Bigg Boss 6 Telugu Episode 72: అరుపులు, కేకలు లేకుండా సాఫీగా సాగిన నామినేషన్ ప్రకియ, ఈసారి నామినేషన్లో ఉన్నది వీళ్లే
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్లు కూడా చప్పబడినట్టు కనిపిస్తున్నాయి.
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 మిగతా సీజన్లతో పోలిస్తే చాలా చప్పగా సాగుతోంది. నిజం చెప్పాలంటే శనివారం నాగార్జున వచ్చే ఎపిసోడ్, సోమవారం నామినేషన్ ఎపిసోడ్ మాత్రమే కాస్త అలరిస్తున్నాయి. ఇప్పుడు నామినేషన్ ఎపిసోడ్ కూడా చప్పబడి పోయినట్టు కనిపించింది. 11వ వారం నామినేషన్లు కూల్‌గా సాగాయి. శ్రీసత్య - కీర్తి కాసేపు వాదించుకున్నారు, అలాగే ఇనాయ - రాజ్ కూడా వాదించుకున్నారు. వీరు కూడా వాదించుకోకపతే నామినేషన్ ఎపిసోడ్ ఇంకా తేలిపోయేది.ఆదిరెడ్డి - ఇనాయ మధ్య గట్టిగానే వాదోపవాదాలు అవుతాయని అనుకున్నారంతా,అలాగే శ్రీహాన్ ఇనాయను నామినేట్ చేసినా గొడవ జరిగేది. కానీ అలా జరగలేదు.
ఎపిసోడ్లో ఏముందంటే.. బిగ్ బాస్ బకెట్లో చెత్త నింపి రెడీగా పెట్టారు. ఇంటి సభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటారో వారిపై చెత్త పోసి నామినేషన్ రీజన్ చెప్పాలని చెప్పారు. ఫైమా ఇంటి కెప్టెన్ కావడంతో ఆమెను ఎవరూ నామినేట్ చేయలేదు. ఆదిరెడ్డి తాను ఎప్పుడూ నామినేట్ చేసే ఇనాయను వదిలేసి కొత్తగా శ్రీహాన్, రోహిత్ ను నామినేట్ చేశారు. వాసంతి సంచాలక్‌గా తప్పు చేసినప్పుడు మీరు పక్కన ఉన్నారు, అయినా ఆపలేదు. సంచాలక్ తప్పు వల్ల గెలవాలి అనుకోవడం నాకు నచ్చలేదు అని అన్నాడు ఆదిరెడ్డి. ఫైమా కూడా రోహిత్ ను నామినేట్ చేసింది. తాను ‘ఎఫ్’ అనే పదం రెండు సార్లు వాడారని అందుకే నామినేట్ చేసినట్టు చెప్పింది. తరువాత ఇనాయను నామినేట్ చేసింది. ఆమె అమ్మాయిలో ఫిజికల్ అవుతుందని చెప్పింది.
చెత్త పోసుకున్న ఆదిరెడ్డి
ఇనాయ ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. కోపం విషయం వీరిద్దరి మధ్యలో చిన్న జరిగింది. అది కూడా చాలా కూల్ గా సాగింది. దీంతో ఆదిరెడ్డి చెత్త తీసి నెత్తిమీద పోసుకున్నాడు. అందరూ నవ్వారు. ఇనాయ తరువాత రాజ్‌ను నామినేట్ చేసింది. ఇనాయ ‘ఒక పాయింట్ నుంచి వేరే పాయింట్‌కు వెళ్తుంది అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చావ్, వితండ వాదం చేస్తుంది అన్నావ్, అది నేను తీసుకోవడం లేదు’ అని నామినేట్ చేసింది. రాజ్ ఆ విషయంలో వాదించాడు.
శ్రీసత్య యాటిట్యూడ్...
హౌస్‌లో అందగత్తెలా ఫీలయ్యే శ్రీసత్య కీర్తిని నామినేట్ చేస్తూ చాలా యాటిట్యూడ్ చూపించింది. ఈమె ఈ యాటిట్యూడ్ వదులుకోకపోతే వచ్చే రెండు వారాల్లో ఎలిమినేట్ కావచ్చు. లేదా టాప్ 6కి వెళ్లినా టాప్ 3లో మాత్రం ఉండడం కష్టమే. శ్రీసత్య కీర్తిని నామినేట్ చేసింది. తనకు ఆదివారం ఇగో అనే ట్యాగ్ ఇవ్వడాన్ని శ్రీసత్య తప్పుబట్టింది. కీర్తి పిలిచినప్పుడు తనకు వినిపించకపోవడం వల్లే పలకలేదని చెప్పింది శ్రీసత్య. కీర్తి మాత్రం తన ముందు నుంచే వెళుతూ వినపడకపోవడం ఏంటని ప్రశ్నించింది. శ్రీసత్య ‘ఓవర్ థింకింగ్ చేయద్దు’ అంటూ కీర్తిని అంది. ఆ సమయంలో చాలా యాటిట్యూడ్ చూపించింది.
ఇక ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే..
1. రోహిత్
2. ఇనాయ
3. శ్రీహాన్
4. ఆదిరెడ్డి
5. రాజ్
6. రేవంత్
7. మెరీనా
8. శ్రీసత్య
9. కీర్తి
Also read: ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 6 గ్లామర్ డాల్ వాసంతి అవుట్