Women World Cup 2025 | Smriti Mandhana | ట్రోల్స్ ఎదుర్కొంటున్న స్మృతి మంధాన
ఇండియా శ్రీలంక మధ్య జరిగిన మొదటి విమెన్ వరల్డ్ కప్ మ్యాచ్ లో స్టార్ బ్యాట్స్మన్ స్మృతి మంధాన అవుట్ అయిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొలి మ్యాచ్‌లోనే పేలవమైన షాట్ ఆడి పెవిలియన్ చేరింది స్మృతి మంధాన. నాల్గవ ఓవర్‌లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ప్రబోధని మంధానను అవుట్ చేసింది. దాంతో కేవలం 8 పరుగులు చేసి మైదానాన్ని వీడింది.
స్మృతి మంధాన క్రీజులోకి వచ్చినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా తన బ్యాటింగ్ మొదలు పెట్టింది. శ్రీలంకపై 2 ఫోర్లు కూడా కొట్టింది. కానీ, నాల్గవ ఓవర్‌లో, ఆఫ్ స్టంప్ వెలుపల ఏరియల్ షాట్ ఆడింది. బంతి నేరుగా విష్ణు గుణరత్నే చేతుల్లోకి వెళ్ళింది. దాంతో ఎంతో నిరాశతో మందాన అక్కడ నుంచి వెళ్ళిపోయింది. స్మృతి మంధాన అవుట్ అయిన తర్వాత క్రికెట్ నిపుణులు అందరు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. నిజం చెప్పాలంటే ఈ వరల్డ్ కప్ లో అందరికన్నా ఫేవరేట్ ప్లేయర్ గా నిలిచింది మంధాన. దాంతో ప్రపంచ కప్‌లో ఇలాంటి షాట్ ఆడి అవుట్ అవడంతో చర్చనీయాంశంగా మారింది.





















