం ఆపడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
#IshaMalviya slaps #MannaraChopra ? #BiggBoss17 #BB17 #BiggBoss pic.twitter.com/YBCvRM3FlQ
— Biggboss Khabri (@BiggbossKaTadka) January 18, 2024
సల్మాన్ ఖాన్ మందలించాల్సిందే..
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వాగ్వాదం జరుగుతుండగా.. అక్కడికి వచ్చి ఇషా.. అక్కడే ఉన్న మన్నారాను చెంపపై కొట్టి పక్కకు తప్పుకోమని చెప్పింది. అంతే కాకుండా తనను నెట్టేసింది కూడా. ఇది చూసిన మన్నారా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ వచ్చినప్పుడు కచ్చితంగా ఈ విషయంపై మట్లాడాలని, ఇషాను మందలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజాగా జరిగిన నామినేషన్స్ టాస్క్‌లో టీమ్ బీ ఓడిపోవడంతో అందులోని కంటెస్టెంట్స్.. అంకితా లోఖండే, విక్కీ జైన్, ఇషా మాల్వియా, అయేషా ఖాన్.. ఎలిమినేషన్‌ను ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. మునావర్, అభిషేక్ కుమార్, అరుణ్ శ్రీకాంత్, మన్నారా చోప్రా.. ఈ టాస్కులో గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్నారు.
Also Read: ‘సరిపోదా శనివారం’ సెట్స్‌లో జాయిన్ అయిన స్టార్ యాక్టర్ - కన్ఫర్మ్ చేసిన మూవీ టీమ్!