BCCI vs PCB | Asia Cup 2025 | ఆసియా కప్ ట్రోఫీపై ముదురుతున్న వివాదం
ఆసియా కప్ 2025 ఫైనల్ గెలిచిన తర్వాత ఇండియా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. ఇప్పుడు ఈ ట్రోఫీ వివాదం అంతర్జాతీయ క్రికెట్ కమిటీ వరకు వెళ్ళింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ తీరుపై బీసీసీఐ ఫైర్ అయింది. మనవాళ్లు ట్రోఫీ నిరాకరించడంతో నఖ్వీ ట్రోఫీ ఇవ్వకుండా తనతో పాటు తీసుకుపోవడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని తనతోపాటు హోటల్ కు తీసుకోని వెళ్ళిపొయ్యారు అని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా ఆరోపించారు. ట్రోఫీ ఏసీసీ ఆస్తి అని, దానిని ఆలా తీసుకువెళ్లడం కరెక్ట్ కాదని అని ఆయన ఖండించారు. ట్రోఫీని వెంటనే భారత జట్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దుబాయ్‌లో జరిగే ఐసీసీ మీటింగ్ లో ఏసీసీ ఛైర్మన్ పై ప్రొటెస్ట్ చేస్తామని బీసీసీఐ కార్యదర్శి సైకియా పేర్కొనట్టుగా తెలుస్తుంది.
టీమ్ ఇండియా ఇలా ట్రోఫీ నిరాకరించడం... నక్వీ ట్రోఫీని తనతో పాటు తీసుకోని వెళ్లడం అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో పెద్ద ఇష్యూగా మారింది. మరి ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోనుందో చూడాలి.



















