Dhanush Idly Kottu Movie Review In Telugu | ధనుష్, నిత్య మీనన్ ఇడ్లీ కొట్టు ఎలా ఉందంటే.? | ABP Desam
యాక్టర్ గా నిరూపించుకోవాలి అంటే లార్జర్ దేన్ ది లైఫ్ కథలే అక్కర్లేదు. చిన్న పాయింట్ ఉంటే చాలు దాన్ని ఎంత హృద్యంగా చెబుతున్నామనేదే సినిమా అని ప్రూవ్ చేస్తూ...ఓ నటుడిగా ఎన్నో మంచి సినిమాలు తీసుకుంటూ వెళ్తున్న యాక్టర్ ధనుష్. ఆయనకు పవర్ ఫుల్ హీరోయిన్ నిత్యామీనన్ తోడైతే..దానికి ఓ మంచి కథ పడితే ఎలా ఉంటుందో వెళ్తా ఇడ్లీ కొట్టు అలా ఉంది. రీసెంట్ గా రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలతో డైరెక్టర్ గానూ ఫుల్ స్పీడ్ లో ఉన్న ధనుషే ఇడ్లీ కొట్టు సినిమాను తనే రాసి తనే డైరెక్ట్ చేసి తనే హీరోగా యాక్ట్ చేశారు.
కథ విషయానికి వస్తే సింపుల్ కథ. ఓ ఊళ్లో ఇడ్లీ కొట్టు నడుపుకునే ఓ వ్యక్తి కొడుకు తన లైఫ్ తన తండ్రిలా ఉండకూడదని ఉన్నతంగా ఉండాలని కలలు కని విదేశాల్లో ఓ స్టార్ హోటల్ చైన్ లో ఓ మంచి పొజిషన్ కు చేరుకుంటాడు. కానీ ఆ తర్వాత తన జీవితంలో ఏం కోల్పోతున్నాడో అర్థం చేసుకుని తిరిగి తన ఊరికి వచ్చి తన తండ్రి నడిపిన ఇడ్లీ కొట్టును నడపాలని డిసైడ్ అవుతాడు. అయితే తన ఎదుగుదలకు ఎవ్వరు కారణమయ్యారో ఇప్పుడు వాళ్లే తన తండ్రి హోటల్ ను నడిపించుకుంటానంటే అడ్డుపడతారు. వాళ్ల నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడు. తన తండ్రి ఆశయాన్ని ఎలా నిజం చేసి చూపించాడు అనేది సినిమా కథ. వాస్తవానికి ఇదంతా ట్రైలర్ లో చూపించేసిన కథనే. సినిమాలో స్టోరీ కూడా అంతకు మించి ఏం కత్తి మీద సాము చేయదు. కానీ ఆ సింగిల్ లైన్ చుట్టూ ధనుష్ రాసుకున్న ఎన్నో పాత్రలు..ఆ పాత్రల తాలుకూ బ్యాక్ స్టోరీస్ అన్నీ కలిసి ఇడ్లీ కొట్టు సినిమాను ఓ మంచి సినిమాగా నిలబెట్టే ప్రయత్నం చేశాయి. ధనుష్ తన చిన్నప్పుడు తన ఊరికి వెళ్లినప్పుడు చూసిన ఓ ఇడ్లీ కొట్టు ఆధారంగా ఈ కథ రాసుకున్నారట. ఆ నేచురాలిటీ ఉంటుంది సినిమాలో.





















